అంతర్జాతీయ సమాజాన్ని నిలదీస్తున్న బాలలు

0
2

[పర్యావరణ సంక్షోభాలపై అంతర్జాతీయ సమాజాన్ని నిలదీస్తున్న బాలల గురించి వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]

[dropcap]ఇం[/dropcap]టర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బాలలకు సంబంధించిన అన్ని హక్కులను గౌరవిస్తుంది. గుర్తిస్తుంది కూడా. ఈ అంశానికి సంబంధించి 1959లోనే ఐక్యరాజ్యసమితి ఒక డిక్లరేషన్‌ను వెలువరించింది.

1989లో బాలల హక్కులకు సంబంధించి ప్రపంచ దేశాల నాయకులు సమావేశమై ఒక అంగీకారానికి వచ్చారు. బాలల హక్కులకు, సంబంధించి చాలా దేశాలు ఆమోదించిన మానవ హక్కుల ఒప్పందంగా ఈ U. N. కన్వెన్షన్ ప్రసిద్ధి పొందడమే గాకుండా పిల్లల జీవితాలలో చక్కని మార్పులకు దోహదం చేసింది. అనేక దేశాలలో ప్రభుత్వాలు చట్టాలను, విధానాలను మార్చేలా స్ఫూర్తిమంతం చేసింది.

హింస, దోపిడి, వలసలు, పర్యావరణ మార్పులు వంటి అంశాలన్నీ బాలల జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. పిల్లలు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పరిసరాలు/వాతావరణంలో పెరగడానికి, తద్వారా చక్కని జీవన విధానంతో పెరిగి షెద్దయి వృద్ధి లోనికి రావకానికి హక్కుదారులు. రోజు రోజుకూ దెబ్బతింటున్న పర్యావరణ సమతౌల్యం బాలల వికాసాన్ని, పూర్తి సాకర్యాలతో వృద్ధి లోనికి వచ్చే దిశగా కృషి చేయడానికి విఘాతకరంగా పరిణమించింది.

ముదురుతున్న పర్యావరణ సంక్షోభాలు బాలలనూ తమ హక్కుల దిశగా ప్రశ్నించేలా చైతన్యవంతులను చేస్తున్నాయి.

U.N.C.R.C.:

ఇది ఒక అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం. రాజకీయ, ఆర్థిక, సాంఘిక, పౌర, ఆరోగ్య సంభందమైన అన్ని అంశాలకు సంబంధించిన హక్కులు ఇందులో పొందుపరచబడ్డాయి. బాలల హక్కులకు సంబంధించి కొన్ని ఛాప్టర్‍లు ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా గుర్తించి వారికి ప్రత్యేకమైన హక్కులు కల్పించడం జరిగింది. ఆ హక్కులకు భంగం కలిగిందని భావించినపుడు పిల్లలు సంబంధిత అంశాలను ప్రస్తావిస్తూ పిల్ వేయవచ్చు. బాలలు సైతం స్వంతంగా తమ హక్కులను గురించి న్యాయపోరాటం చేయగల సామర్థ్యాలను పెంపొందించుకోగలగాలి. తద్వారా వారికి బాధ్యతలూ తెలుస్తాయి.

ఈ U.N.C.R.C పై ఇప్పటి వరకు 196 దేశాల సంతకాలు చేశాయి. సంతకం చేసిన దేశాలలో కొన్ని దేశాలలో ఒప్పందం అమలుకు ఆమోదముద్ర (రాటిఫికేషన్) పడగా కొన్ని దేశాలలో ఇంకా రాటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు.

అమెరికా అయితే ఒప్పందంపై సంతకం చేయలేదు. ఆ కారణంగా సింహభాగం ఉద్గారాలను విడుదల చేస్తున్న అమెరికా, చైనా not bound to. సంతకం చేసిన దేశాలు ఒప్పందం లోని నిబంధనలను గౌరవించవలసి ఉంటుంది. రాటిపై చేసిన దేశాలు, హక్కుల ఉల్లంఘనకు కూడా జవాబుదారీ కూడా వహించవలసి ఉంటుంది. 1989 నాటి ఈ ఒప్పందం 1990 నుంచి అమలు లోనికి వచ్చింది.

U. N. కమిటీ:

ఈ ఒప్పందం అమలు పర్యవేక్షణ నిమిత్తం ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో 18 మంది న్యాయనిపుణులు/లీగల్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. U.N లోని వివిధ దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు వీరిని ఎన్నుకుంటారు. వారి పదవీ కాలం 4 సంవత్సరాలు. కన్వెన్షన్ (C.R.C)ను రాటిపై చేసిన దేశాలలో అన్ని నిబంధనలు సరిగా పాటించబడుతున్నాయో లేక ఉల్లంఘనకు గురి అవుతున్నాయో పర్యవేక్షిస్తూ, ఒప్పందం సరిగ అమలు జరిగిలా చూడవలసిన బాధ్యత ఈ కమిటీదే. ఈ కమిటీ విధివిధానాలన్నీ కమిటీ వెబ్‍సైట్‌లో రిపోర్టుగా కనిపిస్తాయి. హక్కుల ఉల్లంఘన జరిగించని భావిస్తే అపీల్ చేసుకొని అవకాశం ప్రజలకు ఉంది.

మోంటానా ప్రభుత్వం Vs బాలలు కేసులో తీర్పు బాలలకు అనుకూలంగా రావడం ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం.

అర్జెంటినా, బ్రెజిల్, టర్కీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు తమ శిలాజ ఇంధన కాలుష్యంతో మిగిలిన దేశాల లోని బాలల హక్కులకు సైతం భంగం కలిగిస్తున్నాయని 18 సంవత్సరాల లోపు బాలలు 16 మంది పిటీషన్ వేశారు. ప్రపంచదేశాల అధినేతల అలసత్వం/ఉదాసీనత పర్యావరణం సంక్షోభాన్ని నివారించే దిశగా కాక పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయని వారు ఆరోపించారు – ‘పర్యావరణ సంక్షోభం’ సమస్యను తక్షణం పట్టించుకోవాలని, వెంటనే పరిష్కారానికి నడుం బిగించాలని వారు పట్టుబడుతున్నారు. తమకు ఏ రకమైన నష్టపరిహారాలూ అవసరం లేదనీ, సమస్య పరిష్కారమే తమకు కావాలని వాళ్లు సృష్టంగా వెల్లడించారు.

క్లైమేట్ లిటిగేషన్స్ విషయంలో అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు కలగచేసుకునేవి కాదు. కానీ సీన్ మారుతోంది. పెరుగుతున్న డిమాండ్ల రీత్యా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా – ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం సూయింగ్ కుదురుతుందా లేదా క్లైమేట్ ఛేంజ్‍కు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లను/చట్టాలను చేయవలసి ఉంటుందా అన్న అంశాలను పరిశీలిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here