Site icon Sanchika

బాళు

[dropcap]“అ[/dropcap]నా…నా”
“ఏంరా?”
“అదేమంటే”
“అదేమో బొగుళురా”
“అది… నేను పుట్టేకి ముంద్ర ఏడవుంట్నీనా?”
“మీ అమ్మ కడుపులారా”
“దానికి ముంద్రనా”
“అదెట్ల చెప్పేకి అయితుంది”
“అయ్యెల్దా?”
“ఊహూ”
“పోనీ నేను సచ్చినంక ఏడకి పోతానా?”
“మన్నులాకి”
“అది నాకీ తెలుసునా?”
“ఇంగేమి తెలియలరా”
“అదేమంటే పుట్టేకి ముంద్ర నేను లేకుండానే పుడితని కదా?
సచ్చినంక నేను లేకుండానే పోతానా అని”
“అయితే… ఈడే శిలయేసుకొని వుంటానంటావ్?”
“ఊనా?”
“ముందు లే ఎనకాలే ఈ ముదంతా నాదే అన్నెట్ల బలే
నాయాలువిరా నువ్వు”
“బలేనాయాలుని కాదునా, బాళే నాయాలుని”
“అదీ నిజమేలేరా…. అట్లుంటేనే బాళేకి అయ్యేది”

***

బాళు = బతుకు

Exit mobile version