Site icon Sanchika

అనుకోని అతిథి

అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘ఊహల పందిరి’ నవలను, సమకాలీన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసి, ‘అనుకోని అతిథి’ పేరిట ప్రచురించారు. ఇందులో కృష్ణమోహన్, శిల్ప, శ్వేతలు ప్రధాన పాత్రలు. కృష్ణమోహన్, శిల్ప భార్యాభర్తలు. శ్వేత కృష్ణమోహన్ ఆఫీసులో పి.ఎ.గా పని చేస్తూంటుంది. ఆమె కృష్ణమోహన్‌ని చూసిన తొలిక్షణం నుండి ప్రేమిస్తుంది. అతనికి పెళ్ళి అయిందని తెలిసికూడా అతడిని ప్రేమిస్తుంది.

ఓ రోజు ఇంటికి వచ్చి శిల్పతో తాను ఆమె భర్తని ప్రేమిస్తున్నానని, రెండవ భార్యగా ఉండడానికి సిద్ధమేనని, ఎలాంటి హక్కులు అవసరం లేదని, వారానికి రెండు రోజులు తనతో ఉంటే చాలని చెప్తుంది. ఇక అక్కడి నుంచి కథ ఆరంభమవుతుంది. ఎలాగైనా కృష్ణమోహన్‌ను పొందాలని శ్వేత చేసే ప్రయత్నాల వల్ల వారి ముగ్గురి జీవితాలలో చెలరేగిన పరిణామాలే ఈ నవల ‘అనుకోని అతిథి’.

 

 

అనుకోని అతిథి

అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి

పేజీలు: 136, వెల: రూ.60/-

ప్రతులకు:

సాహితి ప్రచురణలు, 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ.

0866-2436642/43

సంచిక బుక్ డెస్క్

Exit mobile version