అంతరిక్షంలో మృత్యునౌక-2

0
2

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[మానవ జాతి ఒక ఎటూ పాలుపోని సంకటస్థితిని ఎదుర్కొంటున్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో – ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. భూమికి, కుజ గ్రహానికి ఎదురయ్యే ఓ ప్రమాదం నుంచి ఈ రెండు గ్రహాలను కాపాడాల్సి ఉంటుంది. ఆ రోజు 18 మార్చ్ 1970. అమెరికా లోని న్యూమెక్సికో లోని సైనిక స్థావరంలో ఉన్న నీల్ బ్యారీ ఫోన్ మోగుతుంది. సమీపంలో ఈత కొడుతున్న అతను కాసేపటి తర్వాత వెళ్ళి ఆ నెంబర్‍కి డయల్ చేస్తాడు. ఆ వ్యక్తి తాను నాసా పరిశోధనా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాననీ, తన పేరు జస్టిన్ అని పరిచయం చేసుకుంటాడు. డా. బ్రియాన్ హాకిన్స్‌కి సహాయకుడినని చెప్తాడు. హాక్సిన్స్ ఓ పరిస్థితి గురించి వివరించమన్నారు అంటూ – తాము ఉపగ్రహం ద్వారా – ఓ అంతరిక్ష శకలం నుండి అదనపు రేడియేషన్ వెలువడుతున్నట్లు గుర్తించామనీ, ఆ స్పేస్ బాడీ చాలా పెద్దది అనీ, దాన్ని తాము మాత్రమే కాకుండా చాలా మంది గుర్తించారని చెప్తాడు. ప్రస్తుతం పూర్తి సమాచారం ఇవ్వలేనని, సాధ్యమైనంత త్వరగా ఎమర్జెన్సీ మీటింగ్ రావలసి ఉంటుందని నీల్‍కి చెప్తాడు. తప్పకుండా వస్తానని, వివరాలు పంపమని చెప్తాడు నీల్. 19 మార్చ్ 1970 న రష్యాలోని లెనిన్‍సిక్‌లో అర్ధరాత్రి ఒంటిగంట దాటుతుంది. యూరీ ఇవానోవ్ ఇంట ఫోన్ ఆగకుండా మోగుతుంది. భార్యాపిల్లలకు నిద్రాభంగం కలగకుండా ఫోనెత్తి నెమ్మదిగా మాట్లాడుతాడు. ఆ మాట్లాడేది ఎలాషా. ఆ సమయంలో ఫోన్ చేసినందుకు క్షమాపణ చెప్పి, ఇది గ్లోబల్ ఎమర్జెన్సీ అనీ చెప్పి, తాను అంతరిక్ష పరిశోధనా ప్రయోగశాల చీఫ్ డాక్టర్ ఫ్రాన్సిన్ డిగ్రిగారియో గారికి సహాయకురాలినని చెప్తుంది. తమ సిబ్బంది విపరీతంగా రేడియేషన్‌ను వెదజల్లుతున్న ఒక స్పేస్ బాడీని గుర్తించారనీ, దాని వల్ల భూమికి ప్రమాదమని, అందుకని ఏర్పాటు చేసిన ఓ ఎమర్జెన్సీ మీటింగ్ రావలసి ఉంటుందని యూరీకి చెప్తుందామె. ఈ వార్త మీడియాలో వచ్చిందా అని అడుగుతాడు యూరీ, మర్నాడు ఉదయం కల్లా రావచ్చని ఆమె అంటుంది. వివరాలు, విమాన టికెట్లు పంపుతానని చెప్తుంది. 19 మార్చ్ 1970 న నాసా వారి అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో సమావేశం జరుగుతుంది. నీల్ బ్యారీ, ప్రొఫెసర్ హాకిన్స్‌నీ, ఆయన అసిస్టెంట్ జస్టిన్‍ని కలుస్తాడు. శాస్త్రవేత్తల బృందంలో కలిసి ఆ స్పేస్ బాడీ ఏమిటన్నది నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తారు. శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పరిశీలించి అణువ్యర్థాలతో ఉన్న ఆ స్పేస్ బాడీ మార్స్ దిశగా వెళ్తోందని గ్రహిస్తారు. 20 మార్చ్ 1970 న మాస్కో లోని అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో యూరీ ఇవానోవ్ . వ్యోమగాములు, స్పేస్ ఇంజనీర్లు, రాకెట్ సైంటిస్ట్‌లు ఖగోళ శాస్త్రవేత్తలతో సమావేశమవుతాడు. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ డిగ్రిగారియో అతనికి జరిగినదంతా వివరిస్తాడు. అలెక్సిస్ అనే యువ శాస్త్రవేత్త తాను కనుగొన్న వివరాలు యూరీకి చెప్తాడు. అణువ్యర్థాలను అంతరిక్షంలోకి తీసుకుపోతున్న వాహనాన్ని కంప్యూటర్‍లో చూపిస్తాడు. అంతరిక్షంలో ఆ వాహనం అలాగే ఉంటే ప్రమాదమేమీ లేదని తొలుత భావిస్తాడు యూరీ. కానీ ఆ వాహనం మార్స్ వైపు వెళ్తోందనేసరికి రాబోయే ఉపద్రవాన్ని గ్రహిస్తాడు. ఆ వాహానాన్ని ఎవరు ప్రయోగించారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఈలోపు మీడియాకి సమాచారం తెలిసిపోయి రకరకాల వార్తలను వండి వడ్డిస్తుంది. ఈలోగా శాస్త్రవేత్తలకు ట్యాన్‌జావీ రిపబ్లిక్ ఈ దుర్మార్గానికి ఒడిగట్టిందని తెలుస్తుంది. అమెరికా, రష్యాలను వాడుకున్న ఆ దేశం దొడ్డి దారిన కీలకమైన రాకెట్ విడి భాగాలను, న్యూక్లియర్ ప్రాజెక్ట్ లకు కావలసిన సాంకేతిక సహాయాన్ని పొందిందనీ, ఆ తర్వాత అణువ్యర్థాలను అంతరిక్షంలో కుమ్మరించిందని తెలుస్తుంది. – ఇక చదవండి.]

ప్రకరణం-2: ఐక్యరాజ్య సమితి తీర్మానం

[dropcap]“గు[/dropcap]డ్ ఈవెనింగ్, దేశదేశాల పౌరులకు! నా పేరు డ్రూ గాబిన్, బి.బి.సి టెలివిజన్ నుంచి, లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నా. వెస్ట్ లండన్, వైట్ సిటీ నుంచి.. ఇదోక సంఘటనాత్మక సాయంత్రం! మీ టీ.వి తెర లేదా మీ రేడియో మీదే ఏకాగ్రత ఉంచండి. నేను చెప్పేది నిజం కాబోతుంది.

మూడు రోజుల క్రిందే, మీడియాకు ఈ విషయం తెలిసింది. అది ప్రపంచం మూల మూలకు దావానలంలా వ్యాపించింది. కాని ఇది ఈ ప్రపంచానికి అవతల జరుగుతూన్నది. అవును! మీరు సరిగ్గానే విన్నారు!

అంతరిక్షంలో పడేసిన న్యూక్లియర్ వేస్ట్ గురించినీ ఎన్నో కుట్రలు ఉంటున్నాయి. ఎవరు చేశారు, దేనికి చేశారు, ఇంకా ఎన్నో వివాదాలు! మీరు వినలేదా? ఈ వార్త బయటికి పొక్కి కొన్ని ఉత్కంఠపు రోజులే అయింది. ఈ సాయంత్రం మన స్టూడియోలో మీకు పసందైన విందు ఏర్పాటు చేశాము. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితిని విశ్లేంచడానికి మేమాహ్వానించిన అంతరిక్ష రంగ నిపుణులు ఇక్కడే ఉన్నారు.”

“మికాలిస్ గ్యారిసన్ గారు, వృత్తి రీత్యా అంతరిక్ష పరిశోధనా విశ్లేషకులు, మన ప్రాంతంలో సుప్రసిద్ధులు, ప్రస్తుతం మనతో ఉన్నారు. గ్యారిసన్ గారూ, స్వాగతం!” డ్రూ ఆయనకు స్వాగతం పలికాడు.

“నన్ను మీ షో కు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు.”

“అది మాకు అత్యంత సంతోషం! సర్, చెప్పండి! అసలు వచ్చిన ఇబ్బందేమిటి?” అనడిగాడు డ్రూ.

“సరే, చర్చించాల్సింది చాలా ఉంది! దాన్ని నాకు సాధ్యమైనంతగా న్యాయం చేసి, వివరిస్తాను.

కొన్ని గంటల క్రితం, మిస్టర్ బ్రియన్ హకిన్స్ సారథ్యం లోని మన నాసా శాస్త్రవేత్తలు, ఒక స్పేస్ వెహికల్ వెలువరిస్తూన్న న్యూక్లియర్ రేడియోషన్‌ను గుర్తించారు.

రష్యా, అమెరికా, యూరోప్, ఇండియా, చైనా, జపాన్ లాంటి స్పేస్ టెక్నాలజీ దిగ్గజాల మధ్య ఇటీవల చాలా దౌత్యపరమైన చర్చలు జరుగాయి. తేలిందేమంటే ఈ దేశాలేవీ అణుధార్మిక వ్యర్థాలను అంతరిక్షంలో గుమ్మరించలేదు.

సో, ఏదో దేశం రహస్యంగా అణుశక్తి ప్రయోగాలు చేస్తుందన్న మాట. ఆ మాట కొస్తే, ప్రతి దేశం తాను అణు సామర్థ్యాన్ని సంతరించుకోవాలనే అనుకుంటుంది. ఈ ప్రయోగాలు చాలా కాలం నుంచి జరుగుతున్నట్లు తెలుస్తూంది. దాని ఫలితంగా పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకునిపోయాయి. దాన్ని సముద్రంలో పడెయ్యడానికి బదులు అంతరిక్షంలో గుట్టగా పోశారు అని మాకు తెలిసిన వార్త. అది ఒక సమస్య కాకూడదు. ఓ.కె?”

“ఓ.కె!”

“కాని, అదీ సమస్యే! అది సమస్య అని ఆ రోగ్ నేషన్ ట్యాన్‌జావీ రిపబ్లిక్ గ్రహించలేదు. అది ఒక నిర్వేతుకమైన చర్య. అలా అని ఎందుకంటున్నాని మీరు నన్నడిగితే, నేనేమంటానంటే, దాని వల్ల అంగారక గ్రహం (మార్స్) పూర్తిగా క్షీణించి, నశిస్తుంది. మన రాబోయే తరాల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది.”

“క్షమించాలి సర్,” అన్నాడు డ్రూ మధ్యలో, ఆయనకు అడొస్తూ.. “ఈ తరానికి, మీరు చెబుతున్న ప్రకారం, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు, వినాశనానికి?”

“రెండు సహస్రాబ్దులు, అంటే రెండు వేల సంవత్సరాలు ఇంచుమించు” అన్నాడు గారిసన్. “ఆయన దగ్గర సమాచారం సిద్ధంగా ఉంది. అంతే కాకుండా, ఈ అణుధార్మిక వ్యర్ధాల నుండి వెలువడే రేడియోషన్, మన భూగ్రహాన్ని కూడా సమానంగా దెబ్బతీస్తుంది. ఆ ప్రభావం ఎలా, ఎంత అనేది మనం ఇంకా అవగాహన చేసుకోలేకపోతున్నాం. దాని ఒక లాంగ్ టర్మ్ క్రైసిస్‌గా ఇప్పుడే నిర్ధారించలేం. అది చీకట్లో దొంగలాగా, కనబడకుండా మన పైన దాడి చేయబోతుంది.”

“సరే నండి. చాలా విషయాలు చెప్పారు మాకు” అన్నాడు డ్రూ. “ఈ నేపథ్యంలో, తీసుకోబోయే తర్వాతి చర్య ఏమిటి?”

“వెరీ గుడ్! ఇది ఈ శతాబ్దపు అత్యంత కీలకమైన ప్రశ్న. దీన్ని గురించే అన్ని దేశాలు చర్చిస్తున్నాయి. ఈ పాపం చేసిన వాళ్లెవరో, దానికి బాధ్యత వహిస్తూ ముందుకు రావాలి! ఇంత వరకూ ఎవరూ ఏమీ అనలేదు. అనరు కూడా! యూరోపియన్ యూనియన్‌ని, రష్యా సమాఖ్య గాని ఈ ఘోర తప్పిదాన్ని చేయలేదన్నది ప్రస్తుతం సుస్పష్టం. నిజానికి ట్యాంజానీ రిపబ్లిక్ మాత్రమే ఈ పాపానికి ఒడిగట్టింది కాని, పెద్ద తలకాయలేవీ దీంట్లో లేవు. ఈ దుర్మార్గ దేశాన్ని శిక్షించాలా వద్దా అనే వాదన కూడా జరుగుతూంది.”

“తప్పకుండా శిక్షించాల్సిందే!” అన్నాడు డ్రూ.

“కాదు! కాదు! అక్కడే చాలా మంది పొరపాటు పడుతున్నారు. వారిని శిక్షించాలని నేననుకోవడం లేదు. ఏ దేశమైనా అలాంటి తప్పు చేయగలదు. మన దృష్టి అంతా ఎవరు దీన్ని చేశారు. ఎందుకు చేశారు అనే దాని మీద ఉండకూడదు. మార్స్ వైపు ప్రయాణిస్తున్న ఆ వ్యర్ధాలను ఏం చేయాలి అనే దాని మీద ఉండాలి. ”

“చక్కగా చెప్పారు సర్. మరి ఎందుకు ఆలస్యం?”

“ఆలస్యం ఎందుకంటే, దాన్ని డీల్ చెయడానికి సంకల్పం, వనరుల లభ్యత, రెండూ తగినంతగా లేవు ఎవరికీ! అలా చేస్తే ఎవరికీ సమీప భవిష్యత్తులో పైసా లాభం రాదు. ఈ మిషన్‌లో పాలు పంచుకోవడానికి ఏ దేశానికీ అవసరం లేదు, దాని విలువ కూడ తెలియదు. మార్స్‌ను రక్షించే ఈ మిషన్, ప్రపంచంలోనే, ఇంత వరకు చేపట్టబడని, అత్యంత ఖరీదైన వ్యవహారం. దీనికి భారీ ఎత్తున వనరులు కావాలి. అభివృద్ధి చెందని దేశాలన్నీ, తమను దీని నుంచి మినహాయించమని కోరుతున్నాయి. తమకు ఆసక్తి లేకకాదు, వనరులు లేక అని చెబుతున్నాయి. దీనికి ఉదాహరణ ఆఫ్రికా దేశమైన నైజీరియా.”

“అవును. తెలిసింది.”

“గుడ్” అన్నాడు గారిసన్.

“మరి పెద్ద తలకాయల సంగతేమిటి? అంటే, అభివృద్ధి చెందిన దేశాలు!”

“దాని గురించి నాకు సమాచారమింకా రాలేదు. ఆ దేశాలు మనసులో ఏముందో తెలుసుకోడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. భూగ్రహం మీదున్న అందరి నోళ్లలో నానుతూ ఉన్న విషయం కాబట్టి. ప్రతి దేశం హాజరయింది, వాటి ప్రతినిధులు తమ మనసులోనిది బయటపెట్టారు. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి మధ్యతరగతి దేశాలు ఎక్కవ స్థాయిలో తమ ఆసక్తి చూపాయి. మార్స్ పరిరక్షణా మిషన్‌లో పూర్తిగా తాము పాల్గొంటామని అన్నాయి.”

“ఓ! అది..” డ్రూ అంటూండగానే అతనికి అడ్డుతగిలాడు గారిసన్.

“ఆగండి! నేనింకా బాంబు పేల్చలేదు! ఒక విషయాన్ని చేయడానికి ఆసక్తి ఉండడం మంచిదే, అది అద్భతమైంది కూడా! కానీ దానికి తగినన్ని వనరులుండాలి కదా! వారందరూ కలిసి పని చేసినా, దీనికి వాళ్ల దగ్గరున్న వనరులు చాలవు.”

“అయితే కష్టమే!” అవును డ్రూ ఆందోళనగా..

“కదా! కాబట్టి ఈ ప్రాజెక్టు ఎంత క్లిష్టమైందో మనకు అర్థమైంది. ఇప్పుడే ముగిసిన యుద్ధం, ఇంకా కొన్ని దేశాల మధ్య ఇంకా కొనసాగుతున్న యుద్ధం.. దాన్ని పరిగణస్తే, నన్ను నమ్మండి! ప్రపంచదేశాలకు, ఐ మీన్, యుద్ధంలో పాల్గొన్న దేశాల దగ్గర వనరులన్నీ ఖర్చయిపోయాయి” గారిసన్ ఊపిరి పీల్చుకోడానికి కాసేపు ఆగాడు. “ఇప్పుడు, బాగా అభివృద్ధి చెందిన దేశాల భావాలను, ఈ విషయాంలో గమనిస్తే, ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. ధనిక దేశాలు గనుక ఇందులో దిగితే, వనరులు కొరత అనే మాట ఉండదు.” గానిసన్ కొనసాగించాడు, “ధనిక దేశాలు ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి అంగీకరించాయి. దానికి ఫండ్స్, రిసోర్స్ సమకూర్చడానికి మాత్రం కొంచెం కొట్టుమిట్టాడుతున్నాయి. మొత్తానికి సిద్ధంగానే ఉన్నాయి.”

“అయితే మంచి విషయమే.”

“ఉండండి, మీ కామెంట్స్ చేసే ముందు నా స్టేట్‌మెంట్స్‌ను ముగించనివ్వండి. నేను చెబుతున్న దేశాలు, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్), ఇంకా కొన్ని. వారి వైపు నుంచి ఒక సమస్య ఉంది. వారి ఎజెండాను దాచి పెట్టడానికి వారు సాధ్యమైనంతగా ప్రయత్నించారు. ప్రాజెక్ట్‌లో వారి భాగస్వామ్యనికి ఒక రహస్య కారణం ఉంది. అందరూ కాకపోయినా, వారిలో చాలా మంది, దీన్ని తమ అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర ప్రపంచానికి చూపి, రుజువు చేసుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. ఏ దేశం పాల్గొన్నా, అది దాని స్వార్థ ప్రయోజనాలకు అయి ఉండకూడదు. అందరూ నిస్వార్థంగా దీనిలో పాల్గొనాలి. స్వార్థమే వారి ప్రధాన ప్రేరణగా తెలిస్తే మటుకు, వారు దీన్ని ప్రపంచాన్ని రక్షించిన వారు తామే అని చంకలు గుద్దుకొని, అలా ప్రచారం చేసుకోడానికి ఎక్కవ కాలం పట్టదు.”

డ్రూ నిస్తేజంగా నిట్టూర్టాడు. “అంతా బాగానే ఉంది. మరి సమావేశంలోని చివరి నిర్ణయం?”

“అదింకా ఇప్పటికి స్పష్టం కాలేదు. హాజరైన దేశాల ప్రతినిధులకు, నాయకులకు మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు జరిగాయి. విశ్వ సంక్షేమానికి అందరూ దోహదం చేయాలనే విషయంలో అందరూ ఒక అంగీకారానికి వచ్చినా, ఆ మిషన్‌కు నాయకత్వం ఎవరు వహించాలనే దాని మీద భేదాభిప్రాయాలు వచ్చాయి. నేను ముందు అన్నట్లు, స్వార్థ ప్రయోజనాలు!”

“ఏమిటో! సమస్యను సాగదీస్తున్నారు!”

“ఖచ్చితంగా. అందుకే దాన్ని ‘డిబేట్’ అన్నాం” గారిసన్ కొంచెం పరిహాసంగా అన్నాడు. టేబుల్ మీద నున్న వాటర్ బాటిల్‌ అందుకొని, రెండు గుటకలు తాగి, సీసాకు మూత బిగించాడు.

“సో, సరిగ్గా ఇక్కడే అమెరికా, రష్యాకు మాటల యుద్ధం! ఇంకా కొందరు రంగంలోకి రావాలనుకున్నా. ఆ రెండు దేశాలే రంగంలో ఇమడగలుగుతాయి.”

“రెండు దేశాల మధ్యలో జరిగే అంతరిక్ష పోటీ గుర్తుందా? ఈ మొత్తం వాదనకు మూలం అదే! రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, బాలిస్టిక్ క్షిపణుల గురించి, అణ్వాయుధ పోటీలో, రెండూ దేశాలకూ గలిగిన స్వర్ధలు మనకు తెలుసు. ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ప్రకటించింది మొదట అమెరికానే. అలా సోవియట్ యూనియన్‌కు దారి చూపినట్లయింది. వాళ్లు వెనక్కు తిరిగి, అంతరిక్షంలోకి తొలి మానవుడిని, యూరీ గగారిన్‌ను పంపింది మేమే, కక్ష్యాంతర అంతరిక్ష వాహకం వోస్తోక్ 1 ను, 1961లో ఏప్రిల్ 12న, అని ప్రకటించారు. అఫ్‌కోర్స్, అది నిజమనుకోండి!”

“మరి ఇది ఎక్కడికి వెళుతుందంటారు?” అన్నాడు డ్రూ, బలహీనంగా నవ్వుతూ.

“ఎక్కడికి వెళుతుందని మీరనుకుంటున్నారు?” అన్నడిగాడు గారిసన్.

అతనికి చూచాయగా అర్ధమైంది, తనను ఇంటర్వ్యూ చేసే అతనికి గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షానికి సంబంధించిన విషయాలేవీ అంతగా తెలియవని.

“మరి అమెరికా, చంద్రమండలం మీద కాలు మోపింది మేము పంపిన వ్యక్తేనని, మేమే దీన్ని మొదట సాధించామని అన్నారనుకోండి, వాళ్లు చెప్పేదీ కూడా కరెక్టే కదా!” అన్నాడు డ్రూ, గారిసన్ ఒప్పుకుంటాడో లేదో అని ఆయన వైపు ఉత్కంఠగా చూస్తూ.

“మీకు జరిగిన విషయాలు తెలుసు. మంచిదే.” అన్నాడు గారిసన్. గగారిన్‌ అంతరిక్షయాత్ర తర్వాత, అమెరికా రాష్ట్రపతి జాన్ ఎఫ్. కెన్నెడీ, 25 మే 1961న పావులు కదిపాడు. యు.ఎస్ కాంగ్రెస్‌కు, ఆ దశాబ్దం చివరిలోగా చంద్రుని మీద మనిషి కాలు మోపడం, మళ్లీ క్షేమంగా తిరిగి రావడం అన్న లక్ష్యాన్ని నిర్దేశించాడు. దీన్ని బట్టి వాళ్లు దీన్ని గురించి ఎంత తెగించి ఉన్నారో తెలుస్తుంది. రెండు దేశాలూ అత్యంత భారీ – లిఫ్ట్ లాంచ్ వాహాకలను అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. అమెరికా శాటర్న్ V – విజయవంతంగా ప్రయోగించింది. అది ముగ్గురు వ్యక్తులను మోసుకొని పోగల, ఇద్దరు లాండ్ కాగల సామర్థ్యం గలది. కెన్నెడీ లక్ష్యంగా చెప్పిన చంద్ర గ్రహం మీద ల్యాండ్ కావడానికి నిర్ణీత సమయం జూలై 1969. అది విజయవంతంగా సాధించబడింది. అపోలో 11ను ప్రయోగించడం ద్వారా. ఇది వారు సాధించిన సొంత విజయంగా, సోవియట్ విజయాలను కురచపరచేదిగా అమెరికన్లు భావిస్తారు.”

గారిసన్ కాసేపాగి మళ్లీ కొనసాగించాడు. “చూశారా, అపోలో 11 గురించి చర్చలో ఎందుకు ప్రస్తావించారంటే, ఈ విశ్వకార్యానికి నాయకత్వం వహించకుండా సోవియట్ యూనియన్ వెనక్కు తగ్గాలని, కాని రష్యా పట్టుదలగా ఉంది. ఇతరులు కూడా, అంతరిక్షంలోకి తొలి మానవుడిని పంపడమే అసలైన విజయసాధన అని, అది రష్యా చేసిందని అన్నారు. సోవియట్ యూనియన్, ఆ భావన స్థిరపడేలా చేసింది మరి! కానీ అది వాళ్లకు అంత అనుకూలంగా మారలేదు. తర్వాత ఏం జరిగిందంటే అమెరికా పరిస్థితి మెరుగుపడే పరిస్థితి సంభవించింది.”

మళ్లీ ఆగి, నీళ్ల బాటిల్ లోంచి పెద్ద గుక్క నీళ్లు తాగాడాయన. డ్రూ అతని వైపు చెప్పమన్నట్లుగా చూశాడు. గారిసన్ కొనసాగించాడిలా.

“సోవియట్ యూనియన్ ఇద్దరు వ్యోమగాములతో చంద్ర గ్రహం మీదికి మిషన్ నిర్వహించింది. కాని దాన్ని సక్రమంగా లాంచ్ చేయలేకపోయింది. యు.ఎస్ వారి N1 రాకెట్ కంటే ముందు చంద్రుని మీద లాండ్ అవడంలో విఫలమైంది. అందువల్ల సహజంగానే ఆ దేశం తన దృష్టిని ‘శాల్యూట్’ వైపు మరల్చింది. అది వారి తొలి స్పేస్ స్టేషన్ కార్యక్రమం. వీనస్, మార్స్ గ్రహాలపై వారు పెట్టిన తొలి అడుగు. ఈలోగా, అమెరికా ఐదు అదనపు అపోలో బృందాలను చంద్రుడి మీదికి పంపింది. ఇతర గ్రహాంతరనాసుల రోబోటిక్ పరిశోధనలను ముమ్మరం చేసింది.”

“ఏ దేశం కూడా వాళ్లతో ఎందుకు వాదించలేకపోయిందో ఇప్పుడు నాకర్ధమైంది” అన్నాడు డ్రూ.

“గుడ్, అదే! మిషన్‌కు నాయకత్వం వహించడానికి వాళ్లిద్దరూ పోట్లాడుకోవడం ఆపరు. ఎవరు గెలిస్తే వారు గర్విస్తారు. ఇది మనం తెలుసుకోవాలి. మానవ స్వభావమే అది కదా!”

“వావ్! శ్రోతలకు, వీక్షకులకు ఈ షోలో చాలా విషయాలు తెలిశాయి. కాని మీ అందరూ ఆ సమావేశం ఫలితాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారని నాకు తెలుసు. గారిసన్ గారి దగ్గరకెళదాం. సర్, ఇంతకూ ఫలితం ఏమిటంటారు?”

“చివరికి ఏం తేలిందంటే, ధనిక దేశాలు ఎక్కవగా ఈ మిషన్‌తో దోహదం చేయగలవు, కాని మధ్య తరహా దేశాల సహాయం లేకుండా అవి ఏమీ చెయ్య లేవు. మిషన్‌కు నాయకత్వం వహించే రేస్‌లో ఎవరు విజేత అనేది ఇంకా తెలియదు. కాని అదంత ముఖ్యం కాదు! ముఖ్యమంటారా?”

“ముఖ్యం కాదంటే దానర్థం?” అన్నాడు డ్రూ అయెమయంగా.

“వారు షో ప్రారంభించడానికి కొన్ని గంటలు ముందు, మా కొలీగ్స్ నుంచి ఒక కాల్ వచ్చింది నాకు. సోవియట్ యూనియన్ ఆ మిషన్ నుంచి విరమించుకుందని, అంతే కాదు అమెరికా కూడా అని, యూరోపియన్ యూనియన్ కూడా అదే పని చేసిందని.”

“ఓ గాడ్! అది నాకు తెలియదు. ఏ ప్రాతిపదికన వాళ్లు మీకా సమాచారమిచ్చారు?”

“సమావేశం తర్వాత ఆ విషయం వాయిదా పడింది. ఒక కొత్త టాపిక్‌పై డిబేట్‌కు తెర లేచింది. అది మార్స్ వర్సెస్ ఎర్త్ అని మనకు తెలుసు. ఈ టాపిక్ ప్రపంచాన్నంతటినీ విభజించింది. చాలా మంది విభిన్న అభిప్రాయాలు, కారణాలు, నిజాలు, పరిశీలనలు, ఇంకా కొన్ని గట్టి పాయింట్ల వెలిబుచ్చారు. అవన్నీ వారి వారి క్లెయిమ్‌లను సమర్థించుకునేవే. అధిక సంఖ్యాకులు ఈ మిషన్‌ను అసలు వదిలేద్దాం, గణాంకాలన్నీ సేకరించేంత వరకు, ప్రభావితం అయ్యేది మార్స్ కాని, భూమి కాదు కదా!   అన్నారు. కాబట్టి ప్రపంచ దేశాల నాయకులందరూ కలిసి తీర్మానించింది ఏమిటంటే మార్స్‌ను కలుషితం చేద్దామని. అదే సులభమని!”

“నమ్మశక్యం కావటం లేదు. ఈ చర్చ చాలా సేపు నడిచింది. ప్రపంచ స్వరూపాన్నే మార్చేది ఇది. ఈ రాత్రి ఈ షో ముగించే ముందు ఈ ప్రపంచపు ప్రజలు మీ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్‌ను, ఆ రంగంలో నిపుణుడిగా మా అభిప్రాయాన్ని వినాలనుకుంటున్నారు. చెప్పండి. భూగ్రహమా, అంగారక గ్రహమా?”

“కష్టమైన ప్రశ్న! ఇది నేరుగా నన్నే అడిగారు కాబట్టి చెబుతున్నా, ఇదే నా అభిప్రాయం. రక్షించండి మార్స్‌ను అంగారకుడిని కాపాడండి! ఇంకో గ్రహాన్ని నాశనం చేసే హక్కు మానవులకు ఎక్కడిది? సమీప భవష్యత్తులో దానిలో నాగరికత మొగ్గ తొడగొచ్చునోమో? ఊహించండి, రెండు మిలియన్ డాలర్లు! పదేండ్లు ఖర్చుపెడితే, మీ మిగిలిన జీవితమంతా బాధపడతారు లేదా ప్రతి సంవత్సరం ఐదు వందల వేల డాలర్లు, కొద్దిగా శ్రమ, మీ జీవితమంతా హ్యాపీ! ఏది కావాలంటారు?”

“రెండోదే అనుకోండి” అన్నాడు డ్రూ.

“మానవ జాతి రెండో దాని వైపే మొగ్గు చూపితే తప్ప, మిషన్ అనేది ఉండదు మరి.”

“ఆశ్చర్యం! అంత త్వరగా దీన్ని తీసుకోలేం! ఏది ఏమైనా, మిస్టర్ గారిసన్, మీకు మా కృతజ్ఞతలు! అందమైన ఈ ప్రపంచ జనాభా, భవిష్యత్తు ఏమనవుతుందనేది మానవుల చేతుల్లో ఉంది. దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవాలి, లేదా వదిలెయ్యాలి. గుడ్ నైట్!”

అనుకున్న దాని కంటే ఆలస్యంగానే ఆ టీ.వీ షో ముగిసింది. నీల్ బాగా అలిసిపోయాడు. క్యాంపులో అతనికి కేటాయించిన సోఫా మీద కూర్చుని, చూస్తూ, బీరు చప్పరిస్తూ, తాగుతున్నాడు. అది మూడో బీరు సీసా. అతని మనస్సులో చాలా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. మనసుతో పాటు కళ్లూ అలసిపోగా, రిమోట్‌తో టి.విని ఆపేశాడు. తెర మీద వస్తున్న వ్యాపార ప్రకటనను పట్టించుకోకుండా లేచి తన గదిలోకి దారి తీశాడు.

గదిలోకి వెళుతూ ఉండగా అతన కనిపించింది తన స్నేహితుడు గారిసన్ లాగే. చాలా మంది పౌరులు తమ అభిప్రాయాలను ఈ విషయం మీద చెప్పబోతారు కదా అని.

రాబోయే రెండు రోజుల్లో ఇది అతి తీవ్రమయిన విషయం కాబోతుంది. ఇది మటుకు నిజం. సాధ్యమైనంత త్వరగా దీని పునః సమీక్షించాలని నమ్మే వారు కొన్ని ప్రచారాలను కూడ చేపట్టవచ్చు. ప్రపంచ మంతటా, ఈ చర్చ దరి నోళ్లలో నానుతూ ఉంది.

చిన్న పిల్లలు కూడ తమ బడిలో ఒక మూల ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. బ్రిటన్ నగరంలోని ఒక స్కూల్లో, ఎనిమిదేళాల ఒక పాప ముందు కొచ్చింది. మార్స్‌ను ఎందుకు పరిరక్షించాలో, ఒక విలువైన కారణాన్ని చెప్పింది. వేదిక మీద నుండి, తన తోటి విద్యార్ధులను ఒకే ఒక టి.వి ఛానెల్‌ను సంబోధిస్తూ ఇలా చెప్పింది. “ఇది, దీనిని గనుక సాధ్యమైనంత త్వరగా పట్టంచుకోకపోతే, మా అమ్మే కాదు, నేను, నా స్నేహితులు కూడ ప్రమాదంలో పడతాం. అది జరగకూడదని అనుకుంటూ ఉన్నాను. రాబోయే కాలంలో మన ఇంటిని నాశనం చేయకుండి. మార్స్‌ను కాపాడండి.”

ఆ వీడియో అన్ని టి.వి షోలలో, న్యూస్ చానెళ్లలో వైరల్ అయింది. ఎన్నో ప్రచారాలకు అది మొదటిదైంది. ఇతర గ్రహాలకు హాని చేసే హక్కు మనకు లేదని అలా చేస్తే భవిష్యత్తులో మన గూడును మనమే చిదిపి వేసుకున్నట్లువుతుందని వాదించింది.

చాలా మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల మద్దతుతో, మార్స్‌కు మన సహాయం అవసరమని, తమ గొంతులను గట్టిగా వినిపించసాగారు. మీడియా అంతా ఇదే. ఇది ప్రపంచ నాయకుల వరకు వెళ్లింది. దానిని వారు తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. పాఠశాలలన్నీ దీన్ని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించాయి. తమ విద్యార్థులతో వ్యాసాలు రాయించి, వార్తా పత్రికలలో ప్రచురింపచేశాయి.

కొందరు నాయకులు మార్స్ భవిష్యత్తు గురించి పునరాలోచించడం ప్రారంభించారు. కాబట్టి అది ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనివల్ల మరొక సమావేశం ప్రకటించబడింది. దాని ఫలితం ఏమవుతుందో అని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూడసాగింది. భూగ్రహంలోని ప్రతి పౌరుడు మార్స్‌ను రక్షించాలనే వాదాన్ని బలపరచసాగారు. చాలా మంది ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించారు కూడా.

1970, మే ఒకటో తేదీ. న్యూయార్క్ లోని మన్‌మట్టన్ పొరుగున ఉన్న టర్ట్ ల్ బౌ/ఈస్ట్ మిడ్ టవున్ లోని ఐక్యరాజ్య సమితి సమావేశ భవనం. ఈస్ట్ రివర్ పొడుగునా, అంత వరకు చూడని ఒక పెద్ద గుంపు ప్రపంచం నలు మూలల నుండి వచ్చిన దేశ నాయకులతో ఆ భవనం నిండిపోయింది. ఆ చర్చకు దూరంగా ఉండలనుకున్న. అభివృద్ధి చెందిని దేశాల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరైనారు.

బయట గుమిగూడిన గుంపులో, రెండు రకాల వ్యక్తులున్నారు. ఈ విషయం వదిలెయ్యాలనే వాళ్లు, మార్స్‌ను కాపాడి తీరాలనే వాళ్లు.

ఆ భవనం 505 అడుగుల ఎత్తుంది. అంతర్జాతీయ శైలిలో 39 అంతస్తులుంది, గ్రౌండ్ ఫ్లోర్ కాక. ఉదయం 11 గంటలకు నాయకులంతా తమ తమ సీట్లలో కూర్చున్నారు. మీటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అక్కడ దాదాపు 138 దేశాల ప్రతినిధులున్నారు. హాల్లో రెండు వేల మందికి పైగా ఉన్నారు. కొందరు నాయకుల దుబాసీలు(అనువాదకులు) కూడా వచ్చారు.

అనుసంధానకర్త సమావేశాన్ని ప్రారంభించాడు. అంతకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించడానికి, ఆ నిర్ణయం సరైనదేనా అని మరొకసారి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందని ప్రకటించాడు. ఇది చేసే ముందు, రెండు వైపుల వాదాలను క్లుప్తంగా వినిపించాలని కోరాడు. తర్వాత చివరి నిర్ణయం కోసం ఓటింగ్ జరుగుతుంది.

మొదట మొత్తం అంతకు మునుపు జరిగిన వ్యవహారమంతా ఒకసారి వివరించబడింది. తర్వాత ఇరు వర్గాలకు చెందిన ప్రతినిధులను పిలిచారు. ఒకరు మికాలిస్ గారిసన్. ఆయనే కొన్ని వారాల క్రిందట ఆ టాపిక్ మీద విస్తృతంగా చర్చిచింది టీ.వీలో. ఇంకోకరు మార్టిన్ వైట్. ఆయన మల్టీ మిలియనీర్. ప్రపంచంలోని ఒక అతి పెద్ద కంపెనీకి సి.ఇ.ఓ.

ఆయన బొద్దుగా గుండ్రని ఆకారంలో ఉన్నాడు. పెద్ద బొజ్జ ఉంది. ఆయనే ముందుగా పోడియం మీదికెక్కి, మైకు వెనక నిలబడి ముందు మాట్లాడడాడు.

“ఇక్కడ సమావేశమైన అందరికీ నమస్కారం.” అని ప్రారంభించాడాయన. అంత పెద్ద సమావేశంలో మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. కాబట్టి సులభంగా నిర్వహించగలడు. పైగా అది మేధావుల సమూహం. అందరూ తమ దృష్టిని ఆయన మీద కేంద్రీకరించారు. ఆయన గొంతు గంభీరంగా ఉంది. అందురూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దం హాలులోనే కాక హాలు బయట కూడా వ్యాపించింది. ఇరు వర్గాల ప్రచారకర్తలు అక్కడ మోహరించి ఉన్నారు.

“నేను, మార్టిన్ వైట్‌ని. ప్రపంచంలోని గొప్ప సి.ఇ.ఓ.లలో ఒకర్ని. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను యవ్వనంలోనే చాలా పెట్టుబడులు పెట్టాను. పెట్టుబడులు పెట్టి, లాభాలేవీ రాకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కొన్నిసార్లు మీకు ఎటు వంటి లాభామూ రాదు. మార్స్‌ను రక్షించాలనే ప్రాజెక్ట్ కూడా అలాంటిదే అని తెలుసుకోండి.” ఆయన కాసేపు ఆగాడు. తన మాటలు శ్రోతల మెదళ్లలో ఇంకే వరకు.

“మీ చుట్టూ చూడండి. యుద్ధం ఇటీవలే ముగిసింది. ఆలోచించాల్సిన విషయూలు చాలా ఉన్నాయి. విరిగిపోయిన కూలిపోయిన వంతెనల్లాంటివి. ఇళ్లు పేలిపోయాయి. పట్టణాలు ధ్వంసమయ్యాయి. ఆ శిధిలాలన్నీ ఇంకా ఉన్నాయి. మీరేమో ఏ ప్రయోజనమూ లేని, లాభం చేకూర్చని ఒక గ్రహాన్ని గురించి ఇదవుతున్నారు. మన నిధులు, వనరులు మళ్లించాల్సిన ఎన్నో సమస్యలున్నాయి. మన టెక్నాలజీని ఇంకా మనం అభివృద్ధి పరుచుకోవాల్సి ఉంది. మనకు బోలెడు నిధులు కావాలి. రవాణా సౌకర్యాలు మరింత మెరుగైన స్థాయికి తీసుకు వెళ్లాలి. కాబట్టి, రాబోయే రెండు సహస్రాబ్దుల గురించి ఆంధోళన చెందడం అనవసరం అని నా భావన.”

మళ్లీ కొంత సేపు ఆగాడు మార్టిన్ వైట్. ఒక అడుగు ముందుకు వేసి, తాను అందరికీ పూర్తిగా కనబడేలా నిల్చున్నాడు.

“కొన్ని నెలల కిందట జరిగిన దాని తర్వాత, మనందరం ఆంధోళన చెందాల్సింది” అన్నాడు మార్టినెజ్. “మార్స్” అన్నపదాన్ని బిగ్గరగా ఉచ్ఛరిస్తూ, జనంలో గుసగుసలు. ఆయన మళ్లీ తన ప్రసంగాన్ని ఆరంభించిన తర్వాత అవి సద్దుమణిగాయి.

“మనందరం కలసి దృష్టి పెట్టాల్సిన విషయం మన గ్రహాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని పైన, దాన్ని యుద్ధం, గందరగోళం ఆక్రమించుకున్నాయి.”

“కాబట్టి మార్స్ పరిరక్షణ ప్రాజెక్ట్ పని చేయదు. దాని కోసం వెచ్చించే నిధులు, వనరులు అన్నీ వృథా” ఆయిన చెప్పడం ఆపి, శ్రోతల కళ్లలోకి చూశాడు. ఆ కళ్లలో అనుమానాన్ని గుర్తించి సంతృప్తి చెందాడు. “మీరందరూ నా మాటల గురంచి జాగ్రత్తగా ఆలోచించండి.” అని ఆయన పోడియం దిగిపోతూండగా హార్షధ్వానాలు మిన్నముట్టాయి. అంతే వేగంగా అవి సద్దుమణిగాయి. గారిసన్ అప్పటికే వేదిక మీద ఉన్నాడు. ఆయనను పరిచయం చేయవలసిన పని లేదు. మైక్ బిగించి ఉన్న చెక్క స్టాండు దగ్గరికి ఆయన వెళ్లాడు. ఆయన మొహం భావరహితంగా ఉంది. ఆయన నీలి రంగు జీన్స్, టీ షర్టు వేసుకున్నాడు. దాని మీద MSM అనే అక్షరాలు ఉన్నాయి. వాటి అర్థం ‘మిషన్ సేవ్ మార్స్’.

“మనం జీవనం సాగిస్తున్న ఈ ప్రపంచపు గొప్ప నేతలకు అభివందనం.” అంటూ మొదలుపెట్టాడు గారిసన్. “నా పేరు మికాలిస్ గారిసన్. మీకందరికీ నేనెవరో తెలుసు. మీ టైం నేను ఎక్కవ తీసుకోను, నా సహచరుడు తీసుకున్నంతగా. కొన్ని నిమిషాలలో ముగిస్తాను.”

గారిసన్ ఆగి, క్యూర్చుని ఉన్న మార్టినెజ్ వైపు తిరిగి ఇలా అన్నాడు “మీరు చెప్పిన దానికి కృతజ్ఞతలు సర్. విలువైన పాయుంట్లు చెప్పారు మీరు. అవి నన్ను మరీ మరీ ఆలోచింపచేశాయి. మీరు ఒక సి.ఇ.ఓ. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. అవునా?”

తననే అడుగుతున్నాడని అర్థమై మార్టినెజ్ “అవును” అని బదులిచ్చాడు.

“ఆయన అవునన్నారు. ఆయన ఇప్పుడు సి.ఇ.ఓ. కానీ అంతకు ముందు చాలా తప్పులు చేశారు. అలాంటి తప్పు మనం చేయకూడదని మనకు చెప్పారు” ‘తప్పు’ అన్న మాటను ఒత్తి పలుకుతూ ఇలా అన్నాడు గారిసన్. “ఆయననేమన్నా ఒక గ్రహం నాశనమైపోవడాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడా? లేదు కదా!”

గారిసన్ నిట్టూర్పు వడిచాడు. “మనం మానవులం. మనకు మానవత, ప్రకృతి, భూమాత అనే వరాలు ఇచ్చాడు భగవంతుడు. అంతే కాదు మనకు ఇంకా ఏడు గ్రహాలు వరంగా ఇచ్చాడు. మనం మన చేతులతోనే ఈ గ్రహాన్ని నాశనం చేసుకుంటామా? దాన్ని కనీసం రక్షించడానికి ప్రయత్నించమా? ఆ ప్రయత్నంలో మనం విఫలమైనా, కనీసం మన ప్రయత్నలోపం లేదనే మనశ్శాంతి ఐనా మనకు మిగుల్తుంది కదా!”

గారిసన్ ఆగాడు – “మనలో ఎంత మంది, ఈ రోజు ఈ రూములో కూర్చుని ఉన్న వాళ్లం, వచ్చే శతాబ్దంలో, మన దేశాల వ్యవహారాలను చూసుకోగలం? ఎవరం ఉండము.” శ్రోతల జవాబు కోసం ఎదురు చూడకుండా ఆయనే చెప్పాడు “మనం మానవ తప్పిదమైన ఈ ప్రమాదాన్ని నివారించి, మార్స్‌ను కాపాడడానికి, కావలసినదంతా చేయాల్సిందే.”

“వనరులు లేవంటారా, అదొక సమస్సే కాదు. ఈ విశ్వం మనకు అపార వనరులిచ్చింది. వాటిని మనం విశ్వకల్యాణం కోసమే వినియోగిస్తాం. అప్పుడు ఈ విశ్వం మన వల్ల మరింత సంతోషిస్తుంది. మన ప్లాన్ MSM కాకపోతే, మరేమిటి? మన వనరులను, డబ్బును, సంపదను సాంకేతికత కోసం ఖర్చు చేయడమా?” అని అడిగాడు గారిసన్. తన ప్రశ్న శ్రోతల మెదళ్లలోకి ఇంకేంత వరకు వేచి ఉన్నాడు.

“టెక్నాలజీ చెడ్డదని నేననను. దాన్ని మనం ఉపయోగించుకుంటున్న తీరే బాగులేదు. అసలు యుద్ధానికి కారణం అదే! అడవుల లాంటి ఎన్నో ప్రకృతి వనరులను నాశనం చేసిందీ అదే! ప్రతి రోజు మన ఓజోన్ పొర చిరిగిపోతూనే ఉంది. ప్రకృతే గనక లేకపోతే, సూర్యుని భరించలేని కిరణాల నుండి మనల్ని రక్షించే రక్షణ కవచం ఎక్కడుంది?

నిజంగా మనం మానవులమే అయితే, మనకు దేవుడిచ్చిన దాన్ని కాపాడుకొనే మార్గాం కనుక్కుందాం. రాబోయే సంవత్సరాలల్లో మన పిల్లలకు ఆశ్రయమిచ్చే గూడును రక్షించుకుందాం. మన భావితారలకు ఉండేందుకు చోటు లేకుండా చేశామనే అపప్రధ మనకొద్దు. సరైన పని చేద్దాం. MSMను ప్రారంభిద్దాం. థాంక్ యు.”

పోడియం నుంచి ఆయన వెనుతురుగుతుంటే, శ్రోతలు లేచి నిలబడి ఆయన మాటలకు ప్రశంసల వర్షం కురిపించారు. త్వరగానే చప్పట్ల హోరు తగ్గింది. అనుసంధానకర్త సమావేశాన్ని కొనసాగించాడు. వోటింగ్‌కు సమయమైంది. దేశ నాయకులకు స్లిప్పులు పంచారు. అందరూ తమ ప్రాధాన్యతను నమోదు చేశారు. ఫలితాలు ప్రకటించే సమయం ఆసన్నమైంది. అమెరికా రాష్ట్రపతి కెన్నెడీ తన ప్రసంగాన్ని ప్రారంభించాలని గౌరవంగా ఆహ్వానించారు.

“చాలా సేపైంది. మనం సమావేశంలోని అతి ముఖ్యదశకు చేరుకున్నామని ప్రకటించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నాడాయన. “ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ రోజు, అంటే మే 1, 1970న, హాజరై ఉన్న మొత్తం దేశాలు నూటనలభై రెండు! అందులో MSM ను సమర్థించిన దేశాలు 75. దాన్ని వ్యతిరేకించిన దేశాలు 67. ”

ఫలితాల ప్రకటన విని, భవనం బయట గుంపులు గుంపులుగా ఉన్న ప్రజలు కోరింత కొట్టారు. “మిషన్ సేవ్ మార్స్, ఇదిగో మేం వస్తున్నాం” అన్నారు రాష్ట్రపతి కెన్నెడీ!

***

మే ఒకటిన జరిగిన దాని తర్వాత, ప్రపంచం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వారు తర్వాత పరిణామాలను చూసుకుంటారనే భరోసా! సమవేశం తర్వాత ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ ఒక ప్రకటన చేశారు. వెను వెంటనే, ఆ హాలులోనే, అమెరికా, సోవియట్ యూనియన్‌ల అగ్రనేతలు ఉభయులూ, ఒక ఆర్డరు పాస్ చేశారు. అదేమిటంటే, అపోలో 11 మిషన్, సోవియట్ లూనా, స్పుత్నిక్ మిషన్‌ను నిర్వహించిన వారు కలిసి పని చేయాలని. ఒక ప్రయోగాత్మకమైన పరిష్కారంతో ముందుకు రావాలని, మాస్కోలోని అంతరిక్షపరిశోధనా ప్రయోగశాలకే అంతా వదిలెయ్య కూడదని!

మే 5వ తేదీ మాస్కోలోని అంతరిక్ష పరిశోధనా ప్రయోగశాల ఉద్యోగులంతా అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు, రాబోయే మిషన్ కోసం ల్యాబ్‌ను సన్నద్ధం చేస్తూ. MSM కు కేంద్ర కార్యస్థానం అదే అని ప్రకటించబడింది. అన్ని ఏర్పాట్లూ అనుకున్న సమయం కంటే ముందే పూర్తవ్వాలి.

“అందరూ ఇలా రండి, చాలా పని ఉంది” అని పిలిచాడు ప్రొఫెసర్ ప్రాన్సిస్.

కంప్యూటర్ల బీప్ శబ్దాలు తప్ప, ఆ రూమంతా నిశ్శబ్దం ఆవరించింది. వాళ్లంతా మెయిన్ కంట్రోల్ రూంలో ఉన్నారు. అక్కడి నుంచే మిషన్ తాలుకు ప్రతి కార్యకలాపం పర్యవేక్షించబడేది. సంస్థ ముఖ్య ఉద్యోగులంతా పని చేసేది.

“ఇక్కడున్న అందరికీ తెలుసు” ప్రొఫెసర్ ప్రారంభించారు. “ఈ మిషన్ లో భాగంగా మనందరికీ చాలా చాలా పని ఉంది. మనకు ప్రమాదం అర్థమైంది. దాన్ని ముందే కనుక్కున్నాం. మన టీం ఒక పరిష్కారం చూపాలి. కలలను నిజాలుగా మార్చాలి. అటువంచి అరుదైన అవకాశం మన కొచ్చింది.”

“అపోలో 11 మిషన్‌ను రూపొందించిన వారు త్వరలో మన దగ్గరికి వస్తారు. కొన్ని విషయాల్లో వారు మన కంటే పై చేయిగా ఉంటారని మనకు తెలుసు. వారి దగ్గర నేర్చుకోవడం మనకు చిన్నతనమేమీ కాదు. మనం ఒక అమెరికన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నాం” అంటూ అలెక్సిన్‌ను చూపిస్తూ “మనం ఈ అనర్థాన్ని ఎలా కనుగోన్నామె అతనికి వివరించాల్సింది నీవే!”

ప్రొఫెసర్ ప్రాన్సిస్ కాసేపాగి అడిగాడు – “ఆయనకు కాల్ చేశారా?” అని తన అసిస్టెంట్ ఎలా షాను. ఆమె తల అంగీకారంగా గబగబా ఊపింది.

“సరే అయితే! ఏ సమాచారాన్నైనా, మీరు నాకిచ్చింది నేను శాఖాధిపతికి పంపుతాను. ఈలోగా, తలెత్తుకుని, మార్స్‌ను కాపాడదాం!”

ఆయన తన మాటలు ముగించేసరికి రూమ్‌లో హర్షధ్వానాలు. ఆయన రూం దాటాడు!

***

తేదీ – మే 5, 1970

స్థలం – ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ

న్యూయార్క్ , NY 11017, అమెరికా

సమయం – 8.21AM

ఆ వార్త మెల్లిగా బయటకు రాగా, కాలం వేగంగా సాగింది. నీల్, యూరీ, మిస్టర్ బ్రియాన్, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, ఎలాషా ఇంకా అలెక్సిస్, ఆ అత్యవసర సమావేశం తర్వాత ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అప్పుడే చేరుకున్నారు.

నీల్ బ్యారీ అమెరికన్ ప్రొఫెసర్. ప్రాన్సిస్ ఆవిషయం గురించి బ్రియన్‌తో మాట్లాడాడు. అతడు సమయానికి వచ్చాడు. అలెక్సిస్ అవసరమైన పరిచయాన్నంతా చేసి ఉంచాడు.

నీల్, అతన్ని చూసినప్పుడు, ప్రొఫసర్ ఫ్రాన్సిస్ ప్రక్కన మరొక వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఒ వ్యక్తి కంటే ప్రొఫెసర్ కొన్న సంవత్సరాల మాత్రమే చిన్నవాడై ఉంటాడని నీల్ భావించాడు.

ఆ మనిషి దృఢంగా ఉన్నాడు. అతనొక గృహస్థుడు అని తెలిసిపోతూంది. అతని జుట్టు బాగా నల్లగా ఉంది. దాన్ని చక్కగా దువ్వుకున్నాడు. అతను అందంగా ఉన్నాడు, అతని ముఖంలో ముడతలు లేవు, నుదుటి మీద మాత్రం గీతలు తప్ప. తెల్లని షర్టు, నలుపు రంగు ట్రౌజర్స్ ధరించి ఉన్నాడు.

“మిస్టర్ నీల్ బ్యారీ, ఈయన మిస్టర్ యూరీ ఇవానోవ్. మిస్టర్ యూరీ ఇవానోవ్, ఈయన నీల్ బ్యారీ!” అంటూ ఇద్దర్నీ ఒకరికి ఒకర్ని పరిచయం చేశాడు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.

ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ భవనం మీద సూర్యుడు నడి నెత్తి మీదికి వచ్చాడు. అక్కడే సమావేశం జరగబోతూంది. అక్కడే ఒక వంద మంది శాస్త్రవేత్తలు, అంతరిక్ష సాంకేతిక నిపుణులు ఉన్నారు. వారు ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు. పెద్ద సంఖ్యలో అధికారులు హాజరవడం మీడియా దృష్టి నాకర్షించింది. వార్తా ఛానెళ్లు సమాచార సేకరణకై కాపు కాసి ఉన్నాయి.

“మనం ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ‘లైవ్’ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా వందల కొద్ది శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ ఉన్నారు. మనకందిన వార్త ప్రకారం వారంతా ఒక బృందాన్ని ఎన్నుకోబోతున్నారు. అది అంతరిక్షంలో ప్రయాణించి, భూగ్రహపు పౌరుల ఆశలను నిజం చేయబోతున్నది. మీ టెలివిజన్ సెట్ల ముందే ఉండండి. నిమిషనిమిషానికి మాకందే అప్‌డేట్స్‌ను మీకందిస్తాము” అని చెప్పిందొక మహిళా యాంకర్. నోటి ముందు మైక్ పెట్టుకుని, కెమెరామ్యాన్ ముందు నిల్చొని ఉందామె.

ఇలాంటివి క్యాంపస్ భవనంలోని ఇంచు మించు అన్ని స్పాట్ లలో దర్శనమిస్తున్నాయి. పత్రికా విలేఖరులు గట్టిగా, గొడవగా మాట్లాడుకుంటూ, రాణి ఈగ వెంట వెళ్లే తేనెటీగల్ల గుంపులా, ప్రొఫెసర్ ప్రాన్సిస్, ఇంకా ఇతరులు ఉన్న చోటికి వెళుతున్నారు. ఇక్కడ రాణి ఈగ కెమెరామ్యాన్. మహిళా జర్నలిస్ట్ సూటు వేసుకుని ఉంది.

“ప్రొఫెసర్! ఒక్క నిమిషం!”

“మీరు ఎదురు చూస్తున్న రిక్వయిర్‌మెంట్స్ ఏమిటి?”

ఇలాంటి ప్రశ్నలు ప్రొఫెసర్ వైపు బేస్ బాల్స్‌లా ఎగరేస్తున్నారు. ఆయన వాటినన్నింటినీ, చేయి ఊపి, ఎగరగొట్టేస్తున్నాడు. విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం ముందు, ఇద్దరు సైనికులు నిలబడి, కాపలా కాస్తున్నారు. బృందం, విలేఖరులను తోసుకుంటూ, దారి చేసుకుంటూ అక్కడికి చేరింది. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్‌ను చూచి తలుపు తెరిచారు. వారు యూనివర్సిటీ కారిడార్ లోకి ప్రవేశించారు.

ఎలాషా ముందు నడుస్తూ, దారి చూపిస్తుంది. మొత్తం బృందాన్ని ఆమె హాలులోకి తీసుకువెళ్లింది. అదే కాన్ఫరెన్స్ రూం. నీల్ అందరికీ దగ్గరగా నడుస్తున్నాడు. అలెక్సిస్ అతని పక్కనే ఉన్నాడు. రీసర్చ్ ల్యాబ్‌లో వాళ్లు కనుగొన్న విషయాలు నిజంగా గొప్పవి. వారంతా ఒక మీటింగ్‌కు వెళుతున్నారు. ఏం జరుగబోతూందో అతనికి తెలియదు.

భవనంలోని హాలులో, అదే, కాన్ఫరెన్స్ రూములో నూటముఫై రెండు దేశాల నాయకులు కూర్చుని ఉన్నారు. మూడు వందల సీట్లు నిండిపోయాయి. కుర్చున్న వారి గుసగుసలు, లోగొంతుకలో మాట్లాడే మాటలు అన్నీ కలిసి ఒక పెద్ద రొదగా మారాయి. అందరూ ఆపకుండా ఏదో ఒకటి అంటున్నారు.

ఒక హెడ్ సెట్ పెట్టకుని, తన వైపుకు వస్తున్న ఒక వ్యక్తిని ఫ్రొఫెసర్ ఫ్రాన్సిస్ అడిగారు “అంతా సిద్ధమేనా?”

“యస్ సర్” అన్నాడా మనిషి. “ప్రొజెక్టరు పని చేస్తూంది. మీరు రావడమే తరువాయి!”

“గ్రేట్! మైకు? ”

“పోడియం మీద ఉంది, సిద్ధంగా!”

“వెరీ గుడ్” అని మెచ్చుకున్నాడాయన. తన వెనుక నున్న అనుచరుడిని, సహాయకుడిని చూసి

“ఎలాషా మిమ్మల్ని సమూహంలోకి తీసుకువెళ్తుంది” అని చెప్పాడు. అలెక్సిస్‌ను చూపిస్తూ. “నీవు కొంత మాట్లాడవలసి ఉంది.”

వారి స్పందన కోసం ఆయన ఎదురు చూడలేదు. వేదిక వైపు వెళ్లాడు. పోడియం ఆయన కోసం ఓపిగ్గా కాచుకున్నది. అతని వెనుక అలెక్సిస్ కొంచెం బిడియంగా అనుసరిస్తున్నాడు. రెండు చేతులూ వెనక పెట్టుకున్నాడు. అతను స్టేజి మీద అడుగు పెట్టగానే, మామూలుగా అయితే హర్షధ్వానాలు, నిలబడి గ్రీట్ చేయడం జరిగేది. కాని ఆందోళనతో కూడిన కళ్లు. ఆతృతతో కూడిన మనస్సులు అతనికి దర్శనమిచ్చాయి.

వారి తలల మీదుగా చూశాడు. పోడియిం వెనక నిలబడి, మైకును అందుకుంటూ. ఆ హాల్ వెలుతురు మంద్రంగా ఉంది. కాని అతనికి కొన్ని తెలిసిన ముఖాలు కనబడ్డాయి. అవి అదే రంగంలో కొందరు సహోద్యోగులవి. అతనికి లండన్ లోని అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రధాన డైరెక్టర్ ఫిల్ ధాంప్సన్ కనబడలేదు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ అధిపతి, డా. జేమ్స్ మట్‌లో అతనికి దగ్గరో కూర్చుని ఉన్నాడు. అతడు తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు కనబడిన చివరి ముఖం, చైనా జాతీయ స్పేస్ ఏజన్సీ అధిపతి ఝాంగ్ వాంగ్‌ది.

“మనందరం ఇక్కడ సమావేశం అయింది, పాలపుంతలోని ఒక చిన్న మూలకు, మార్స్ గ్రహానికి దాపురించిన ఒక గ్లోబల్ ఎమర్జెన్సీని గురించి చర్చించడానికి.” అని ప్రారంభించాడు ప్రొఫెసర్, అతని గొంతు స్పీకర్ల గుండా ప్రతి ధ్వనిస్తూ ఉండగా. “అపోలో, స్పుత్నిక్ బృందాల పాత్ర గురించి మనం విని ఉన్నాం. వారు మన బృందానికి వనరుల విషయంలో, అవసరమైన యంత్రాలను నిర్మించుకునే విషయంలో సాయం చేస్తారు.”

“ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం, ఒక కార్యాచరణను రూపొందించుకోవడం, దేశ భక్తులు, విశ్వ భక్తులు అయిన కొందరు స్త్రీ పురుషులను ఎన్నిక చేసుకోవడం. వారు కేవలం తమ దేశం కోసం, తమ ఖండం కోసం మాత్రమే కాదు, తాము నివసిస్తున్న మొత్తం విశ్వం కోసం, భావితరాల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంటారు.” అన్నాడు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్. కాసేపాగి, శ్రోతలనందరినీ కలయ జూశాడు. అతని దృష్టి, పక్క పక్కనే కూర్చుని ఉన్న నీల్ మరియు యూరీలపై పడింది.

“మనం మనం అని ఎందుకంటున్నానంటే మాస్కోలోని అంతరిక్ష ప్రయోగశాల అని అన్న మాట. మనమే కదా ముందు ఆపెను విపత్తును కనుగొన్నది! కాబట్టి దానికి పరిష్కారం చూపాల్సింది కూడ మనమే.”

అతడు ఆగి, అలెక్సిస్‌ను రమ్మని సైగ చేశాడు. ముందు కొచ్చి, ఎదురు చూస్తున్న శ్రోతలకు పరిష్కారం గురించిన సమాచారాన్ని ఇవ్వమన్నాడు. అలెక్సిస్, ప్రొఫోసర్ చేతిలోంచి మైక్ అందుకొని, మెదట్లో కొంచెం ఇబ్బంది పడినా, తర్వాత ఆత్మ విశ్వాసం మేళవించిన గొంతుతో ఇలా చెప్పసాగాడు. “మనకు సమయం లేదు. కాబట్టి నేను క్లుప్తంగానే చెబుతాను పరిష్కారం సింపుల్!

రేడియోధార్మిక వ్యర్థాలను తీసుకుని పోతున్న వాహనం ప్రస్తుతం మార్స్‌కు వెళ్లేదారిలో ఉంది. దాన్ని మనం నాశనం చేయలేం. ఎందుకంటే దానికి తగిన సాంకేతిక సాధన సంపత్తి మన దగ్గర లేదు. ఎన్నో ఇతర ప్రత్యామ్నాయాలను గురించి పరిశోధించిన మీదట, చివరికి దేన్ని ఎన్నుకున్నామంటే, దాని మార్గాన్ని మార్చి, వెళుతున్న మార్గం లోంచి పక్కకు తిప్పడం. దానికి ఒకటే మార్గం. ఒక అంతరిక్ష నౌకలో ఒక బృందాన్ని అంతరిక్షంలోకి పంపి, ఏదో ఒక విధంగా ఆ వాహనాన్ని ఇంకో దిశలోకి మళ్లించడం చేయగలుగుతాము.”

అతని మాట్లాడిన వెంటనే, హాల్లో పెద్ద అలజడి చెలరేగింది. జనం లేచి నిలబడి, కేకలు వేస్తూ, గొడవ చేయసాగారు. వెంటనే ప్రొఫెసర్ ప్రాన్సిస్ ముందుకు వచ్చి ఇలా అన్నాడు.

“దయచేసి నిమ్మళించండి. మీ దేశం ఇంతకంటే మెరుగైన పద్ధతిలో ఈ పరిస్థితిని అదుపు చేయగలగితే, ఎవరి సాయం లేకుండా, మరీ మంచిది. మీ వ్యూహం ఏమిటో చెప్పండి.”

ఈ మాటలు ఆయన అనుకున్న ప్రభావాన్ని చూపాయి. అందరూ శాంతించారు.

“ఈ మహాకార్యాన్ని నిర్వహించడానికి ఒక టీమ్‌ను ఎననుకోడానికి మాత్రమే మనం ఇక్కడ గుమిగూడాము. ఇంతకు మునుపే నేను కొందరికి ఫోన్లు చేశాను. టీమ్‌ను నడిపించే ఇద్దరు పేర్లను ఖరారు చేశాము.”

ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ తన అరచేతిలోని ఒక బటన్ నొక్కాడు. ప్రొజెక్టరు ఆన్ అయి. ఒక స్పష్టమైన బొమ్మ..

“నీల్ బ్యారీ!” అని పిలిచాడు అయన. ఈ ప్రకటన వల్ల ఎటువంటి చప్పట్లు హర్షధ్వానాలు వినబడలేదు. వాతావరణంలో టెన్షన్.

“రష్యా, అమెరికా, చైనా దేశాలు, మిస్టర్ నీల్‌ను టీమ్‌లో ఒక లీడ్ మెంబరుగా అంగీకరించాయి. నీల్‌కు ముఫై ఐదు సంవత్సరాలు మనకు కావలసిన దాని కంటే ఎక్కవే న్యూక్లియర్ అనుభవం ఉంది. అమెరికన్ సైన్యంలో ఆయన ఎన్నో పతకాలు పొందిన పైలట్. అత్యంత కీలకమైన ఆపరేషన్లను ప్రత్యక్షంగా నిర్వహించినవాడు. ఎన్నో విజయవంతమైన మిషన్స్‌కు నాయకత్వం వహించినవాడు. కొత్త సైనిక విమానాలు, సామాగ్రిని పరీక్షించడంలో అతని పాత్ర గొప్పది. అతడు ఎప్పుడూ రిలాక్స్‌డ్‌గా, ప్రశాంతంగా, ఏకాగ్రతతో, ఆత్మ విశ్వాసంతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. ఈ పరిస్థితిలో ఆయన స్థానంలో మరొకరిని ఊహించలేం.”

హాలులో కాసేపు నిశ్శబ్దం. ఎవరో అరిచారు “మరి మా అభిమాన వ్యోమగామి యూరి ఇవానోవ్ మాటేమిటి? అతను కూడా సమర్థుడే!”

“మీరెవరో గాని, మంచి మాట చెప్పారు. మీకు కృతజ్ఞతలు. మీ కంటే ముందే మేము యూరి ఇవానోవ్‌ను లీడ్ మెంబరుగా, టీమును నడిపించబోయే రెండో వ్యక్తిగా నిశ్చయించాం” అన్నాడు ప్రొఫెసర్.

ఆయన జవాబిస్తుండగానే, తెర మీద నీల్ బొమ్మ మారి యూరీ బొమ్మ ప్రత్యక్షమైంది.

“మీలో, అతనిని గురించి తెలియని వారి కోసం చెబుతున్నాను. యూరీ ఇవానోవ్ నలభై రెండేళ్ల వాడు. మన కాలంలో, అత్యంత సాహసికుడైన వ్యోమగామి. అంతరిక్షంలోకి సోవియట్ యూనియన్ నిర్వహించిన మిషన్లలో అతడు అతిముఖ్య భాగస్వామి. రష్యాలోనే గాక, ప్రపంచంమంతటా ఆయన లబ్ధప్రతిష్ఠుడు. నేను అతనితో పని చేశాను. ఆయనకున్న స్పష్టమైన ‘విజన్’ వల్లే ఆయన ముందుకు పోతున్నాడు అని నేను చెప్పకతప్పదు” అని వివరించాడు ప్రొఫెసర్. “దయ చేసి మీరిద్దరూ వేదిక పైకి వస్తారా?” అని వారిని ఆహ్వనించాడు.

నీల్, యూరీ వేదిక నెక్కుతుండగా హాలంతా హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది.

“మనం త్వరగా ముందుకెళదాం. మనం రూపొందిస్తున్న బృందంలో ఆరుగురు ఉంటారు. ప్రస్తుతం ఇద్దరైనారు. మనం నామినేట్ చేయాల్సిన వాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా?”

“అవును సార్, నేను వెళ్లాలనుకుంటున్నాను!” అన్నాడు వెనక నుంచి అలెక్సిస్.

ఎక్కువగా ఆలోచించకుండా, ప్రొఫెసర్ అడ్డంగా తల ఊపి అన్నాడు. “ఐయామ్ సారీ, నీవు వద్దు. ఒత్తిడి తట్టుకోవడానికి తగినంత అనుభవం గలవారు మనకు కావాలి.”

ఆయన మాటలకు అలెక్సిస్ తల వంచుకున్నాడు. భూమి తనను తనలోకి లాగేసుకుంటే బాగుటుందని అతని కాక్షణంలో అనిపించింది.

“అయితే, నీలాంటి మేధావి బుర్ర కంట్రోల్ సెంటర్‌లో చాలా అవసరం.”

ఈ మాటలు ఆ యువకుని పెదవులపై చిరునవ్వును పూయించాయి.

“ఇంకా ఏవైనా నామినేషన్లు?” అని జనం వైపు తిరిగి అడిగాడాయన. ఆయనకు కొంత అసహనంగా ఉంది. తాము కూర్చిన జాబితాలోని కొందరి ప్రొఫైల్స్‌ను హాలుకు చూపడానికి ఆయన నిర్ణయించాడు.

ఆయన ఒక్కో బటన్ నొక్కుతూ ఉంటే, ఒక్కో ఫోటో తెరపై ప్రత్యక్షకాసాగింది. అవన్నీ బాగా ప్రఖ్యాతులు పొందినవారివే. తర్వాతి బొమ్మను చూపేముందు జనం స్పందన కోసం ఆగుతున్నాడాయన.

“ఇదిగో ఇక్కడ ఉల్రిక్ మెదీనా ఉన్నాడు. శిక్షణ పొందిన వ్యోమగామే. అతడు కూడా! తర్వాత వ్లాదిమిర్ నోవిక్.”

“యస్ నోవిక్” అని ముందు వరసలోంచి ఒక గొంతు వినబడింది. ఆ గొంతు డాక్టర్ జేమ్స్‌ది. “అతని పూర్తి ప్రొఫైల్ చూద్దాం.”

“అలాగే! నోవిక్‌కు నలభై రెండేళ్లు. చాలా అనుభవం ఉన్నట్లు అనిపిస్తుంది కదూ! ఆయన క్రీడాకారుడు, ఫిట్‌నెస్ నిపుణుడు. పైలట్ శిక్షణ పొందాడు, ఆయుధాలను ప్రయోగించడంలో నేర్పు గడించాడు. రష్యా, అమెరికా, రెండు దేశాలకు ఆయన పై విశ్వాసం ఉంది. కాబట్టి నిష్ణాతులైన యూరీ, నీల్ లకు తోడుగా, మిషన్‌ను నడపడానికి అతనికి ప్రథమ ప్రాధాన్యత. ఇది చాలా ఆసక్తికరం. మిస్టర్ వ్లాదిమీర్ నోవిక్, దయ చేసి లేచి నిలబడండి”

నెమ్మదిగా, ఒక వ్యక్తి హాలువైపు వీపు పెట్టి, లేచి నిలబడ్డాడు. నిలువెల్లా నల్లని దుస్తులు ధరించాడు. నలభైల్లో ఉన్నా, ధడంగా ఉన్నాడతడు. అతని చూపులు చురుగ్గా, చంచలంగా ఉన్నాయి. జాగ్రత్తగా మెట్లెక్కి పోడియం దగ్గరికి చేరుకున్నాడు.

“ఆహా! ఈయన ముఖం నాకు బాగా గుర్తే.” అన్నాడు ప్రొఫెసర్.

“ఈయనను తొలి ప్రాధాన్యతగా ఎన్నుకోవడం అందరికీ ఆమోదయోగ్యమని భావిస్తున్నాను. ఎందుకంటే రెండు శక్తివంతమైన దేశాల మధ్య అతనికి తగినంత చరిత్ర ఉంది.”

యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, లండన్ ఏజెన్సీ అధిపతులు ఇద్దరూ అంగీకారంగా తల ఊపారు. హాలంతా అంగీకారం ధ్వనించింది.

“సరే, ముందు కెళదాం ఇక.”

అలా ప్రొఫెసర్ వారికి సమర్థులైన, చురుకైన స్త్రీ పురుషుల ప్రొఫైల్స్‌ను చూపడం ప్రారంభించారు. మరో ముగ్గురు టీం సభ్యులను ఎన్నుకున్నారు ఆ సంక్లిష్ట ప్రయాణానికి.

వారిలో ఒకరు ‘టోరి మోటో శాటో’. ఇరవై రెండేళ్ల అమ్మాయి. ఆమె ఒక అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త కుమార్తె. అప్లయిడ్ మ్యాథ్స్‌లో, ఖగోళ లెక్కల్లో ఆమె వృత్తినిపుణ. ఆ రంగంలో ఆమె కున్న అభిరుచి వల్ల ఆమె అందులో చేరింది. వివిధ అసాధారణ పరిస్థితులకు కావలసిన గణిత ఈక్వేషన్స్‌ను ఆమె రాబట్టింది. స్పేస్ బాడీస్‌ను ట్రాక్ చేయడంలో, ఆ ఫలితాలను బేరీజు వేయడంలో అవి శక్తివంతమైన సాధనాలు. అవన్నీ ఆమె క్లిష్టమైన సాఫ్ట్‌వేర్, హైటెక్ పరికరాలు ఏవీ లేకుండానే చేయగలిగింది. అవన్నీ కీలకమైన పాయింట్లు.

ఐదో వ్యక్తి రాకేష్ కృష్ణ. భారతదేశం నుండి. ముఫై మూడేళ్ల యువకుడు. ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి పట్టభద్రుడు. ఐ.బి.ఎమ్. మెయిన్ ఫ్రేం ప్రోగ్రామింగ్ లోని మొదటి సిరీస్ లోనే అతనికి అపారమైన అనుభవం ఉంది. ఎన్నుకోబడిన వారిలో చివరి వ్యక్తి అలివర్ స్పెన్సర్. ఆమెకు ఇరవై తొమ్మది సంవత్సరాలుంటాయి. ఆమె యూరోపియన్ అంతరిక్ష సంస్థలో వ్యోమగామి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here