Site icon Sanchika

బాలసుబ్రహ్మణ్యం

పుడుతూనే సింహ గర్జన చేస్తూ
సింహపురిలోన నీవు పుట్టావు
చిన్ని స్కందుడని పేరు పెట్టారు నీకు
ఆరు ముఖములు ఉండు కార్తికేయునకు
ఆరు కంఠములు నీకు గానగజకేసరి
గొంతు గొంతులోన నీకు వేయి వేణువులు

ఆ గొంతులో కోటి రాగాలు పలికించగ
ఆలకించి అందరి మనసులు పులకించి
నీకు దాసోహమయ్యేరు గాన బ్రహ్మ
దేశ భాలన్నిటిలోను పాటలు పాడి
అఖండ భారతమొకటేనని చాటావు

నీ గళమున జాలువారిన గాన రసం
వీనులకు విందు కదా అందరికీ
గీతంలో సరిగమలు సరిగ పలికి
గమకములు బహు గడుసుగ విరిచి
గాన విరించివి అయ్యావు ఓ బాలు

భువిలోన జనులను తన్మయులను చేసి
తల్లిదండ్రులను చూడ తరలిపోయావా
కైలాసములో విలాసముగా గానము సేయ
శివుడు తన్మయాన నాట్యమాడేను
నువు లేక మేమంతా తెల్లబోయాము

నీ భౌతిక కాయము లేకపోయినా
నీ గొంతుక ఛాయలు మము వదలిపోవు
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యా
గాన వరేణ్యా…మా అందరికీ ఆరాధ్యుడవు నీవు

Exit mobile version