బందిపోటు మాన్‌సింహ్‌ తో…

0
3

[box type=’note’ fontsize=’16’] బందిపోటు మాన్‌సింహ్‌తో… సుప్రసిద్ధ కవి నీరజ్ గారి అనుభవాలపై హిందీలో డా. ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]త[/dropcap]లుపులు మూసి ఉన్నాయి. కంఠం బయట దాకా వినిపిస్తోంది. రాజు బేటా హై, రాజు మున్నాహై, పాజీ హై, హుడ్ రంగీహై, ఆతంకీపై, డాకు, ఉల్లా, బజరంగీ హై… ఒక సారి కాదు పదే పదే అవే మాటలు అంటున్నారు. ఒక రకంగా గీతం లోయలో… నీరజ్ గారి కంఠం. తలుపులు తెరుచుకున్నాయి. నీరజ్ గారు సింగ్… సింగ్… (నీరజ్  చివరి దశ వరకు సింగ్ సింగ్ సేవ చేసారు) పిల్లవాడితో ఆడుతున్నారు. అక్కడ ఉన్న వస్తువులను లాగాలని, పడేయాలని చూస్తున్నాడు ఆ పిల్లవాడు. పిల్లవాడిని లోపలికి తీసుకు వెళ్ళమని ఆయన సింగ్ సింగ్‌కి చెప్పారు. ఆనందంగా చెప్పడం మొదలు పెట్టారు – “చాలా అల్లరి పిల్లవాడైయ్యాడు. మొండివాడు. ఉగ్రవాదిలా వస్తాడు. అంతా దోచుకుని వెళ్ళిపోతాడు.” సింగ్ – సింగ్ పిల్లవాడిని తీసుకువెళ్ళాడు. ఆయన ఏదో ఆలోచిస్తూ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. – “బందిపోటు దొంగల్లో కూడా అంతో ఇంతో నీతి ఉంటుందని నా అభిప్రాయం. ఈ బందిపోటు నాకో బందిపోటును గుర్తు చేసాడు. బహుశ 55, 56లో జరిగింది. చాలా పాత సంఘటన. అప్పుడు నేను కొత్తగా కాలేజీలో పని చేస్తున్నాను. భిండ్‌లో ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసారు. రాత్రి ఒంటి గంటకు నన్ను వెళ్ళనీయాలని నేను షరతు పెట్టాను. ఎందుకంటే ఇటావా నుండి పొద్దున్న అపర్ ఇండియా రైల్లో బయలుదేరి సరియైన టైమ్‌కి కాలేజీకి వెళ్ళగలను. నిర్వాహకులు ఒప్పుకున్నారు. రాత్రి ముడొందలు నా చేతిలో పెట్టి – “జీపులో మిమ్మల్ని ఇటావాలో దింపేస్తాము” అన్నారు. భిండ్ మురైనా క్షేత్రంలో బందిపోటు మాన్‌సింహ్, లాఖన్‌సింహ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండేది. మాన్‌సింహ్‌ని అక్కడ ఊళ్ళల్లో వాళ్ళందరు గౌరవించేవాళ్ళు. డాకు లాఖన్‌సింహ్‌ని అందురు అసహించుకునే వాళ్ళు. నేను జీపులో కూర్చున్నాను. డ్రైవరు కొంచెం నిద్ర మత్తులో ఉన్నాడు. నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు. డ్రైవరుకి వాళ్ళు ఎక్కడ దింపాలో చెప్పారు. డ్రైవరు జీపుని స్టార్టు చేసాడు అది జనవరి నెల, విపరీతమైన చలి. ధానా భూడ్‍కి ఒకటి – రెండు కిలోమీటర్ల దూరంలో జీపు ఆగిపోయింది. “ఏమైంది” అని అడిగాను – “సాబ్ తప్పైపోయింది. బండిలో డీజల్ అయిపోయింది” అని అతన్నాడు. వినగానే నాకు ముచ్చెమటలు పోసాయి. చిమ్మ చీకటి రాత్రి. ఎముకలు కొరికే చలి. అడవంతా నిశ్శబ్దం. ఇప్పుడు ఇక్కడ డీజిల్ కోసం ఎట్లా ఎదురు చూస్తాం? నేను, డ్రైవరు, జీపులో కూర్చున్నాము. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు.

ఇంతలో తలపాగా చుట్టుకుని, చేతిలో రైఫిళ్ళు ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పెద్ద కంఠంతో కఠోరంగా ఒకడన్నాడు. – “జీపులో ఎవరున్నారు? బయటకురండి.” మేం భయపడుతూ బయటకి వచ్చాం. మా నోట మాట రాలేదు. “భైయ్యా! నేను ఇక్కడ మేలాలో కవితలు చదవడానికి వచ్చాను.” నేను భయపడుతూ అన్నాను. “ఎందుకు నిల్చున్నారు?” అని ఆ వ్యక్తి అడిగాడు. “డీజల్ అయిపోయింది” అని నేను అన్నాను. “అయితే మీరు కవితాజీవా? పదండి కక్కు దగ్గరికి. తీసుకు వెళ్తాం.” “మీరు డికెల్ పోలీసులు కాదు కదా?” అడిగాం. మేం మధ్యలో వాళ్ళిద్దరిలో ఒకరు మా ముందు మరొకరు మా వెనక గట్ల మీద నడుచుకుంటూ చాలా సేపటికి మేం ఊరికి చేరుకున్నాం. అక్కడ వరండాలో ఒక దీపం వెలుగుతోంది. అడుగుల సవ్వడి విని లోపలికి ఎవరో అడిగారు – ఎవరు?  ఆ ఇద్దరు బందిపోటు వాళ్ళ సాంకేతిక భాషలో సమాధానం చెప్పారు. “రండి, తలుపు తెరిచే ఉంది.” ఆ వ్యక్తి మమ్మల్ని లోపలికి తీసుకు వెళ్ళాడు. లోపల ఒకడు కింద రజాయి కప్పుకుని, చాప పైన మరో ముసలి వాడు మంచం పైన కూర్చుని ఉన్నారు. నుదిటి మీద తిలకం. పక్కన రైఫిల్. అతడు డాకూ మాన్‌సింహ్. ఆ ముసలాయన ముఖంలోని తేజస్సు చూసి నేను ప్రభావితుడయ్యాను. పొడుగాటి ముఖం, చిన్న చిన్న వెంట్రకలు, చూస్తే బందిపోటు దొంగలా లేడు. ఒక సంత్‌లా అనిపించాడు. నేను దండం పెట్టాను. “మీరు ఎవరు?” అని ఆయన అడిగారు. “కవితలు చదవడానికి వచ్చాను” అని నేను చెప్పాను. “మీరు పండితులా?” అని అడిగాడు. “అట్లాగే అనుకోండి” అని నేనన్నాను. “ఏదైనా భజన పాడండి”. నేను సుర్-మీరాలు రెండు భజనలు వినిపించాను. భజన వింటున్నప్పుడు ఆయన కళ్ళ నుండి జలజలా నీళ్ళు రాలాయి. భజన విన్నాక నా చేతిలో వంద రూపాయిలు పెట్టారు. “నాచేతిలో ఇప్పుడు ఇన్నే ఉన్నాయి. మీకు బహుమతిగా ఇవ్వడానికి. నీకు తెలియదా డీజల్ లేకుండా నడవదని. ఇక్కడ లాఖన్‍సింహ్ కూడా తిరుగుతూ ఉంటాడు. వాడు బీద గొప్ప అని ఏదీ చూడడు. ఎవడినీ క్షమించడు” అని అన్నాడు. “క్షమించండి నా తప్పయింది” అని అంటూ డ్రైవరు అతడి కాళ్ళకు దండం పెట్టాడు. “వీళ్ళని తీసుకు వెళ్ళండి. థానాలో డీజల్ తీసుకోండి. అక్కడి దాకా దింపండి” అని మాన్ సింగ్ తన వాళ్ళతో అన్నడు. నేను కాళ్ళకి దండం పెట్టాను. ఇద్దరు వ్యక్తులు డీజల్ తీసుకు వచ్చారు. బండిలో పోసారు. మేం బయలుదేరాము. ఈనాటికి కక్కూ మాన్‌సింహ్ అంటే నా మనస్సులో గౌరవం ఉంది. ఆయన బీదవాళ్ళను దోచుకోలేదు. ధనవంతుల దగ్గర డబ్బులు వసూలు చేసి బీద ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాడు. వాళ్ళందరు ఆయనని గౌరవిస్తారు. ఆ ఊళ్ళో ఆయన స్టాచ్యూ పెట్టారని విన్నాను.

ఆ రోజుల్లో, ఆ స్థితిలో ఉన్నట్లుగా ఆయన ముఖంలో భావోద్యేగాలు వ్యక్తం అవుతున్నాయి. కాస్సేపు కాళ్ళు జాపుకుని పడుకున్నారు. రెండు మూడు సార్లు అటు ఇటు దొర్లారు. మళ్ళీ లేచి కూర్చున్నారు. బీడీ వెలిగించారు. రెండు మూడు సార్లు బీడీ తాగారు. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. “ఇట్లాంటిదే మరో సంఘటన కూడా జరిగింది. కాని నా పట్ల కాదు. నేను విన్న సంఘటన ఇది. నా దగ్గరి మిత్రులైన కవులు చెప్పారు. బట్టేశ్వర్ మేలాలో కవి సమ్మేళనాలు జరుగుతూ ఉండేవి. ఎక్కువ మంది కవులు ఆగ్రా వాళ్ళే. నిర్వాహకులు కవులందిరిని ఒక బస్‌లో అక్కడికి తీసుకు వెళ్ళారు. రాత్రయింది. చలి విపరీతంగా ఉంది. రాత్రి ఏడెనిమిది గంటలకు బస్సు బయలుదేరింది. అడవి ప్రాంతం. ఒక చోట బందిపోటు దొంగలు బస్సును ఆపారు. ఒక దుప్పటిని పరిచారు. జేబుల్లో ఉన్న డబ్బంతా తీసి ఇచ్చేయమన్నారు. ఐదొందలకి తక్కువ తీసుకోమన్నారు. నిర్వాహకుడి బాగ్‌లో బాగానే డబ్బుంది. కాని ఆ అడవిలో నడిచి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు తొర్రలో సంచిని పెట్టేసాడు. అందరు డబ్బులు తీసి దుప్పటి పైన వేసారు. ఒకరు పది రూపాయలు, మరొకరు ఇరవై, ఒకరు ఎనిమిది అణాలు, మరొకరు ఒక రూపాయి వేసారు. మొత్తానికి అందరు అంతో ఇంతో వేసారు. రెండు మూడు వందల దాకా ఉన్నాయి. బందిపోటు దొంగలు అరవడం మొదలు పెట్టారు. ‘ఈ రాత్రంతా… వ్యర్థం అయింది. పదిహేను ఇరవై మంది ఉన్నా మూడొందలేనా! బిచ్చగాళ్ళల్లారా! పొండి…’ అన్నారు. అసలు ఆ రోజుల్లో కవులకు ఏభై రూపాయలు మాత్రమే లభించేవి. కాని ఆ బందిపోట్లు 500 రూపాయలు దొరకలేదని అందరికి  డబ్బులు తిరిగి ఇచ్చేసారు.  దోపిడీదార్ల దగ్గర, బందిపోట్ల దగ్గర చూసారా ఎంత నిజాయితీ ఉందో. అసలు అటువంటి కారెక్టర్ ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉందా!” అన్నారు.

మళ్ళీ మాట్లాడుతూ, “బిలాస్‌పూర్, ప్రస్తుతం అది ఛత్తీస్‌ఘడ్‌లో ఉంది. నా పేరు అక్కడ చాలా ప్రసిద్ధి. రెండు-మూడు నెలల కొకసారి నేను కావ్యపఠనం కోసం అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పటి లాగా ఆ రోజుల్లో రిజర్వేషన్లు లేవు. థర్డ్ క్లాస్‌లో నేను ప్రయాణించేవాడిని. ఆగ్రాకి వెళ్ళాక కట్‌నీ దగ్గర బిలాస్‌పూర్ కోసం రైలెక్కాలి. బహుశ రెండు-మూడు గంటలకు ఆ ట్రైన్ ఉండేది. థర్డ్ క్లాస్‌లో ప్రయాణీకుడిని కనక వెయిటింగ్ రూమ్‌లో కూర్చోలేను. బహుశ మే నెల అయి ఉండవచ్చు. నేను ఉత్తరీయం పరచుకుని ప్లాట్‌ఫారమ్ మీదే పడుకున్నాను. నాతో పాటు ఒక చిన్న పెట్టె ఉంది. నేను తల వైపు పెట్టుకుని పడుకున్నాను. అక్కడ జేబు దొంగలు ఎక్కువగా ఉండేవారు. ఏవుంటే అవి పుట్టుకోపోయే చిల్లర దొంగలు కూడా ఉన్నారు. నేను పెట్టెకు ఉండే హేండిల్‌కి, నా నడుముకి ఒక తాడుతో కట్టేసుకున్నాను. చల్లటి గాలి వీస్తోంది. కొంచెం మగతగా ఉంది. ఎవడో నా పెట్టెను లాగుతున్నాడు. నన్నెవరో లాగుతున్నట్లుగా అనిపించింది. నేను వాడి చేయిని పట్టుకున్నాను. వాడు కాళ్ళు పట్టుకున్నాడు. ‘నన్ను క్షమించండి’ అన్నాడు. కాని నేను గురువును. నేను పట్టకునే ఉన్నాను. మళ్ళీ అతడు బతిమిలాడుతూ అన్నాడు – ‘నన్ను క్షమించండి. నేను మీకు చాయ్ తీసుకుని వస్తాను. మీరు ఇటు వైపు వచ్చినప్పుడల్లా కలుస్తాను. మీరు ఇక ముందు నుండి ఆగ్రా నుండి కావలసినంత డబ్బు తెచ్చుకోండి.’ అని.‌ ఆ తరువాత నేను అటువైపు వెళ్ళినప్పుడల్లా వాడు వచ్చి కలిసేవాడు. చాయ్ తెచ్చేవాడు. అక్కడ ట్రైన్‌ని ఎక్కాలి నాకు తప్పదు. చూసారా అతడు ఒక చిల్లర దొంగ. ఈ సందర్భంలో మేరఠ్‌కి చెందిన కవి ఓంకార్ గుల్‌షన్ ఒక షేర్ గుర్తుకు వస్తోంది. ‘ఖజానా యాదోంకా జాతే హుయ్ ఛోడ్ గయే – లుటేరే హోకే భీ వహ్ కిస్ కదర్ భలు నిక్‌లా?’ (వెళ్తూ-వెళ్తూ జ్ఞాపకాల సంపత్తిని వదిలి వేసి వెళ్ళిపోయాడు. దోపిడీ చేసే వాడైనా ఎంత మంచి వాడు వాడు). ఇంగ్లీషు వాళ్ళు రెండొందల సంవత్సరాలలో ఇంతగా దోచుకోలేదు. ఈనాడు రాజకీయ నాయకులు దోచుకున్నంతగా… రాజకీయ నాయకులంటే దోపిడీనేనా! 60 సంవత్సరాలలో అంతా దోపిడీయే. నేను ఒక దోహాలో ఇట్లు రాసాను – ‘నేతావోంసే బడా చోర్ లుటేరా కౌన్? పూఛా సంసద్ భవన్ సే, సబ్ సంసద్ మౌన్’ (నేతల కంటే పెద్ద దోపిడదారులు ఎవరు? అని నేను పార్లమెంట్ భవనాన్ని అడిగాను- అందరు సభ్యులు మౌనంగా ఉండిపోయారు.)

ఆధ్యాత్మిక రామాయణం అంటే నాకెంతో ఇష్టం. కాని మహాభారతంలో కథలు, మిథక్ ఎంతో అద్భతమైనవి. ఈ కథలలో ఉన్న ఆధ్యాత్మికమైన ప్రతీకలు నాకైనా తెలుసు,  సంజయ్ కైనా తెలుసు. మహాభారతం అంటే కేవలం యుద్ధం అనే కాదు. ఇటువంటి అద్భుతమైన గ్రంథం ఇంత వరకు మళ్ళీ ఎవరు రాయలేదు. ద్రౌపది కథ తెలుసు కదా! ఆమెకు ఐదుగురు భర్తలు. ఈ పంచపాండవులు ఎవరు? మత్స్యయంత్రాన్ని ఛేదించాక పెళ్ళైయింది. అంటే అర్థం ఏమిటి? వారి ఒక దోహ ఉంది. ‘పాంచ్ పాండవ్ కౌన్ హై, పంచ్ తత్వ్ సాకార్, హువా మత్స్య భేదన్ మిలా ద్రుపద్ సత్తా కా ప్యార్’ (పంచ పాండవులు పంచ తత్వాలకు ప్రతీకలు. మత్స్యయంత్రాన్ని ఛేదించు. ద్రుపదుడి కూతురి ప్రేమ లభించింది.) ఐదుగురు పాండవులు, పంచతత్వాలకు ప్రతీకలు – అగ్నికి అర్జునుడు, వాయువుకు భీముడు, ఆకాశానికి యుధిష్ఠరుడు, నకులుడు జలానికి, సహదేవుడు భూమికి ప్రతీకలు.

ఈ పంచతత్వాలను కలిపి కలిసికట్టుగా ఉంచేదే ద్రౌపది. ద్రౌపదిని యజ్ఞసేని అని కూడా అంటారు, అంటే యజ్ఞం వెలుగు అని అర్థం. మానసిక యజ్ఞం జరిపాక మనకు లభిస్తుంది ఈ వెలుగు. వేదాలలో వర్ణింపబడిన యజ్ఞాలు మానసిక యజ్ఞాలు. అవి సామాన్యమైన యజ్ఞాలు కావు. ద్రౌపది పరమచైతన్యం. ఆమెలోనే పంచతత్వాలు ఉన్నాయి. కాని ఆ పరమచైతన్యం దాకా చేరేదెట్లా? అదే మత్స్య యంత్రం. చేపకి చంచలత్వం ఎక్కువ. మన ప్రవృత్తులు కూడా ఇట్లాగే చంచలంగా ఉంటాయి. దీనిని ఛేదించలేకపోయినప్పుడు, ఆత్మ చైతన్యంతో పరిచయం లేనంత వరకు మనస్సు పరి పరి విధాల పోతుంది. నిలకడగా నిలవదు. వాటి ప్రతిబింబం జలంలో కనపిస్తుంది. జలం అంటే జీవితం. స్నేహమంటే ప్రేమ. జలం, తైలం, నిండిన పెద్ద బాండీ అది. దీన్ని ఛేదించే వరకు ద్రౌపది దొరకదు. ఇదే విధంగా భాగవతంలోని కథలలో కూడా ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. దేవకీ-వసుదేవులకు కంసుడు వీడ్కోలు చెబుతున్నప్పుడు ఆకాశవాణి వీళ్ళ ఎనిమిదో పుత్రుడు మిమ్మల్ని వధిస్తాడు అని చెబుతుంది. ఇది తెలిసినప్పుడు కంసుడు వాళ్ళని ఎందుకు వదిలి వేసాడు అన్న ప్రశ్న తలఎత్తుతుంది. ఇందంతా  అష్టాంగయోగం. వాసుదేవుడు అంటే ఏమిటి? వసుదేవుడంటే ఆత్మ అని అర్థం. దేవకి వాసుదేవుడి శరీరం. అతను సంతానం అంటే  సమాధి రూపం. ఎప్పటి వరకైతే ఏడుగురిని చంపాడో అతడికి సమాధి రూపం ఎట్లా కలుతుంది? ఇది ప్రశ్న! యమ నియమ, ధ్యాన్, ధారత్ మొదలైన కంస్ ఎవరు? దీనిలోనే ప్రశ్న ఉంది. అతడు నేను పరమ బ్రహ్మను అని అంటే అతడు అహంకారి. కృష్ణుడు ఎవరు? కర్షయాత్ కృష్ణా, రమణాత్ రామా, యశోదా, యశస్సును ఇచ్చేది. నంద్ ఆనందానికి ప్రతీక. గోకుల్- ఇంద్రియాల క్షేత్రం. అక్కడికి  వెళ్ళి కృష్ణుడు రమణిస్తాడు. బంధనం, దర్వాజా తెరవబడుదు. విరగదు. ఆ పరమ తత్వాన్ని ఎవరు స్పర్శించినా అన్ని బంధాలు తెగిపోతాయి. ఇదంతా ప్రతీకాత్మకమే. యమున-భవసాగరం-శేష నాగఛాయ, ప్రజలు దీనిని సామాన్య అర్థంలో తీసుకుంటారు. కొంత నేను అధ్యయనం చేసాను. కానీ అంత జ్ఞానిని కాదు. అల్పజ్ఞుడిని. సముద్రం నుండి ఒక్క బిందువును కూడా తీసుకోలేకపోయాను. కాని రాబోయే తరాలు భాగవతం, రామాయణం, మహాభారతం, మొదలైన వాటిని ఏకాగ్రతతో అధ్యయనం చేయాలి. వీటిలో నుండి ఆధ్యాత్మిక అర్థాలను గ్రహించాలి. దృతరాష్ట్ర అంటే అర్థం హృతరాష్ట్ర – అంటే పరాయి రాజ్యాలను చేక్కించుకునేవాడు. గీతలో మొదటి శ్లోకంలోనో చెప్పబడ్డది- ‘నీది-నాది అని భేదం చేసేవాడు గుడ్డివాడు. అసలైతే లోపల అంతా ఒకే తత్వం…..’ అని చెప్పారు.

~

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here