[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘భారంగా.. నేరంగా’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap]ది కాని జీవితం ఇది
ఏదో లేని వెలితి నాది
సాగుతోందలా
కొనసాగుతోందలా
ఎంతో కాలం గడిపినట్లు
ఎన్ని యుగాలో కదిలినట్లు
సాగుతోంది జీవితం
కడలిలోని సుడులన్నీ
నాలోనూ వున్నాయి
బండబారిన గండు శిలలా
నా హృదయం వుంది
ఏడారిలో ఎంతో దూరం పోతునట్లు
గమ్యం లేని నావలా
శూన్యంలోన చూపులా
సాగుతోందలా
కొనసాగుతోందలా
భారంగా నేరంగా