[dropcap]నా[/dropcap] మనసు అద్దంలో
సౌందర్యవంతమైన
నీ రూపం అప్పుడప్పుడూ కురూపిగా కనిపిస్తుందనుకుంటా..
అందుకే
చిన్న చిన్న కుదుపులు
తరచి తెరచి
తుడిచి నప్పుడల్లా
మనసుకు పట్టిన పొగమంచు తొలగి
స్పష్టమైన సౌందర్యం సాక్షత్కరిస్తూనే ఉంది
నీ మనసు అద్దంలో
ఒక్కసారైనా
కూరూపిగా కనిపించని నేను
నీ ప్రేమకు బానిసను