[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘అనుభూతులే కుటుంబం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]యిదువేళ్ళు కలిపితేనే
పిడికిలి బలం తెలిసేది
కుటుంబంలో అందరు
కలిసుంటేనే ఆనందం
చెట్టుకు పాదు ఆధారం
పెద్దలున్న యిల్లు నందనవనం
పిల్లలే ఇంటపరిమళాలు
వెదజల్లే సుమసుంధాలు
అమ్మనాన్నలు ఆలంబనం
కోపాలుతాపాలు ప్రేమకు చిహ్నాలు
అన్నదమ్ముల అనుబంధాలు
అరమరలులేని అక్కచెల్లెళ్ళ అనురాగాలు
మమతలు బంధాలు బాధ్యతల
సమాహారమే అందమైన కుటుంబం
చిన్నచూపు చూడవద్ధు
బంధాలనే నారు వేసి
మమతల నీటితో తడిపితే
కుటుంబమనే మహావృక్షం
ఎందరికో నీడనిచ్చే అందమైన
కోవెలగా ఆశ్రయమమౌతుంది
కుటుంబవ్యవస్థ మన భారతీయతలో
వేళ్ళూనుకున్నది అందుకే
దేశదేశాలు మనకు నీరాజనాలు పడతారు
దేశాలు దాటి వెళ్ళిన
నేటితరాలకు ఆ అందాలను
ఆ బంధాల మాధుర్యాలను
నేనున్నానన్న ధైర్యంలోని
బలాన్ని ఆత్మస్థైర్యాన్ని
అందించటానికి కుటుంబంలోని
అనురాగ అనుభూతుల
సౌందర్యాలను పంచటానికి
మానవ ప్రయత్నం
మన ప్రయత్నం చేద్దాం