అరణ్యరోదన

6
2

[box type=’note’ fontsize=’16’] మత్తెక్కించి మైమరపు కలిగించిన ఒకనాటి హిరణ్య అరణ్యం నేడు ఎడారిగా మారిందని, తన వనగీతి అరణ్యరోదన అయిందని అంటున్నారు శంకరప్రసాద్ “అరణ్యరోదన” అనే కవితలో. [/box]

[dropcap]అ[/dropcap]ది అవని, అందులో ఓ వని
ఆమని వస్తే చెప్పను ఏమని
ఏ కవనము వర్ణించగలదు
ఆ వన విలాసము

మలయమారుతము వీయగనే
తరువులు తన్మయమై తలలూపును
కోయిల గానం హాయిగ వినగలం
మయూరి వయారి నాట్యం

హరిణముల పరుగుల విన్యాసం
శశి సమూహములను చూడ
మేఘమాల భువిపై దిగినట్లు

కుసుమ సుగంధ ఆఘ్రాణం
మత్తెక్కించి మైమరపు కలిగించు

అది ఒక హిరణ్య అరణ్యం-.

.నాడు…………

మరి నేడు…?

కర్కశ ముష్కరుల యంత్రఛేదనంతో
కూలిపోయిన మహా వృక్షాలు
గూడు లేక చెదరిపోయిన పక్షులు
నీడలేక బెదిరిపోయిన మృగాలు
గాలిలేక ఆరిపోయిన ఆకాశం
వానలేక ఎండిపోయిన నేల
నీరులేక తడారిన గొంతులు
ఎడారిగా మారిన హరితవనం

ఈ వేదన రోదన వినేదెవరు
అడవితల్లిని సాకేదెవరు

ఈ నా వనగీతి అరణ్యరోదనే కదా….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here