[dropcap]నే[/dropcap]ను అలాగే ఉన్నాను
ఏళ్లుగా, పదేళ్లుగా, వందేళ్లుగా, వెయ్యేళ్లుగా
ఇంకా అంతకు ముందునుండి కూడా
మంచుకొండల్లో మహాదేవుణ్ణి చూస్తున్నాను
పారే నదుల్లోని పవిత్రతను పూజిస్తున్నాను
చెట్టూ పుట్టా ఎగిరేపిట్టా, ఎవుసంచేసే ఎద్దూ
పిల్లీ, కుక్కా … పిలిచిన పలికే చిలుకా
అన్నిటితో నేనున్నాను, అన్నిటికీ నేనున్నాను
నేను
కలిసిపోయాను
ఎండలో ఎండగా, నీడలో నీడగా
ఆకులో ఆకుగా, మట్టిలో మట్టిగా
నేనెక్కడా
విడిగా ఉండను, వేరుగా కనపడను
కట్టూ, బొట్టూ, తిండీ తీరుతెన్నులూ…
పురిట్లోని తొలి వేడుక నుండి
పుడకల మంటల తుది ఏడుపు దాకా
అన్నీ ఈ నేలకు అనుగుణంగానే
అన్నీ ఈ మట్టికి అనుబంధంగానే
కానీ నీవో
ప్రత్యేకంగా కనపడాలని ప్రయత్నిస్తావు
పలుకుతావు, పాడతావు, ఆడతావు,
అవసరాన్ని మించి ఆ తీరునే పోట్లాడుతావు
వేషం, భాషా, తిండీ, తిరిగే స్థలమూ…
పుట్టుకనుండి మట్టిలో కలిసేదాక
ఉండే పద్ధతులన్నీ
‘పరాయి’గానే కనిపించేలా పాటిస్తావు
రవాణా అయి వచ్చిన అమ్మల్లోంచే కాదు
రంగు మారిన ఇక్కడి తల్లుల్లోంచి కూడా
మొలకెత్తిన నీలో ఇంకా
ఆ ‘పరాయి పిచ్చి’ పచ్చిగానే ఉంది
వచ్చి వెయ్యేళ్లు అయి, వయసు పెరిగినా
ఆ పిచ్చి ముదురుతూనే ఉంది
ప్రపంచయవనికపై ఈ పతాకం
తలకిందులైన ప్రతిసారీ కేరింతలు కొడతావు
ఓడిపోయినప్పుడల్లా వేడుకలు చేసుకుంటావు
ఈ ఇంట్లో ఉంటూ ఆ ఇంటి పాట పాడుతుంటావు
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దుతుంటావు
ఈగడ్డమీద పుట్టి ఈ గడ్డ మీద పెరిగి
ఏళ్లకేళ్ళు గడిచినా, ఈగడ్డ నీది కాదంటావు
నువ్వెన్నడూ చూడనిదీ, నిన్నెవ్వరూ తెలియనిదీ
ఇంకెక్కడో ఉందంటావు
దాని బాగుకోసం తహతహలాడుతుంటావు
అక్కడికే వెళ్తానంటే నిన్ను వద్దన్నదెవరు
ఈ ‘అసహనపు’ వాసనలు వదలమన్నదెవరు
నీ మేధో ఆస్తులకు, మేదిని ఆస్తులకు
లెక్కలేసి వెలకట్టిస్తాం ఓ పిసరెక్కువగానే
వెళ్లిపో ఎక్కడికైనా
నిన్ను అక్కున చేర్చుకునే ఏ చోటకైనా
నువ్వు మక్కువ పెంచుకున్న ఏ నేలకైనా
అక్కడ హక్కులుంటాయో లేవో కానీ
దండిగా ఉంటుందిగా నీవు కోరుకున్న “సహనం”
నేనయినా బతుకుతాను ఇక్కడ మనశ్శాంతితో
నా కన్నతల్లి, భరతమాత చల్లని ఒడిలో