Site icon Sanchika

భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-15

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-15: త్యాగయ తర్వాత యుగం నందుండిన వాగ్గేయకారుల రచనా శైలులు విశిష్టత

[dropcap]త్యా[/dropcap]గరాజు, దీక్షితార్, శ్యామశాస్త్రి – ముగ్గురు యుగకర్తలు. వారి శిష్య పరపంపర – తర్వాత యుగమునకు చెందిన వాగ్గేయకారులు.

  1. చిన్నస్వామి దీక్షితులు
  2. బాలస్వామి దీక్షితులు
  3. సుబ్బరామ దీక్షితులు
  4. ఎట్టయాపుర సంస్థానాధీశ్వరులు
  5. స్వాతి తిరునాళ్
  6. తూము నరసింహదాసు
  7. వీణ పెద గురవాచార్యులు
  8. దుర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు
  9. కంచి వేంకటాద్రి స్వామి
  10. (a) వీణ పెరుమాళ్ళయ్య (b) వీణ రామకాళహస్తి (c) ముత్యాలపేట త్యాగయ్య
  11. పల్లవి గోపాలయ్య
  12. పల్లవి శేషయ్య
  13. సుబ్బరాయశాస్త్రి
  14. అన్నాస్వామి
  15. వీణ కుప్పయ్యర్
  16. తిరువత్తియూర్ త్యాగయ్యర్
  17. షట్కాల గోవింద మారార్
  18. మానంబు చావడి వేంకట సుబ్బయ్య
  19. మూవ నల్లూరు సభాపతయ్య
  20. వాలాజీపేట వెంకటరమణ భాగవతులు
  21. మధ్యార్జునమ్ దురైస్వామి అయ్యర్
  22. పరమేశ్వర భాగవతార్
  23. వైకుంఠ శాస్త్రులు
  24. రామస్వామి శివన్
  25. ఆనయ్య
  26. మహా వైద్యనాథయ్యర్
  27. పట్నం సుబ్రహ్మణయ్యర్
  28. రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్
  29. చెయ్యూరు చెంగల్వరాయశాస్త్రి
  30. వైదీశ్వరన్ కోవిల్ సుబ్బరామయ్యర్
  31. మైసూరు సదాశివరావు
  32. తిరుపతి నారాయణ స్వామి
  33. మైసూరు లింగరాజు అర్సు
  34. చిన్ని కృష్ణ దాసు
  35. ధర్మపురి సుబ్బరాయర్ & పట్టాభిరామయ్య
  36. కున్నకుడి కృష్ణయ్యర్
  37. కరూరు దక్షిణామూర్తి అయ్య & దేవుడయ్య
  38. తచ్చూరు శింగరాచార్య సోదరులు
  39. తాళ్ళూరి నారాయణకవి
  40. వీణ శేషన్న, పల్లవి శేషయ్య
  41. పరాంకుశ దాసు
  42. ఆదిభట్ల నారాయణదాసు
  43. (a) యల్. ముత్తయ భాగవతార్ (b) పైడాల గురుమూర్తి శాస్త్రి
  44. హరి నాగ భూషణుడు
  45. ముత్తు తాండవరు
  46. అరుణాచల కవిరాయర్
  47. పాపవినాశ ముదలియార్
  48. కవి కుంజర భారతి
  49. గోపాల కృష్ణ భారతి
  50. వేదనాయకం పిళ్లై
  51. మారిముత్తు పిళ్లై
  52. 19 – 20 శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ గాయక, వాచక భాగవత శిఖామణులు:
  53. ప్రయాగ రంగదాసు శర్మ
  54. కచ్చెర్లకోట రామరాజు
  55. బాపట్ల కాంతయ్య
  56. ధర్మవరం కృష్ణమాచార్య
  57. పిరాట్ల శంకరయ్య శాస్త్రి
  58. ఓగిరాల వీర రాఘవ శాస్త్రి
  59. పరిమి సుబ్రహ్మణ్యం, బాలాజీ దాసు, దీక్షిత్ దాసు, అమ్ముల విశ్వనాథ భాగవతార్
  60. తంజావూర్ విద్వచ్చతుష్టయం – పొన్నయ్య, వడివేలు, శివానందం, చిన్నయ
  61. దాసు శ్రీరాములు
  62. జి. ఎన్. బాలసుబ్రహ్మణ్యం – తెలుగు, సంస్కృతంలో కృతులు కలవు
  63. బాలమురళి -1930-72 మేళకర్తలు
  64. మహావైద్యనాథయ్యర్
  65. రామ స్వామి శివన్ – గుహదాస
  66. తిరుపతి నారాయణ స్వామి (వేంకటేశ ముద్ర, పరాకేల సరస్వతి, నాటకురంజి)
  67. ధర్మపురి సుబ్బరాయర్ (ధర్మపురీశ, జావళీలు)
  68. కుంరక్కుడి కృష్ణయ్యర్ (నీవే నన్ను పరిపాలించుట, కాంభోజి)
  69. కరూర్ దక్షిణామూర్తి సోదరులు, దేవుడయ్య సోదరులు, గర్భపురి – ముద్ర. జావళీలు.

~

ఆధునిక వాగ్గేయకారులు (1850-1956)

  1. వీణ శేషన్న
  2. తంజావూరు విద్వచ్చతుష్టయము (1829-1900)
  3. దాసు శ్రీరాములు వారు (1846-1908)
  4. తుమరాడ సంగమేశ్వర శాస్త్రి (1847-1931)
  5. ముత్తయ భాగవతార్ (1877-1945)
  6. మైసూరు వాసుదేవాచారి 1865
  7. ప్రయాగ రంగ శర్మగారు
  8. కొచ్చెర్లకోట రామరాజు గారు
  9. పాపట్ల కాంతయ్యగారు
  10. ధర్మవరం కృష్ణమాచార్యులు
  11. పురాణం కనకయ్య శాస్త్రి గారు
  12. పిరాట్ల శంకరయ్యశాస్త్రి గారు
  13. హరినాగ భూషణం గారు
  14. ఓగిరాల వీర రాఘవశాస్త్రిగారు
  15. తిరుమల నల్లాన్ చక్రవర్తుల వేంకట నారాయణాచార్యులు
  16. శొంఠి సీతారామయ్య గారు
  17. రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు
  18. జి. ఎన్. బాలసుబ్రహ్మణ్యం గారు
  19. శిష్ట్లా సత్యనారాయణ రాజశేఖరం గారు
  20. కె.ఎమ్. సౌందర్య వల్లిగారు
  21. మంగళంపల్లి బాల మురళీకృష్ణగారు.

~

ఆధునిక సాహిత్యకారులలో గేయకర్తలు:

మైసూరు సదాశివరావు (1826- 1906)

మైసూరు వాస్తవ్యులు. బ్రాహ్మణులు. తోడి రాగమున ‘త్యాగరాజు వెడలిన’ అను కీర్తనను వ్రాసిరి. ఈయన వర్ణములు, తిల్లానాలు రాసి యుండిరి. స్వరము, స్వరసాహిత్యములు వ్రాసెను. సదాశివ అంకితము. ఈయన నారసింహ భక్తుడు. కలల మనోహరి రాగములో ‘నరసింహుడు ఉదయించెను’ అను కీర్తన వ్రాసెను. ‘సరసిజానందము పగుల’ అను భాగమును సదాశివరావు పాడిన వెంటనే ఆ మందిరమున గోడపై వ్రేలాడుచున్న నరసింహ స్వామి ఛాయాపటము యొక్క అద్దము పగిలి క్రింద పడెను. మందిరములోని దీపము లన్నియు ఆరిపోయెను. తుదకు ప్రజల కోరికపై పాటను ఆపి నరసింహునకు హారతి యిచ్చెను. ఈయన చాలా యాత్రలు చేసెను. ఈయన కీర్తనలలో ముఖ్యమైనవి:

  1. శ్రీ పార్థ సారథే – భైరవి
  2. సాకేత నగర నాథ – హరి కాంభోజి
  3. వాచామ గోచరుండని – అఠాణ

త్రిమూర్తుల తరువాత శిష్య పరంపర లోని వారు:

వీణ పెరుమాళ్ళయ్య:

ఈయన మహర్షి, పవిత్రుడనుట న్యాయము. ఈయన చరిత్రకు ఆధారము సుబ్బరాయ దీక్షితుల – సంగీత సంప్రదాయ ప్రదర్శిని. తెలుగువారు. వీణ కాళహస్తి అయ్య వంశం వారు. తంజావూరు వాస్తవ్యులు. ఘన రాగముల తానము వాయించుట యందును, రాగాలాపన యందును అతీతులు. అసమానులు. భైరవి మొదలగు పెద్ద రాగములను రోజుకు 2 ఝాములు అనగా 6 గంటల వంతున 10 దినములు వాయించిన మహా విద్వాంసులు. ఉత్తర హిందూ దేశమున చాలా పట్టణములలో వీణ వాయించి ఛత్ర చామరములు, పల్లకీలు, రత్న ఖచితములగు వీణలు బహుమతులుగా పొంది; సావేరి, సారాష్ట్ర రాగములలో ఆట తాళ వర్ణములు రచించిరి (మహా విద్వాంసుడే కానీ మహర్షి కాదని కొందరి భావన).

వీణ రాయ కాళహస్తి శాస్త్రి:

వీరు త్యాగరాజస్వామికి పూర్వులని తిచ్చూరు సింగరాచార్యులు రచించిన ‘గాయక సిద్దాంజన’ మందలి గాయకుల చరిత్ర వలన తెలియుచున్నది. కాళహస్తి యొక్క సంగీత శిషులు (అ) వీణ పెరుమాళ్ళయ్య (ఆ) దీపాంబురం కస్తూరి రంగయ్య (ఇ) శొంఠి వేంకట సుబ్బయ్య (ఈ) శొంఠి వేంకట రమణయ్య (ఉ) వీరభద్రయ్య (ఊ) చౌకం సీనయ్య. ఆఖరి యిద్దరు చౌక కాలమున అఖండముగ పాడగల్గిన ధీరులగుటచే వారు ‘చౌకం’ అనే బిరుదుతో పిలువబడెడి వారు.

మ్యుత్యాలపేట త్యాగయ్య:

ఇతను త్రిపుర సుందరి పై పంచరత్నములు వ్రాసెను. కోవ్వూరు పంచరత్నములు వ్రాసెను. వీణ కుప్పయ్య తనకు రెండవ భార్య వలన కలిగిన 3 ఏండ్ల బాలునకు త్యాగయ్యచే అక్షరాభ్యాసము చేయించి తన గురువు పేరున త్యాగయ్య అని నామకరణము చేసెను. ఈ బాలుడే ముత్యాలపేట త్యాగయ్య. ఈ ముత్యాలపేట త్యాగయ్య – త్యాగేశ- అను ముద్రతో కొన్ని వర్ణములు, 108 కీర్తనలు వ్రాసి ‘సంకీర్తన రత్నావళి’ అను గ్రంధము అచ్చు వేయించిరి. ఈయన ఖరహరప్రియ రాగములో ‘త్యాగరాజస్వామి గురుని దలతు నెపుడు అతి ప్రేమతో’ అను కీర్తనను వ్రాసిరి. త్యాగయ్య 1917లో 72వ ఏట మదరాసులో మరణించిరి. ఆయన మహార్షుల కోవకు చెందినవారు.

పల్లవి శేషయ్య:

18, 19వ శతాబ్దానికి చెందినవారు. త్యాగయ్య శిష్యుడగు నెయక్కరపట్టి సుబ్బయ్య గారి కుమారుడు. తెలుగు ములకనాటి బ్రాహ్మణుడు. నివాసము ‘నెయక్కరపట్టి’ గ్రామము. సంస్కృతాంధ్రములలో సంగీతములోను గొప్ప పండితుడు. లక్ష్య లక్షణ విద్వాంసుడు. పల్లవి పాడుటలో అద్భుతమైన ప్రజ్ఞ కలవాడు అగుటచే ‘పల్లవి శేషయ్య’ అని ప్రసిద్ధి చెంది యుండెను.

తెలుగులో అనేక కృతులను, పద వర్ణములను, తిల్లానాలను రచించిన గొప్ప వాగ్గేయకారుడు. ఒకనాటి గానసభ యదు ధన్యాసి రాగమును 8 గం॥ వరుసగా పాడి సభికులను తన్మయులుగా వేసిన సమర్థుడు, 1000 రాగములకు లక్షణములు వ్రాసి స్వరపరిచెను. మహారాజుపై ‘భూమి వెలయు సోమకుల వరశ్యామ భూప శేషుని మనవి విని కామితార్థము లొసగి కావుము’ అను తిల్లానాను ధన్యాసి రాగములో రచించి పాడగనే మహారాజు విని మిగుల సంతసించి ఘనమైన సన్మానము చేయుటయే గాక తన ఆస్థాన విద్వాంసునిగా కూడ నియమించెను. ఈతని కృతులలో ‘ఇక నన్ను బ్రోవ’ (భైరవి – ఆది) వంటివి సుప్రసిద్ధములు.

పైడాల గురుమూర్తి శాస్త్రి:

తెలుగు ములకనాటి బ్రాహ్మణులు. వీరు బాల్యమునే చతుశ్శాస్త్రముల యందును,  సంగీతము యందును సాటిలేని పాండిత్యము గడించిరి. గురుమూర్తి శాస్త్రి రామస్వామి దీక్షితుల కంటె కొలదిగ చిన్నవాడు. త్రిమూర్తుల కంటె గురుమూర్తి పెద్దవాడు. గురుమూర్తి తమ్ముడు సుబ్బరాయ శాస్త్రియు, కుమారుడు సుందర శాస్త్రియు విఖ్యాత సంగీత విద్వాంసులు. ‘గురుమూర్తి’ అను ముద్రతో చాల వర్ణములు, కీర్తనలు, లక్షణ గీతములు, సంచారి గీతములు వ్రాసి యున్నారు. ‘స్ఫురతు తే చరణ నళిన దేవగాంధారి’ కీర్తనయు, లక్షణ సంచారి గీతములతో పాలయ, బిలహరి నాగేశ్వర శ్రీ రామచంద్ర (ధన్యాసి) అనునవి ముఖ్యమైనవి. పురందర తరువాత ఎక్కువ గీతములు వ్రాసినది ఈయనే. వేయి గీతముల గురుమూర్తి అని; 4,000 రాగాల గురుమూర్తి శాస్త్రి అని బిరుదులు గలవు. రామామాత్యుడు తమ గీతములను భాండీర భాషలో వ్రాసి యున్నారు. అనగా వ్యాకరణ రీత్యా దోషభూయిష్టమైన సంస్కృత భాషలో వ్రాసియున్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version