[dropcap]స్వ[/dropcap]ర్గీయ డా. బి.ఎస్.ఎన్.మూర్తి స్మారక కథల సంపుటి ‘బాకీ తీరింది’. ఇందులో మొత్తం 25 కథలున్నాయి.
“ఆయన కథలు ఎప్పుడూ సమాజాన్ని స్పృశిస్తూ ఉంటాయి. అయితే ఆ కథలన్నీ ఆయన స్వీయ కథలే. తన స్వంత అనుభవాల నుండి, ఆయన చూసినవి కలిపి కథలుగా మలచబడినవి” అంటూ, “మొత్తం కథలలో సుమారు 90 శాతం కథలు ఇంట్లో మా నిత్యానుభవాల నుండి పుట్టుకొచ్చినవే. ఆ కథలు అక్షర రూపంలో ఉన్న మా అనుభవ కష్టాలలో నుంఛి పాఠకులకు కావలసినంత ఆహ్లాదాన్నిపంచి ఇవి మన ఇంటి కథలు అనిపించాయి” అని రాశారు వారి తనయుడు రవికుమార్ బులుసు.
“డా. బి.ఎస్.ఎన్.మూర్తి ఒక రచయితగా, మెడికల్ కాలేఈలో చదువుతున్న రోజులలోనే తెలుసు. కాలేజీ మ్యాగజైనులో కథలు రాసేవాడు. మ్యాగజైన్ ఎడిటర్‌గా కూడా పని చేశాడు. తన రచనల్లో సున్నితమైన హాస్యం, ప్రస్తుత దేశ పరిస్థితులపై విమర్శతో పాటు మంచి సందేశాన్ని అందించాడు” అని డా. వాదాడ గణేశ్వరరావు గారు ‘నా మంచి నేస్తం’ అన్న పరిచయ వాక్యం అందించారు.
‘మా ఆత్మీయ కథా మూర్తి’ అన్న ముందుమాటలో జరజాపు ఈశ్వరరావు “వీరి అక్షరం అజరామరం” అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కిలపర్తి దాలినాయుడు, జె.బి. తిరుమలాచార్యులు ‘పాఠకునితో స్నేహం చేసే కథలు’ అన్న ముందుమాటలో “ప్రతీ వాక్యం ఒక కదిలే చిత్రంలా ఆవిష్కృతమవుతుంది. చుట్టూ ఉన్న సమాజం నుండి పుట్టినవి కాబట్టి అందులో పాత్రలు మనకు ఇట్టే గుర్తుండిపోతాయి. వాక్యాలు చిన్నవిగా ఉండి చదవడానికి ఎంతో హాయిగా ఉంటాయి. కథాశిల్పం ఎంతో చక్కగా ఉంటుంది. కథల్లో ఎక్కువ భాగం హాస్యం, వ్యంగ్యం జోడించిన కథలు మనకు తారసపడతాయి” అన్న అభిప్రాయాన్ని ప్రకటించారు.
25 కథలున్న ఈ పుస్తకం కథాభిమానులకు ఆనందం కలిగిస్తుంది.
***
బాకీ తీరింది
(కథల సంపుటి)
డా. బి.ఎస్.ఎన్.మూర్తి
పుటలు: 180, వెల: ₹ 140/-
ప్రతులకు:
శ్రీనివాస హాస్పిటల్,
కొంకి స్ట్రీట్, సాలూరు,
విజయనగరం జిల్లా 535591
ఫోన్: 7013980097, 9985575391