Site icon Sanchika

అనూహ్య స్వప్నాలు

[dropcap]దా[/dropcap]హమై మిగలడమైనా
దాహం కాలేక రగలడమైనా
మనసుదీపాన్ని ప్రజ్జ్వలింప చేసికోవడమే.

మోడై గ్రీష్మానికెదురునిలచినా
వసంతపు తొలిచిగురైతే
కొత్త ఊపిరి అందుకోవడమే

మరలిపోయిన స్మృతి ఐనా
పొత్తిళ్ళలో పులకింతైతే
అద్భుతాన్ని పొదువుకోవడమే

స్వాప్నికుడి అంతరంగ కవనమైనా
కోటి గుండెల గొంతుకైతే
జీవనగీతిక పల్లవించడమే.

సాహసికుడి అంతుతెలియని పయనమైనా
అంతర్జ్వలన తోడైతే
గమ్యం ముంగిట నిలవడమే

Exit mobile version