Site icon Sanchika

బానిస

[శ్రీ ఏరువ శ్రీనాథ రెడ్డి రచించిన ‘బానిస’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]ను బానిసను
భానూదయాన ఆ భానుడికి బానిసను.
నిశి రాతిరేల వెన్నెల రేడుకి బానిసను.

నేను బానిసను
నీలి నింగి వదిలిన ఇంద్రధనస్సు విల్లుకి బానిసను.
నీటి చెమ్మను కడుపులో దాచుకున్న నేల తల్లికి బానిసను.

విరిసిన పువ్వుకి బానిసను.
వెలిసిన నవ్వుకి బానిసను.

బరువు బాధ్యతలను భుజాన వేసే బతుకు బండికి బానిసను.
గాయాల గుర్తులను పదిలంగా తనలో దాచుకునే కాలానికి బానిసను.

కన్నీటి ఉప్పుకి బానిసను.
మున్నీటి ముప్పుకి బానిసను.

బంధించే బంధాలు
సంధించే బాణాలుకు బానిసను.

బండెడు కట్టెలకు బలయ్యే బానిసను.

ఈ బానిస సంకెళ్లుకు నేను
కట్టు బానిసను.
పుట్టు బానిసను.

Exit mobile version