పాలమూరు జిల్లా కవులకు అతిథి జాతీయ పురస్కారాలు – ప్రెస్ నోట్

0
2

[dropcap]పా[/dropcap]లమూరు జిల్లాకు చెందిన ప్రముఖ పరిశోధకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, డాక్టర్ వెల్దండ వేంకటేశ్వరరావులకు జాతీయ ఎక్సలెన్సీ పురస్కారాలు లభించాయి.

26 ఫిబ్రవరి 2024 న హైదరాబాద్ లోని రవీంద్రభారతి ప్రధాన సమావేశ మందిరంలో అతిథి జాతీయ మాసపత్రిక దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరూ అతిథి జాతీయ ఎక్సలెన్సీ పురస్కారాలను అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా, జె.ఎన్.టి.యు మాజీ వైస్ ఛాన్సలర్ డి.ఎన్.రెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, అతిథి జాతీయ మాసపత్రిక సంపాదకులు మద్దాలి వెంకటేశ్వరరావు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.బాలాచారి, ఆహ్వాన కమిటీ సభ్యులు పవన్ సాయి, డాక్టర్ కె. రాందాస్, ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here