బెమిసి

6
55

“బూమ్మీద మొదలు రాజ్యం ఏదినా?” అంటా గంగన్నని అడిగితిని.

ముద్ద మింగతా వుండిన గంగన్న గటగట నీళ్లు తాగి “రామ, రావణ రాజ్యం, భరతుని రాజ్యం, మంగోలి రాజ్యం, అలేగ్జాండర్ సామ్రాజ్యం ఇట్ల శానా శానా రాజ్యాల పేర్లు చెప్పతాను అనుకొంటా వుండావారా?” అని అడిగె.

“ఊనా” అంట్ని.

“తూ… నా… కొడకా… నువ్వే కాదురా మనిషి అనే నాయాళ్లు అంద్రూ అంతే. చరిత్ర అంటే నాదంటాడు. రాజ్యం అంటే నేనంటాడు” అంటా నన్ని ఉమిసె.

“నీకు ఉమిసేకి బిట్టీగా సిక్కిండాను. మిసికితే ఉమస్తావు” అంటా రేగితిని.

“శానా బెమిసే వాళ్ళనే ఉమిసేకి అవుతుందిరా”

“నువ్వు నన్ని బెమిసి బెంగుళూరు పేటకి రాజు చేసేది వద్దు కాని అసలు రాజ్యం కత చెప్పు” ఇంగా రేగితిని.

“బూమ్మీద మొదలు రాజ్యం ఏక కణ జీవులదిరా, అబుడు బూమ్మంతా ఒగే రాజ్యం. కొన్ని వందల వేలేండ్లు రాజ్యం చేసి బహుకణజీవులకి బదుకు నిచ్చె. ఆ మీట కణ విభజన జరిగి బారీ ఆకార జీవాలు, డైనోజర్లు బూమిని ఏలినంక నరవానరుల నింకా నరుడు అదికారము తీసుకొని ఇబుడు బూమీని ఏలతా వుండాడురా” అనె.

అసలు రాజ్యం కత చెప్పిన అన్నకి నేను మనసులానే దండాలు చెప్పుకొంట్ని.

***

బెమిసి = ఇష్టపడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here