అవసరం లేదు

2
1

[dropcap]క[/dropcap]విత్వానికి కొలతలు, కవికి అర్హతలు అవసరం లేదు.
హృదయ స్పందనలో అందిన అతీతమైన భావాలను తెలిసి
అందమైన భాషలో వాటిని నిలిపి
ఆరాధనతో కొలిచి,అధ్బుతంగా దాన్ని మలిచి
మనకు అందించి,మన మనసును కందించేవాడే కవి!
అదే అతడిపని, అతని హృదయమే ఒక భావాలఖని.
కోరినంత మాత్రాన కలిగేవికావు స్పందనలు,
పిలిచినంతమాత్రాన పలికేవికావు భావనలు.
అందరికీ అందేవికావవి,అందరూ ఆవిష్కరించలేరివి.
కవిత్వమొక వరం,విచిత్రమైన భావనల జ్వరం,
దాన్ని నిర్వచించటం ఎవరితరం?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here