[dropcap]అ[/dropcap]తడినెవరు పొగుడుతారు?
చిన్న పత్రికలో పెద్దకవి రాసిన కవిత పడితే
కవిని పొగుడుతారు.
విశాలహృదయంతో ఆ పత్రికకు కవిత పంపాడని
కవిని మెచ్చుకుంటారు.
పెద్దపత్రికలో చిన్నకవి రాసిన కవిత పడితే
సంపాదకుని పొగుడుతారు.
సహృదయంతో ఆ కవిని ప్రోత్సహించాడని
సంపాదకుని కీర్తిస్తారు.
కానీ, రెండు పత్రికలను చదివే
పాఠకుడి సమదృష్టిని ఎవరు గుర్తిస్తారు?
అతనే లేకుంటే ఈ ఇద్దరినీ ఎవరు పోషిస్తారు?
అతడి విశాల స్వభావాన్నిఎవరు కీర్తిస్తారు?