[dropcap]చె[/dropcap]ట్టు మీద శవాన్ని కిందకు దించి
భుజాన వేసుకొని ముందుకు
నడిచాడు ఒక సామాన్యుడు
సమాజమనే స్మశానంలో..
శవంలోని బేతాళుడు మరో కథ
చెప్పి జవాబు చెప్పమన్నాడు
సామాన్యుడి సమాధానం విని
రివ్వున ఎగిరిపోయి చెట్టెక్కాడు
సామాన్యుడి భుజం పైన ఉండే
సంసారమనే బేతాళుడి తంతు ఇదే
సమస్యల కథలు చెపుతూ ఉంటాడు
అందకుండా ఎగిరిపోతూ ఉంటాడు
జవాబు లేని కథ బేతాళుడు చెప్పడు
ముగింపు లేని కథ తన జీవితమని
ఈ సామాన్యుడు కూడా ఎరుగడు..