Site icon Sanchika

అన్వేషణ

[dropcap]క[/dropcap]ళ్ళు తెరిచిన శిశువు నెతికే నొక అన్వేషణ
నడక నేర్చిన చిరు పాదాలు వెతికే నొక అన్వేషణ
మాట రాగానే మాట వెతికే తనకు సొంతమగు ఒక అన్వేషణ
కౌమార యవ్వనం ఉరుకుల పరుగులు నెతికే నొక అన్వేషణ
ఒక్కటయ్యే బంధమేర్పర్చిన మొదటి పయనం నెతికే ఒక అన్వేషణ
ఆలుమగల ప్రణయ రాగాలు వెతినొక అన్వేషణ
పుట్టిన తన ప్రతిబింబాలని చూసి నెతికే నొక అన్వేషణ
సంసార సాగర మధనములో రోజుకొక అన్వేషణ
జవసత్వాలు ఓడినప్పుడు వెతికేనొక అన్వేషణ
తనయ తనయుని ఛీత్కారమున నొసలు వెతికే నొక అన్వేషణ
చిట్ట చివరకు చితి చేరిన దశలో ముగిసే ఆఖరి చిరునవ్వుల దరహాసపు అన్వేషణ

Exit mobile version