[డా. కోగంటి విజయ్ రచించిన ‘అంతే!’ అనే కవితని అందిస్తున్నాము.]
[dropcap]శి[/dropcap]ల కరగదు
అల నిలవదు
శిల కరిగితే
అల నిలిస్తే
అన్నీ ప్రశ్నలు
అతడిలా ఉండాలని
ఆమె ఇలా మాట్లాడాలని అంటాం
కానీ నీరు నింగిలో పారదు
గాలి భూమిలో వీయదు
అన్నీ ఊహలు
నీలా నేనుండను
నాలా నీవుండవు
అయినా ఉండాలంటాం
ఉందామనుకుంటాం
అన్నీ భ్రమలు