అనువాద మధు బిందువులు – అనువాద కవితల ధారావాహిక ప్రారంభం – ప్రకటన

0
3

[dropcap]ప్ర[/dropcap]పంచ సాహిత్యంలో కవిత్వానికి ఉన్న స్థానం గొప్పది.

తేనె లాంటి కవిత్వం సాహిత్యాభిమానులకు విందు చేస్తుంది. అటువంటి మధువు లొలికే దేశ విదేశీ కవితలను అనువదించి అందిస్తున్నారు సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ.

ఎలనాగ అనే కలం పేరుతో ప్రసిద్ధులైన డాక్టర్ నాగరాజు సురేంద్ర సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా కొన్ని జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు‘ పేరిట అందిస్తున్నారు.

“ఎక్కడ మంచి కవిత్వం కనపడినా అది ప్రసిద్ధ కవిదా లేక పేరుప్రతిష్ఠలు లేని వ్యక్తిదా అని ఆలోచించకుండా అనువదించడం నాకు అలవాటు కనుక, ఈ తర్జుమాలలో రెండు రకాల కవితలు కనిపిస్తాయి. వీటిలో ఎక్కువ వరకు భారతీయ భాషల కవిత్వం ఉన్నప్పటికీ, కొన్ని కవితలు పాశ్చాత్య కవులవి కావటానికి కూడా కారణం అదే. అదే విధంగా కొన్ని ప్రాచీన కవులవి, కొన్ని చాలా వరకు ఆధునికులవి అనువాద మధు బిందువులు శీర్షికన తెలుగు సాహిత్య పిపాసులకు అందిస్తున్నాను”  అన్నారు ఎలనాగ సంచికలో వచ్చే వారం నుంచీ ఆరంభిస్తున్న నూతన అనువాద కవిత శీర్షిక గురించి.

***

దేశ విదేశీ కవితల తెలుగు అనువాదం – అనువాద మధు బిందువులు – వచ్చే వారం నుంచి ప్రారంభం.

అనువాదంః ఎలనాగ

 

చదవండి.. చదివించండి.

అనువాద మధు బిందువులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here