Site icon Sanchika

అన్న మొగ్గలు

గుండెలో పెట్టుకుని కంటికి రెప్పలా చూస్తూనే
గుండెంత ధైర్యాన్ని ఇస్తూ వెన్నంటి ఉంటాడు
కష్టాల కడలిలో కన్నీళ్ళు తుడిచే నావికుడు ‘అన్న’

అమ్మ లేని లోటును తీరుస్తూ అన్నీ తానవుతూనే
నాన్న అనురాగాన్ని అక్షయ పాత్రలా అందిస్తాడు
కష్టాల చీకటిలో దారి చూపే కాంతిపుంజం ‘అన్న’

రక్తం పంచుకుని పుట్టిన ప్రేమానురాగాలతోనే
చివరి రక్తపు బొట్టువరకు బాధ్యత తీసుకుంటాడు
ఇలలో నిత్యం కాపాడే ప్రత్యక్ష దైవం ‘అన్న’

నాన్న తరువాత ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూనే
బాధ్యలను పంచుకుంటూ పెద్దన్న పాత్ర పోషిస్తాడు
ఇంటిల్లిపాదికి రక్షణ కల్పించే సైనికుడు ‘అన్న’

Exit mobile version