Site icon Sanchika

ఆతీ క్యా పాండోరా? అవతార్ 2 రివ్యూ

[dropcap]J[/dropcap]ames Cameron!

We, the critics have habitually been doing the same mistake again and again for about 40 years. Writing him off. Or his films. His first film was treated as one another b-grade sci-fi when I first started my career as a film critic. The second film? We detested this youngster who dared to touch an almighty sci-fi horror classic Alien. We ridiculed his underwater filmmaking fetishism when Abyss was released. He was trolled for the ridiculous budget of the second terminator film. Well, True Lies was spared. Everyone know What Happened with Titanic. Kenneth Turan and all. Avatar gave so hard a kick on our butts, his 7th kick on the same spot, we still feel the pain. At this age, I’m no longer capable of taking another butt kick from this Man from Kapuskasing. I’ll simply say Avatar: The Way of Water will surely be phenomenal. And that will be my review.

నవంబరు పదకొండున ఈ మెయిలు (pun absolutely intended) వచ్చింది. మా వెబ్సైట్ (NaThing) కు రివ్యూలిచ్చే senior correspondent అవతార్ రివ్యూ స్కిప్ చేస్తాను అని పెట్టిన జాబు. సరే వద్దన్నాం. సైట్ లో నార్త్ అమెరికన్ బాక్సాఫీసు కవర్ చేసే కుర్రాడు ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. సరిపోయిందక్కడికి.

38 సంవత్సరాలు. ఏడు సినిమాలు.

అంతకు మునుపు మరో బలవంతపు తద్దినం లాంటి పిరానా 2. Disown చేసుకున్నాడు. ఇవన్నీ కాదసలు. విచిత్రమేంటంటే, మా పెద్దాయన చెప్పినట్లు అసలు ఏ కామరాన్ సినిమా కూడా విడుదలకు ముందు అంత బజ్ క్రియేట్ చేయలేదు. అటు విమర్శకులైనా, ఇటు బాక్సాఫీసు పండితులైనా కామరాన్ సినిమాలు వస్తున్నాయంటే సినిమాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అసలు విమర్శకాగ్రేసరుడని పేరు మడసిన కెనెత్ టరాన్ అయితే టైటనిక్ విడుదలైనప్పుడు ఆ సినిమాను ఖండ ఖండాలుగా ఖండించాడు.

ఆ తరువాత కూడా సినిమా పుంజుకుని నిలకడగా ఆడుతున్నప్పుడు, అంతర్జాతీయ సంచలనంగా మారినప్పుడు తన అక్కసును ప్రేక్షకుల మీదకు మరల్చి, జనాలకు అభిరుచి లేదు కనుకనే ఇలాంటి దిగువస్థాయి సినిమాలు డబ్బులు కొల్లగొడుతున్నాయి అని లాస్ ఏంజలిస్ టైమ్స్ లో రాసుకుంటూ వచ్చాడు. ఈ కథను కొరియానంలో భాగంగా చర్చించటమూ జరిగింది.

 మొత్తానికీ 13 సంవత్సరాల నిరీక్షణ తరువాత అవతార్ రెండవ భాగం విడుదలైంది. పదమూడు సంవత్సరాల నిరీక్షణ ఎవరికి అన్నదే ప్రశ్న. కామరాన్ గత సినిమా (అనగా అవతార్) రిలీజ్ అయ్యే సమయానికి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఊసే లేదు. రాబర్ట్ డౌనీ జూనియర్ అంటే విపరీతంగా సినిమాలు (అమెరికన్) చూసే ఏ కొందరికో తప్ప తెలియదు. నా లాంటి వాళ్ళకైతే అసలు 2008లో Iron Man అనే సినిమా వచ్చిందని కూడా తెలీదు. ట్విటర్ తెలిసిన వాళ్ళు ఎంత మంది? ఫేస్బుక్ కూడా ఇంత పాప్యులర్ కాదు. ఆర్కుట్ స్నేహాలు రాజ్యమేలే రోజులు. Netflix అనే మాట ఎవరైనా అమెరికన్ తెలుగు బ్లాగర్లు రాస్తే చదివే వాళ్ళకు తప్ప మిగిలిన వారికి ఒక వింతైన విషయం.

ఈరోజున ఇంట్లో కూర్చుని ఓటీటీ ప్లాట్ఫామ్ ల మీద సినిమాలు చూసే సౌకర్యం. ఇంటర్నెట్ వినియోగదారులలో యూట్యూబ్ రోజుకు సగటున గంటన్నరకు తగ్గకుండా చూసే వారి శాతం 78. ఎంటర్టెయిన్మెంట్ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. అవతార్ కు ముందు కామరాన్ సినిమా వచ్చింది టైటనిక్. 1997లో. అప్పటికి వినోద పరిశ్రమ ఇంత వృద్ధి చెందలేదు. సినిమా టీవీలను మినహాయిస్తే. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచులను చూసి సినిమాలు బెదిరే స్థితి. సినిమా కలక్షన్లు తగ్గటానికి కారణం ఐపీఎల్ లో పెద్ద జట్ల మధ్య పోటీ జరుగటం అనేది ఒక కారణంగా చెప్పేస్తున్న రోజులివి.

ఈ సంవత్సరం ఒక్క Top Gun: Maverick తప్ప హాలీవుడ్ సినిమాలు బిలియన్ మార్క్ దాటినవి లేవు. పేండమిక్ ముందర ఈపాటికి కనీసం నాలుగైదు ‘బిలియన్ మూవీలు’ వచ్చేవి. అసలు జనాలు ఎలాంటి సినిమాలు చూస్తారు? చూస్తున్నారు? ఏ వయసు వారు ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు అన్నని re-correction చేసుకోవాల్సిన స్థితిలో బాక్సాఫీసు పండితులున్నారు.

ప్రముఖ యూట్యూబర్ అన్నట్లు అవతార్ 2 విజువల్స్, ఆ తీసిన విధానం, 3డీ, 24/48 ఫ్రేమ్స్ పర్ సెకండ్ డైనమిక్ విధానం, ఇవన్నిటికీ కూడా మనిషి కళ్ళు అలవాటు పడేంత వరకు కామరాన్ వేచి చూశాడు. ఈ లోగా జనాలకు ఈవెంట్ సినిమాలు చాలా చూడటం అలవాటై పోయింది. క్రమంగా అవతార్ అంటే అత్యధిక కలక్షన్లు పొందిన జేమ్స్ కామరాన్ తీసిన గ్రాఫిక్స్ సినిమా అని తప్ప మరో విధంగా గుర్తులేదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ జనాల మెదళ్ళలో తిష్ట వేసుకుని సంప్రదాయ బిగ్ బజట్ సినిమాలు తగ్గుముఖం పట్టాయి.

కానీ, రెండు సంఘటనలు చాలా ఆశ్చర్య పరచాయి.

ఇక్కడ ఒక personal experience. నాకన్నా దశాబ్దన్నర చిన్న వయసు వాడైన మా అన్న కొడుకు కామరాన్ గురించి వినటమే తప్ప చూసి assess చేసే వయసు రాలేదు అవతార్ వచ్చినప్పుడు. ఇక కామరాన్ సినిమాలన్నీ టీవీలోనో మరో విధంగానో చూసినవే. తను మూడేళ్ళ క్రితం కామరాన్ ఆధ్వర్యంలో వచ్చిన అలిటా: బ్యాటిల్ ఏంజల్ చూసి అబ్బుర పడ్డాడు. ఆ విజువల్స్, ఆ సినిమాటిక్ లాంగ్వేజ్ చూసి సినిమా అంటే ఇలా కూడా తీయవచ్చా అనుకున్నాడు.

కరోనా అనంతరం చైనాలో సినిమాలు మరలా విడుదలవటం మొదలైనప్పుడు, అవతార్ 60 మిలియన్ల పైన సంపాదించి, ఎవెంజర్స్: ఎండ్ గేమ్ ను దాటి Biggest Grossing movie of all time గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. రీమాస్టర్ 4K లో వచ్చిన వర్షన్ ఆంచనాలను మించి బాగా ఆడింది. ఈ రెండు కారణాల వల్ల సినిమాకు మంచి బజ్ వచ్చింది. కానీ విమర్శకులు విమర్శకులే.

ఇప్పటి కాలంలో చాలా సినిమాలు సూపర్ హీరో జాన్రాకు చెందినవే. ఈ సూపర్ హీరో సినిమాల్లోనే వివిధ జాన్రాలలో సినిమాలు రావటం కూడా మొదలైంది. అంటే ఆల్రెడీ బాగా పాప్యులర్ అయిన సోర్స్ మెటీరియల్ అందుబాటులో ఉన్న సినిమాలు అది కూడా కేవలం కొన్ని వర్గాలను కాకుండా అన్ని వర్గాలను టార్గెట్ చేసుకుని వచ్చినవి మాత్రమే బాగా ఆడుతున్నాయి.

ఉదాహరణకు The Suicide Squad was a great movie but failed because it’s a black comedy not appealing to a majority of the audience. అదే జోకర్ film/neo-noir క్రైమ్ డ్రామా more than a superhero/villain film. ఈ నేపథ్యంలో చూస్తే, తాను చూపాలనుకున్న ప్రపంచాన్ని చూపటం కామరాన్ కు మాత్రమే ముఖ్యం. ఈ సినిమా తీయటం కూడా కామరాన్ కే పరీక్ష. అతనివే నిజానికి ఎదురు చూపులు. అతని అభిమానులు మాత్రమే అవతార్ సినిమా గురించి ఆలోచించారు. మిగిలిన వారు వచ్చినప్పుడు చూద్దాం అనుకున్న బాపతే.

అయినా ధైర్యం చేసి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఏకంగా నాలుగు సీక్వెల్స్ ప్లాన్ చేశాడు.

సినిమా పూర్తైంది. టీజర్లు వచ్చాయి. విజువల్స్ నచ్చాయి.

రన్ టైమ్ 3 గంటలా 10 నిమాషాల పైన అని తెలిసి ఎవరు అంతసేపు కూర్చుని చూస్తారు అన్నారు.

ఈ తరంలో సినిమా హాళ్ళకు వెళ్ళి సినిమాలు చూసే వయసున్న నా పిల్లలు 8 గంటలు కూర్చొని గుక్క తిప్పుకోకుండా టీవీ సీరీస్ లు binge watch చేస్తున్నప్పుడు, నా అవతార్ ను మూడు గంటలు కూర్చుని చూడలేరా అని ఎదురు ప్రశ్నించాడు.

అవతార్ 2 వచ్చింది. తెలుగులో శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశాడు. మహ గొప్పగా ఉన్నాయి. చాలా సహజంగా. మేకర్లు తీసుకున్న శ్రద్ధ మెచ్చేలా ఉంది. ప్రత్యేకించి విలన్ క్వాట్రిచ్ డబ్బింగైతే నిజంగా అతనే తెలుగు మాట్లాడుతున్నాడా ఆన్నంత సహజంగా అమరింది. ఎక్కడా రాజీ పడని తత్వం కామరాన్ ది. సంపూర్ణమైన విందు భోజనం వడ్డించాడు. కడుపు నిండా తిని రావటమే మనం చేయాల్సింది. టికెట్ ప్రైస్ వందల్లో ఉన్నా కూడా అది ఎక్కువలా అనిపించలేదు చాలామందికి. చిన్నగా ఎక్కుతోంది. Word of mouth చాలా గట్టిగా వచ్చింది.

కొన్ని విశేషాలు:

  1. సినిమాను మరో రెండు దశాబ్దాలు ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఆఖరుకు సముద్ర జంతువుల ఫీలింగ్స్ కూడా సహజంగా అమరే విజువల్ ఎఫెక్ట్స్.
  2. పాండోరా జీవులు అన్నిటి డిటెయిలింగ్ అనన్య సామాన్యం.
  3. ఎడిటింగ్ లో మునుపెన్నడూ చూడని ప్రయోగాలు చేశాడు. అవన్నీ చాలా subtle గా ఉండి కథనం వేగంగా అనిపించేలా సహకరించింది.
  4. కామరాన్ విజన్ ను ఒడిసిపట్టిన రసెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ నభూతో…!
  5. తన తరం వారు, తన ముందు తరంలో వచ్చిన మాస్టర్లు, 90లలో రాజ్యమేలిన దర్శకులు తమ ప్రాభవం కోల్పోతున్నా, కామరాన్ ఇప్పటి తరానికి రాబోయే తరానికీ అందనంత ఉన్నతమైన విలువలతో సినిమా తీశాడు.
  6. ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చూసేశారీరోజు ఆడియన్స్. అలాంటి వారి చేత కూడా నోరు వెళ్ళబెట్టేలా చేశాడు తన పనితనంతో.
  7. Four Screenplays అనే పుస్తకంలో screenwriting guru Syd Field, Terminator 2 కెనాల్ చేజ్ కమ్ యాక్షన్ సీన్ ను విశ్లేషిస్తూ అబ్బుర పడతాడు. This is how action scenes are written అన్నాడు. అదే మాట ఇప్పటికీ వర్తిస్తుంది.
  8. అవతార్ 2 చివరి 45 నిముషాలు చూసి తీరాల్సిందే. అంత గొప్పగా వచ్చాయి action scenes.
  9. కథ బాగలేదు. రొటీన్ అన్నారు. కానీ దానికి సమాధానం ఉంది. ముందు నాలుగు సీక్వెళ్ళు తీయటానికి అవసరమైన టెక్నాలజీ రూపొందించాడు. ఇప్పుడు కేవలం కథ మీదే ధ్యాస పెట్టబోతున్నాడు.
  10. కనుక మూడో సినిమా నుంచీ విజువల్స్ తో పాటూ మునుపెన్నడూ చూడని రీతిలో కథా కథనాలను అందిస్తాడు అన్నది ఖాయం. అవతార్ 2, 3 సినిమాల scripts కు కరక్షన్లు చెప్పిన స్టూడియో executives 4వ సినిమా script లో వేలు కూడా పెట్టం అనేశారు. అంత గొప్పగా వచ్చిందది.
  11. ఐదవ సినిమా భూమి మీద జరుగుతుందని కామరాన్ అన్నాడు. అవతార్ 1: పృథ్వీ , అవతార్ 2: అప్ప్, అవతార్ 3: తేజస్ (ఐవా గురించి మరింత exploration by Jake Sully and his elder daughter Kiri), అవతార్ 4: వాయుః. ఇక మిగిలింది ఆకాశం. ఆకాశ జీవులు, Sky పీపుల్ అని మానవులను (earthlings) అనటం దానికే సింబల్.
  12. 22వ శతాబ్దం నాటికి అవతార్ భూమిని నాశనం చేసి మనుగడ కోసం సుదూరంగా ఉన్న పాండోరా మీద పడతారు మానవులు. వారికి బుద్ధి చెప్పేవారు ఏలియన్లు. నావీలు. ఒమటికాయా, మెట్కాయినా అని రెండు తెగలను చూశాం. ఇక ముందు ఎవరిని చూపుతాడో!
  13. వీరే దేవతలు కావచ్చేమో. ప్రకృతిని మానవులకన్నా బాగా అర్థం చేసుకున్న వారేగా పాండోరా వాసులు. ఆ దేవతలతో సంపర్కం చెందిన జేక్ సలీ చివరకు భూమిని బాగు చేయటానికి వస్తాడేమో. అందుకేనేమో చివరి భాగం భూమి మీదే అని కామరాన్ గట్టిగా చెప్తున్నది. ఇంత బృహత్తరమైన కథను తీసుకున్నప్పుడు వీలైనంత సరళంగా చెప్పాలి. అందుకే మొదటి రెండు అవతార్ సినిమాలు కథ విషయంలో సంక్లిష్టత లేదని విమర్శించబడ్డాయి.
  14. తన ప్రాణ స్నేహితురాలైన సిగోర్నీ వీవర్ కోసం కామరాన్ సృష్టించడా పాత్ర (కిరీ). స్త్రీ మూర్తులకే గొప్ప ట్రిబ్యూట్.
  15. అమ్మ గొప్పతనాన్ని, నాన్న బాధ్యతలను ఒక విదేశీ సినిమాలో ఇంత గొప్పగా చూడటం ఆశ్చర్యం కలిగించింది.

అవతార్ 2 కచ్చితంగా పెద్ద తెర మీద చూడాల్సిన సినిమా. కామరాన్ తప్ప మరెవరూ తీయలేని సినిమా. కథ గురించి ఆలోచించకండి. తెలుసుకోవద్దు. ఖచ్చితంగా ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంది.

ఆతీ క్యా పాండోరా!

YES!

3 Billion times. Hopefully!

Exit mobile version