పర్యావరణం కథలు-8: అంతరిక్షంలో కాలుష్యం

0
2

[box type=’note’ fontsize=’16’] పర్యావరణం కథలలో భాగంగా, ‘అంతరిక్షంలో కాలుష్యం’ అనే కథలో స్పేస్ జంక్ గురించి సరళమైన కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]వే[/dropcap]సవి సెలవలు అంటే సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయ్యింది. పిల్లలకు ఆటవిడుపు. సమ్మర్ క్యాంప్స్, ఈవెనింగ్స్ గల్లీ క్రికెట్, మాల్స్, మూవీస్, హాలిడే టూర్స్ ఒకటే సందడి.

ఫ్రెండ్స్‌తో సాయంత్రపు ఆటలు మాటలు అయ్యాక కొద్దిసేపు టీవీ చూసి, డిన్నర్ తరువాత నిఖిల్ నాన్నతో టెర్రస్ మీదకు వచ్చాడు. కొద్దిసేపటికి అమ్మ,చెల్లి అఖిల కూడా వచ్చారు. అమ్మ వేడి వేడి పాలలో ఇలాచీ పొడి వేసి తెచ్చింది. పాలు తాగుతూ నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని పరీక్షగా చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా అందరూ కలిసి స్కై వాచింగ్… అదే… ఆకాశ వీక్షణం చేస్తుంటారు.

పిల్లలకు అదొక పెద్ద సరదా. ఆకాశం చూస్తూ అమ్మ నాన్నల బాల్యపు జ్ఞాపకాలను వింటూ తమ స్కూల్, ఫ్రెండ్స్ కబుర్లు చెబుతూ ఎంజాయ్ చేస్తారు. ఒకొక్క ఋతువులో స్కై ల్యాండ్ స్కేప్ లో వచ్చే మార్పులు; స్టార్స్, మిల్కీ వేస్, షూటింగ్ స్టార్స్, క్లౌడ్స్, ఫుల్ మూన్ బ్యూటీ, రెయినీ డే లో డార్క్ స్కైస్, వింటర్‌లో ఫుల్ మూన్ డేస్ ఇలా ఎన్నో ఆస్వాదిస్తున్నారు. లక్కీ కిడ్స్. ఎంత మంది కిడ్స్ టీవీ, స్మార్ట్ ఫోన్, గాడ్జెట్స్ వదిలి ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ, ప్రేమిస్తూ, సహజీవనం చేయగలుగుతున్నారు?

స్కై వాచ్ చేస్తున్న నిఖిల్‌కి వేగంగా దూసుకువచ్చిన స్టార్ లాంటిది కనిపించి మాయం అయింది. అఖిలకి కూడా కనిపించింది.

“నాన్నా! అటు చూడు. అరే! ఎక్కడ ఆ స్టార్? గాయబ్ అయిందే” అంది ఆశ్చర్యంతో.

నాన్నకి వారు చెప్పింది దేని గురించో అర్థం అయింది.

“స్కైలో మీకు షూటింగ్ స్టార్స్, మూవ్ అవుతున్న స్టార్ లాంటి శాటిలైట్స్ ఇంకా స్పేస్ లోని ఇతర ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇట్స్ ఫన్ టు వాచ్” అన్నారు.

“నాన్నా! స్పేస్‌లో కూడా చెత్త.. డెబ్రీ… ఉన్నదని నా ఫ్రెండ్ చెప్పాడు నిజమేనా?” అన్నాడు నిఖిల్.

“అవును. నిజమే”

“అదెలా? ఎర్త్ మీద అంటే మనుషులు చెత్త, పొల్యూషన్ చేస్తున్నారు. మరి స్పేస్‌లో కంట్రీస్, హౌసెస్ ఉండవుగా సో ఎవరు చెత్త చేస్తున్నారు?” అనడిగింది అఖిల అమాయకంగా.

“సరైన డౌట్. స్పేస్‌లో ఇంతకూ ముందు లాంగ్ లాంగ్ టైం బ్యాక్… నువ్వు అడిగినట్లు ఎవ్వరు లేరు. కానీ సైన్స్ అడ్వాన్సు అయిన కొద్దీ శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగమే స్పేస్ గురించిన పరిశోధనలు. మీ గ్రాండ్ పా టైం లో చంద్రుడి మీద ఏమి ఉందో? ఎలా ఉంటుందో తెలీదు. కానీ మీరు మూన్, మూన్ మిషన్, మార్స్ మిషన్ ఇలా చాల వింటున్నారు.”

“సో వాట్?” అని డాడ్‌ని డిస్టర్బ్ చేసింది అఖిల.

“విను. నిఖిల్, మూన్ మీద ఫస్ట్ ల్యాండ్ అయ్యింది ఎవరు?”

“నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ అపోలో 11 అనే స్పేస్ ఫ్లైట్ లో ల్యాండ్ అయ్యారు.”

గుడ్. అమెరికన్ వ్యోమగాములు ఇద్దరు 1969 జులై 2న చంద్రునిపై కాలుపెట్టారు. వాళ్లకంటే ముందుగా 1961లో సోవియట్ కాస్మోనాట్ యూరి గగారిన్ తొలి అంతరిక్ష నావ అదే స్పేస్ క్రాఫ్ట్ ‘vostok 1’లో స్పేస్ లోకి వెళ్లి భూమి ఆర్బిట్‌ని చుట్టి వచ్చాడు. అంతకంటే ముందు అక్టోబర్ 4 1957 లో సోవియట్ యూనియన్ తొలి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ‘sputnik 1’ని స్పేస్‌లో ప్రయోగించింది.”

“నాన్నా స్పేస్ డెబ్రీ గురించి అడిగితే ఇంకేవో చెబుతున్నావు?” అన్నాడు నిఖిల్.

“అది చెప్పటానికే ఈ ఇంట్రడక్షన్. దాదాపు 1950 నుండి అనేక దేశాల శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అనేక రకాల స్పేస్ షిప్స్, రాకెట్స్, ఉపగ్రహాలు(శాటిలైట్స్) లాంటివి స్పేస్‌లోకి పంపారు. స్పేస్‌లో 1971 నుండి ఇప్పటిదాకా 11 స్పేస్ స్టేషన్స్ ఎర్త్ ఆర్బిట్ లోకి వెళ్లాయి. వాటిలో కొన్ని స్కైలాబ్, mir, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్.”

“అవునా? ఇంకా? మరి శాటిలైట్స్?” అన్నాడు నిఖిల్.

“UN office for outer space affairs అంచనాల ప్రకారం 4857 ఉపగ్రహాలు ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్నాయిట. ఆగష్టు 22 2018 నాటికీ 204 స్పేస్ ఆబ్జెక్ట్స్‌ని 4.79 శాతం పెరుగుదలతో అడిషనల్‌గా స్పేస్‌లో ప్రవేశపెట్టారుట.”

“అమ్మో! ఎన్నో!” అంది అఖిల.

“మానవ నిర్మితం అంటే మాన్ మెడ్ స్పేస్ ఆబ్జెక్ట్స్‌, టైం అవుట్ అయినవి ఇతర స్పేస్ ఆబ్జెక్ట్స్‌ ఢీ కొట్టి ముక్కలైన అనేక శకలాలు వేల మైళ్ళ దూరంలో ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి. వాటినే స్పేస్ జంక్ లేదా స్పేస్ పొల్యూషన్ అంటారు. అమెరికా, రష్యాకి చెందిన స్పేస్ ఏజెన్సీస్ అంచనా ప్రకారం ట్రిలియన్స్… లెక్క పెట్టలేనన్ని చిన్న చిన్న శిథిలాలు భూమి కక్ష్యలో కిక్కిరిసిపోయాయి అంటే ప్యాకెడ్‌గా తిరుగుతున్నాయట. ఊహించండి” అన్నారు నాన్న.

కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం. నిఖిల్, అఖిల ఊహించుకుంటున్నారు అదెలా ఉంటుందా అని.

“టూ బాడ్. మన సిటీ కన్నా ఎక్కువ ట్రాఫిక్ జామ్‍లా ఉంది” అంది అఖిల.

“భలే గెస్ చేసావు” అని నాన్న మెచ్చుకున్నారు.

“నాన్నా, స్పేస్ జంక్‌లో ఏమి ఉంటాయి?” అన్నాడు నిఖిల్

“అన్ని రకాలు. All varieties. మీకు అర్థం కావటానికి, స్పేస్ జంక్‌ని 3 రకాలుగా చెబుతా. మొదటిది manmade space junk.”

“అంటే?”

“ఎర్త్ నుండి స్పేస్ లోకి పంపిన ఉపగ్రహాలు, రాకెట్స్, స్పేస్ స్టేషన్స్, రాకెట్ బూస్టర్స్, ఇతర వెహికల్స్, పరికరాలు.. ఇంకా ముక్కలైన ఆబ్జెక్ట్స్‌, శాటిలైట్స్ పనిచేసేవి, చెయ్యనివి వాటి పార్ట్స్, ఎర్త్ ఆర్బిట్‌లో తిరుగుతూ, ఢీ కొట్టుకుంటూ ఉన్నాయి.”

అఖిల బుగ్గన చెయ్యి పెట్టుకుని ఊహించుకుంటోంది స్పేస్‌లో జరిగే గందరగోళాన్ని.

“విను. నెక్స్ట్ రాకెట్ డెబ్రీ/జంక్. రాకెట్‌ని స్పేస్‌లోకి వదలటానికి ఉపయోగించే లాంచర్లు, ఇతర పరికరాలు స్పేసులో ఉండిపోతాయి. కొన్ని సార్లు ఎర్త్ మీదకి పడిపోతాయి. రెండోది natural junk. ఉల్కలు, షూటింగ్ స్టార్స్, meteorites, solar family కి అవతల వైపు నుండి కొన్నిసార్లు రాళ్లు, దుమ్ముతో ఉన్న బరువైనవి వేగంగా వచ్చి ఎర్త్ గ్రావిటీ వల్ల భూమిని తాకుతాయి.”

“నాన్నా! స్పేస్ జంక్ ప్రమాదమా?” అన్నాడు నిఖిల్

“స్పేస్ జంక్ ఇతర స్పేస్ ఆబ్జెక్ట్స్‌, ఉపగ్రహాలు, స్పేస్ స్టేషన్ల పరిభ్రమణం మీద వ్యతిరేక ప్రభావం అంటే నెగెటివ్ ఎఫెక్ట్ చూపవచ్చు. 2009లో ఇరిడియం 33 అనే శాటిలైట్ రష్యన్ శాటిలైట్ కొస్మోస్ 2251 ని స్పేస్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రమాదవశాత్తు ఢీ కొట్టిందిట. ఫస్ట్ యాక్సిడెంట్ ఇన్ స్పేస్…. అంతరిక్షంలో మొదటి యాక్సిడెంట్.

“నాన్నా! అంటే రోడ్ యాక్సిడెంట్‌లో రెండు కార్లు స్పీడ్‌గా ఢీ కొట్టుకున్నట్లా?” అంది అఖిల.

నాన్న నవ్వి అఖిలను దగ్గరకు తీసుకుని “అలాంటిదే” అన్నారు

“నాన్నా మరి స్పేస్లో వాక్ చేసే ఆస్ట్రోనాట్స్‌కి డేంజర్ కాదా?”

“కొంతవరకు నీ డౌట్ ఓకే. వ్యోమగాముల స్పేస్ షూట్స్ స్పేస్ జంక్ ఎటాక్ నుండి సేవ్ చెయ్యలేవుట.”

“స్పేస్ జంక్‌ని ఎవరు క్లీన్ చేస్తారు? మనకు జిహెచ్‌ఎంసి గార్బేజ్ వ్యాన్ వస్తుంది” అంది అఖిల.

“1950 నుండి పేరుకుపోతున్న స్పేస్ జంక్‌ను అనేక ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ కలిసి క్లీన్ చెయ్యటానికి ట్రై చేస్తున్నాయిట.”

“నాన్నా! స్పేస్ జంక్ క్లీన్ చెయ్యకపోతే ఏమవుతుంది?”

“స్పేస్ జంక్ క్లీన్ చెయ్యకపోతే ఫ్యూచర్‌లో సైంటిస్ట్స్ స్పేస్‌లో ప్రయోగాలు చెయ్యాలంటే ఆ చెత్తే అడ్డం వస్తుందిట. ఫ్యూచర్‌లో స్పేస్ ట్రావెల్, స్పేస్ సిటీలకు వెళ్లాలంటే ఇబ్బంది కావచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్‌కి ప్రమాదం రావచ్చు. స్పేస్ జంక్ అడ్డం వచ్చి, తగిలి మరిన్ని ముక్కలు /శకలాలు ఏర్పడవచ్చు. 2007లో ఒక దేశం తన కొత్త ఆయుధాన్ని పరీక్షించటానికి ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న తన వాతావరణ ఉపగ్రహాన్ని… వెదర్ శాటిలైట్‍ని కూల్చేసిందిట. దానివల్ల స్పేస్‌లో 3000 శాటిలైట్ ముక్కలు పడ్డాయిట. National Oceanic and Atmospheric Administration ఎస్టిమేట్ ప్రకారం 200-400 స్పేస్ జంక్ ముక్కలు earth atmosphere లోకి వస్తున్నాయట.”

“అన్నా! నాన్నా! అదిగో స్పేస్ జంక్ ఎర్త్ మీద పడుతోంది. లుక్ లుక్” అని గట్టిగా అరిచింది అఖిల.

ఇంతలో అమ్మ “పిల్లలూ, ఆలస్యం అయింది. పడుకోండి” అంది.

“నాన్నా! స్పేస్‌లో ఆబ్జెక్ట్స్ ఎందుకు ఫ్లోట్ అవుతాయి?” అన్నాడు నిఖిల్

“ఇవ్వాళ్టికి చాలు. నెక్స్ట్ టైం గ్రావిటీ గురించి మాట్లాడుకుందాము. రండి పడుకుందాం” అని పిల్లల్ని టెర్రస్ మీదనుండి ఇంట్లోకి తీసుకు వెళ్లారు.

నిఖిల్, అఖిల కలల్లో స్పేస్, స్పేస్ జంక్ వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here