Site icon Sanchika

బెత్తలే

“వస్తా బెత్తలే పోతా బెత్తలే ఎవరికి ఎవరంటా, జీవా ఏవరు
మన వెంట” అంటా రాగి మానుకింద కూకొని రాగము తీస్తావుండాడు
రామన్న. ఈ అప్ప రాగానికి కాకన్న, పాపన్న తాళము ఏస్తా తల
గుంకాయిస్తా (ఊపతా) వుండారు. నేనూ ఆడికి పోయి “ఈ పాటకి
అర్ధము ఏమినా” అంటా అడిగితిని.

“మనము బూలోకానికి వచ్చినపుడు వట్టి చేతుల్లా వస్తాము
అట్లే పోయేతబుడు వట్టి చేతుల్లా పోతాము అని అర్ధము పా” అనె.

“నిజమే రామన్న, కాని మనిషిగా అమ్మ కడుపునింకా బూలోకానికి
వచ్చెతబుడు ఉసురుతో (ప్రాణముతో) వస్తాము, పోయే తబుడు
ఉసురు యిడసి పోతాము కదా” అంట్ని.

“అవును కదా?” అంటా నోరు తెలిసే రామన్న.

“నోరు మూయినా, ఈగలు దూరతాయి” అని ఆడనింకా
వస్తిని.

***

బెత్తలే = ఒట్టిదే

Exit mobile version