[dropcap]“సిం[/dropcap]ధులోయ నాగరికత, హరప్పా మొహంజదారో, చైనాలోని యుమాంగ్
హో మైదానాలు, ఈజిప్టు మొసపటేమియా నాగరికతల కత ఏమినా?” అంటా
అరి అన్నని అడిగితిని.
“అది మనిషి కతరా, మనిషి దశనుంచి దశకి, దిశ నుంచి దిశకి
పరిణామం చెందే అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా, అదేరా ఆ
నాగరికతల అసలు కత” గొప్పగా చెప్పే.
“మడి ఈ పొద్దు కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్
మిషన్లు, ఇంధనం, రోదశి ప్రయోగాలు పరిజ్ఞానం, ఇదినా?” ఇంగా గొప్పగా
అడిగితిని.
“ఇది అదేరా, మనిషి పరిమాణ క్రమంలో భాగమురా” అనె అన్న.
“ఇట్లయ్యేకి మనిషికి ఎన్నాళ్లు పట్టెనా?”
“లెక్కలేనన్ని నాళ్లురా, వేల లచ్చల సంవత్సరాలురా”
“అవునా నా?”
“ఊరా”
“మడి కొందరు అంటారు, అంతా అట్లే అయిపోయ అని”
“అనేవాళ్లకేమిరా యినేవాళ్లుంటే ఎనైనా అంటారు నువ్వు పోయి పని సూడిపో”
అని పోయ అన్న.
అట్లే అయిపోయ = యాదృచ్ఛికం