Site icon
Sanchika

బతుకు మాట..

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు గారి 6 చిన్ని కవితలు అందిస్తున్నాము.]

(1).
మాట్లాడకుంటే మాటలు రావని కాదు
మౌనంగా ఉంటే మాటలు లేవనీ కాదు
సంకుచితత్వంపై
సంధించిన లోతైన ఎత్తైన స్వేచ్ఛాయుధం
——-

(2).
అందరూ మిత్రులే
దగ్గర దూరం ఆలోచనకు రాని సూచీ మనం
కడుపునిండా కలువడమే సామాజిక అద్భుతం
–‐—

(3).
ఆటూ పోటూ ఉన్నదా అయితే
బతికింది తీరసముద్రం
ఈదే బతుకే సాగరయాన శబ్దనిశ్శబ్దం
—–

(4).
అడ్డంకులెన్ని కల్పించినా
ఆగదు కాల ప్రయాణం
ముందో వెనకో నడక మంచిదే మనిషికి
—–

(5).
ఆకుపచ్చ ఆకులు ఊపే
గాలి పుట్టతేనె తీపివాసన చెట్టు
ప్రకృతీ పర్యావరణ కిటికీల ఊపిరి జీవి మనిషి
—–

(6).
మౌనరాగాలాపనలే బతుకు
మాట మంత్రించిన క్రియలై స్ఫురిస్తుంది
ఈ మట్టే భూభౌతిక రసాయనికచర్యల సౌదాగర్

Exit mobile version