Site icon Sanchika

అంధకారం

[dropcap]చం[/dropcap]దమామ లాంటి మోము
దొండపండు లాంటి పెదవులు
కలువలు లాంటి కన్నులు
నల్లత్రాచు లాంటి వాలుజడ
రత్నాల వంటి పలు వరస
ముక్కెరతో ముచ్చటైన ముక్కు
నీ‌ అందం అనే అంధకారంలో
పడిపోయాను నేను….

ఆ అంధకారం తప్ప ఏమీ కనిపించటం లేదు
ప్రేమ గుడ్డిది అంటారు జనులు
ప్రేమ కాదు ప్రేమికుడు గుడ్డివాడు

జ్ఞానమనే వెలుగు రేఖలు కనిపించేదెప్పుడో
నా ధ్యాస శ్వాస‌ అంతా నీవే
నా అస్థిత్వాన్ని కోల్పోయానేమో
నేను ఎవరో నేను ఎప్పుడు తెలుసుకుంటాను..
నీవు అనే అంధకారం నుండి
నేను అనే వెలుగు వైపు ఎప్పుడు
చేరుకుంటానో…..
నన్ను నేను ఎప్పుడు తెలుసుకుంటానో

Exit mobile version