Site icon Sanchika

అందరూ దొంగలే

[dropcap]ప[/dropcap]ని చెయ్యొద్దు ఫరవాలేదు
ఇంటికి పింఛను తెచ్చి ఇస్తా
తెల్ల రేషన్ కార్డు ఇస్తా
ఉచితంగా అన్నీ నీకిస్తా

వ్యాపారాలు చేసుకోండి
ఇన్‌కమ్ టాక్సు ఎగ్గొట్టండి
ఉద్యోగాలు తీసుకోండి
బలాదూర్‌గా తిరగండి

ఎన్నికలు వస్తున్నాయండి
మీ ఓటు నాకే వెయ్యండి
తాయిలాలు ఇస్తాం చాలా
హాయిగా నిద్రపోండి

అధికారం వస్తే చాలు
అంధకారం వస్తే ఏంటి
మీవి మీరు తీసుకోండి
మావి మేము తీసుకుంటాం

దేశం ఏమయితే నాకెందుకు
నువ్వు తిను నేను తింటా
దోచుకునేవాడే మొనగాడు
దాచుకునేవాడే బ్రతుకుతాడు

Exit mobile version