[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్ రచయితల సంఘం – మే 29వ తేదీ ఉదయం విజయవాడలోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావుతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది.
ఒకే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాల గ్రంథాలయ సంస్థలతో పుస్తకాలు కొనుగోలు చేసి రికార్డు సృష్టించినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సందర్భంలో రాష్ట్రంలోని 13 జిల్లాల రచయితలు, కవులు, ప్రచురణకర్తలకు కలిగిన అనేక సందేహాలను నివృత్తి చేసేందుకు, భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని కవులు, రచయితలు, పుస్తక ప్రచురణకర్తలు తమ సలహాలు, సూచనలు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దృష్టికి తీసుకు వెళ్ళేందుకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, అన్ని ప్రాంతాల కవులు, రచయితలు, పుస్తక ప్రచురణకర్తలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ ముఖాముఖిలో కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్శన్ శ్రీమతి తిప్పరమల్లి జమలపూర్ణమ్మ తదితరులు పాల్గొంటారు. కొందరు కవులు, రచయితల పుస్తకావిష్కరణలు కూడా జరుగుతాయి. కనుక ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనదలిచేవారు తమ పేర్లను 9247475975 నెంబరులో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తెలుగు కవులు, రచయితలు తమ పుస్తకాలు గ్రంథాలయాలకు విక్రయించి తమ రచనలను పాఠకుల చెంతకు చేరేలా ఉపయోగపడే ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
– చలపాక ప్రకాష్
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం