Site icon Sanchika

అపురూప నేస్తాలు

కోరికలు, కవితలు, కలలన్నీ కమనీయ కావ్యాలై.. రమణీయ రూపాన్ని సంతరించుకుని.. అందమైన దృశ్యకావ్యంలా భాసిల్లాలంటే అక్షరాలు ‘అపురూప నేస్తాలు‘గా మారాలంటున్నారు గొర్రెపాటి శ్రీను.

మది అంతరంగంలో మెదిలే
కోరికలు కొన్ని
అక్షరాలుగా మారి
లక్ష్యాలై కళ్ళముందు కదులుతుంటే
కవితలై సాక్ష్యాత్కరిస్తుంటే
కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటాను !
కోరికలు, కవితలు, కలలన్నీ కమనీయ కావ్యాలై ..
రమణీయ రూపాన్ని సంతరించుకుని..
అందమైన దృశ్యకావ్యంలా.. భావాల వర్ణాలెన్నో మేలుకలయికలతో..
నయనానందకరమై.. ముగ్ధమనోహరమై ..
ఆహ్లాదాన్ని పంచాలనుకుంటూ పరితపిస్తుంటాను !
కలం కదలికలు ..
కమనీయం.. రమణీయం ..
అక్షరాల చిత్రాలు.. కవితా కుసుమాలైన.. అపురూపనేస్తాలు !

Exit mobile version