[dropcap]కో[/dropcap]వెల సుప్రసన్నాచార్య సృజించిన స్మృతి కావ్యం ‘అశ్రుభోగ’. సంచిక వెబ్ పత్రికలో ధారావాహికగా వెలువడిన ఈ ఖండకావ్యం పుస్తక రూపంలో వెలువడింది.
ఈ పుస్తకం గురించి వివరిస్తూ కవి సుప్రసన్నాచార్య ‘తొలిపలుకు’లో “ఈ కావ్యం.. కావ్యమనాలా? దుఃఖం అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దీనిలో ప్రజ్ఞావాదం లేదు. ‘నష్టోమోహః స్మతిర్లబ్దా’ అన్న దశ లేదు. ‘అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యష్యామి’ అనే జగద్గురువు అభయహస్తం కావాలి” అని రాశారు.
***
“అశ్రుభోగ ఒక నిశ్శబ్ద ఆత్మాంతర యానం. ఒక ఆత్మ దాహనం. ఆత్మ క్షాళనం. ఆత్మశుద్ధి క్రియ. మౌన సాంద్రతర దుఃఖసాగరం నుండి విముక్తమయ్యే అవస్థాంతర ప్రాప్తయత్నం” అన్న అభిప్రాయం వ్యక్తపరిచారు రామాచంద్రమౌళి ‘ఆత్మాన్వేషణ’ అన్న ముందుమాటలో.
***
ఏడ్పిది జన్మలె న్ననుభవించిననైనను పోదు పాపపుం
గాడ్పిది భావగంధమయి ప్రల్లదమై ఎద నావరించుబో
వీడ్పడినట్టి సంగతిని వెఱ్ఱి చికాకులు క్రమ్మునీ భువిన్
తడ్పని మేఘమై మనికి దారుల గ్రీష్మము నిండిపోయెడున్
అత్యంత తాత్విక భావనలను అత్యంత సరళంగా ప్రదర్శిస్తుందీ ఖండకావ్యం.
తెలుగు సాహిత్యం పట్ల ప్రేమ కలవారందరూ తప్పనిసరిగా చదివి, ఆనందించదగ్గ కావ్యం ఇది.
***
స్మృతి కావ్యం
రచన: కోవెల సుప్రసన్నాచార్య
ప్రచురణ: మాధురీ బుక్స్, వరంగల్
ప్రతులకు: 9052629093, 9052116463
వెల: అమూల్యము