Site icon Sanchika

బండం

[dropcap]”బై[/dropcap]బిలు అంటే ఏమినా?”

“అది కిరస్తానము వాళ్ల మత పొత్తం రా”

“మడి ఖురాను”

“అది సాయబులది”

“గీత”

“ఇందువులది”

“వీళ్లంతా మనుషులేనా?”

“పెండారునా కొడకా, నిన్ని ఏమి చేసేది”

“తిట్టింది సాల్దా, ఇంగా ఏమైనా చేయాలనా? ఒగ రకం మనుషులకి
అన్ని రకాల పొత్తాలేమిటికి, మతాలేమిటికి చెప్పునా?”

“కాలానికి తగినట్లు కోలాట దాన్నింకానేరా”

“సరేనా…. కిరస్తానము వాళ్లు చూసేకి ఎట్లుంటారో రవంత చెప్పునా”

“వాళ్లు బండం గీసుకొని బొట్టు పెట్టుకోకుండా వుంటారా”

“మడి, సాయబులునా”

“వాళ్లు బండం పెరిగిచ్చుకొని, బొట్టు పెట్టుకోకుండా వుంటారా”

“మడి మనోళ్లు అదే ఇందువులు”

“బండం బోడిచ్చుకొని, బొట్టు పెట్టుకొని వుంటారా”

“అబ్బా… ఏమినా అంద్రు బండపైనే పడిండారు… బండం బ్రహ్మాండం అనుకోవచ్చనా”

“దానికేం బాగ్యం బంగారుగా అనుకోవచ్చురా”

***

బండం = వెంట్రుకలు

Exit mobile version