Site icon Sanchika

అనుభవం

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘అనుభవం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]లో[/dropcap]కంలో
మనిషిని వదలని నిజాలు రెండు
ఒకటి బాధ.. రెండు గాయం
బలం కొద్ది పరిగెత్తినా
బలహీనత కొలది కలబడినా

ధనవంతుడనైనా.. పేదవాడినైనా
కన్నీళ్లును తాగించి
మనిషిని ఓదార్చి
మనసును చల్లపరిస్తే

అనుభవం
మాట్లాడే స్థాయి
ఎప్పుడో వచ్చి తీరుతుంది..

Exit mobile version