Site icon Sanchika

బడిపంతులు

[dropcap]చ[/dropcap]దువు మూడవ కన్ను! చదువుకొనుటయే దన్ను!!
చదువు సదసద్వివేక సంపదలను కలిగించు
చదువు నేర్చిన వాడే సంఘమున రాణించు
అట్టి చదువును చెప్పు ఆచార్య దేవుండు!
పూర్వకాలమునందు గురుకులమునందున
గురువుగారింటిలో గురుతుగా చదివేరు
గురువుచెప్పిన పనులు గుట్టుగా చేసేరు
కాలమార్పిడి తోడు గురుకులము కరువయ్యే
ధనవంతులింటిలో చదువు చెప్పించారు
కాలమనుకూలింప వీధిబడులొచ్చాయి
అరకొర పిల్లలతో వీధి అరుగులు పైన
దుమ్ములో ధూళిలో పాఠాలు చెప్పావు
ధోవతిని కట్టావు, గొడుగునే పట్టావు
చిరుగు చొక్కా నీకు సింగారమయ్యింది
తెలిసి ఇస్తే నీకు బత్తెమే గడిచేది.
నీవద్ద చదివిన నీతిమంతులు కూడ
పెద్దవారయ్యాక నిను మరిచిపోయ్యేరు
బ్రతకలేకనే బడిపంతులు అను మాట
సంఘమ్ములోపల సార్దకమ్మయ్యింది.

గురువయిన నీవు లఘుజీవితము గడిపావు
సంఘానికే నిచ్చెనగా నీవు నిలిచావు
నీనుండి వచ్చు విద్యావంతులెందరో
దేశమందు ఉన్నతపదవులందుండిన
పూట గడవని నీవు పొంగిపోయావపుడు
అన్ని తెలిసిన నీవు ఆకలితో బ్రతికావు
రోజుకోపూటన్నముకి నోచుకోలేదు
నీపూర్వ సుక్రుతంబది ఎట్టిదో గానీ
అధికారపీఠానికన్న వచ్చిన రోజు
నీ పరిస్థితినంత నిమిషాల తెలుసుకొని
మరు నిమిషమందు మాష్టరు స్కేలు పెట్టాడు
బడిపంతులునే స్కూలు టీచరుగా మార్చాడు
అన్న రామారావు ఆదుకొనె కద నీకు
అన్న వచ్చిన నుండి అన్నము దొరికినది
సంఘమ్ములో పూర్తి గౌరవము దక్కినది.
జీతము పెరిగినది జీవితము మారినది
పూర్వసామెత బూదిలో కలిసిపోయింది.
బడిపంతులన్నదొక ఉద్యోగమా? కాదు!
సంఘాన్ని మార్చు నొక పరమ ధర్మమ్మది!!
గుర్తెరిగి నడుచుకో టీచరు!
నీ జీవితము ధన్యము పొందెదవు హుషారు!!

Exit mobile version