[dropcap]”U[/dropcap]ntouchable Nirbhayas of India And One Billion Rising” అనే ఆంగ్ల నవలకి స్వేచ్ఛానువాదం ‘అంటరాని దేవతలు’. ఆంగ్లంలో డా. శామ్ పసుమర్తి వ్రాసిన ఈ నవలను ద్విభాష్యం రాజేశ్వరరావు తెలుగులోకి అనువదించారు.
***
“ఏ స్వీయ చరిత్ర అయినా; వ్రాసే వారి కాలములో జరుగుతున్న సంఘటనలు, మంచి చెడులను ప్రతిబింబించాలి. డా. శామ్ పసుమర్తి గారితో కొన్ని దశాబ్దాలుగా అనేక విషయాలను ముచ్చటించడం జరుగుతూ వస్తోంది. ఆయన డాక్టర్‍గా ఎంతో నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకున్నారు. వ్యక్తిగా ఉన్నతమైన విలువలు, ఆశయాలు కలిగిన మంచి మిత్రులు.
నవల అనువాదానికి ప్రముఖ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు అంగీకరించడమే కాకుండా ‘డాక్టర్ గారి అనుమతి, ప్రోత్సాహంతో స్వేచ్చానువాదం’ చేశారు. నవలకి వన్నె తెచ్చిన ఘనత రాజేశ్వరరావు గారి చాతుర్యమే!!
ఒక పేద దళిత స్త్రీ జీవితాన్ని ఆవిష్కరించనపుడు అనువాదకులు; రావి శాస్త్రి గారి (రత్తాలు-రాంబాబు) నవలలో రత్తాలు మంచితనాన్ని జ్ఞాపకం చేశారు.
ఈ నవల అనేక సందేశాల్ని అందజేస్తుందని అనడంలో అతిశయోక్తి లేదు. అంటరానితనం ప్రాబల్యంలో వున్న రోజుల్లో ధైర్యంగా సమాజంలోని అగ్రకులాన్ని ఎదుర్కొని దళితుల విముక్తికి, సంక్షేమానికి పాటుపడ్డ కుటుంబాలలో డా.పసుమర్తి దుర్గాప్రసాద్ గారు, వారి సుపుత్రుడు డా. పి.ఎస్.ఎన్.మూర్తి గారు ప్రముఖులు. ఒక దళిత అనాథ మృతి చెందినపుడు ఆమె దహన సంస్కారం జరిపిన ఉన్నత వ్యక్తులు!
స్నేహం, సేవ, సమాజ మార్పుల కోసం జీవితాన్ని అంకితం చేసిన డా. శామ్ పసుమర్తి గారి స్వీయ చరిత్రకి ఒక నవలా రూపం ద్వారా ఎన్నో మంచి విలువలని అందజేసినందుకు డా. మూర్తిగారికి, తన విశిష్టమైన శైలిలో అనువదించిన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారికి అభినందనలు, ధన్యవాదాములు.
మంచి పుస్తకం ద్వారా వ్యక్తులకు, సమాజానికి ఎంత మేలు జరుగుతుందో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. ఈ నవల హృదయానికి హత్తుకునే ఒక కానుక” అని అన్నారు ‘నా మాట’లో ప్రొఫెసర్ ఎ. ప్రసన్నకుమార్.
***
ఆంగ్లమూలం: డాక్టర్ శామ్ పసుమర్తి; తెలుగు: ద్విభాష్యం రాజేశ్వరరావు.
పేజీలు: 272; వెల: 200;
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్. విజయవాడ; ఫోన్: 0866–2430302;
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.