భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-18

0
3

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 1వ భాగం

[dropcap]ఈ[/dropcap] అధ్యాయంలో కొన్ని రాగాల లక్షణాలు, ఆ రాగాలకు కీర్తనల ఉదాహరణలను చూద్దాము.

1. భైరవి:

ఇది 20వ మేళకర్త యగు ‘నఠ భైరవి’ యొక్క జన్య రాగం.

ఆరోహణం:  స రి గ మ ప ద ని స

అవరోషణం: స ని ద స మ  గ రి స

షడ్జమము చ॥రి॥, సా॥ గా॥, శు॥మ; పంచమము శు॥ ధై,  చ॥ధై, కై॥ని॥

భాషాంగ రాగము. సంపూర్ణ రాగము. పురాతన రాగము. సర్వ స్వర, గమక, వరీకి రాగము. రక్తి రాగములలో మిగుల శ్రేష్ఠమైనది. ప్రాచీనులు ధైవత గ్రహమనియు, సాయంకాల రాగమనియు చెప్పి యుండిరి. కాని నేడు షడ్జ గ్రహముగా అన్ని సమయము లందును పాడుచునే యున్నారు. ఇందుగల శుద్ధ, వికృత స్వరములు వివిధ గమకములను స్ఫురింపజేయునవిగా నున్నందున యిది రాగములలో మేటి అనియు, గొడ్డలి వంటి దనియు పూర్వాచార్యులు తెలిపియుండిరి. ఈ రాగములలో రచనలు నిషాదము నుండియు, రిషభము నుండియు ప్రారంభమగును. వీణాది జంత్ర వాద్యములలో ఈ రాగమును వాయించు నపుడు ప్రతి స్వరము దాని దిగువ స్వర స్థానము నుండి పలికించుట సంప్రదాయ మగును. సుప్రసిద్ధ వైణికులు ఈ రాగములోని ‘విరిబోణి’ అను తాళ వర్ణమును వాయించునప్పుడు విన్నచో యీ విషయము స్పష్టముగా తెలియును. ఇది ప్రాచీన 19 మేళములలో 7వదియును, ప్రాచీన రాగములలో నొకటియు అగును. కొన్ని శతాబ్దముల క్రిందట ఉపాంగ రాగము గాను, శుద్ధ రాగము గాను వున్నటువంటి యీ రాగము క్రమక్రమముగా ఆరోహణములో చతుశ్రుతి ధైవతము అన్యస్వరముగా ప్రయోగింపబడి శ్రీ వేంకటమఖి కాలము నాటికి భాషాంగ రాగముగా స్థిర పడినది.

నిగ రిగ సరి – నిరి సరి నిస వంటి దాటుస్వర ప్రయోగముల వల్లను, రిరి గగ మమ గగ – వంటి జంట ప్రయోగముల వల్లనూ ఈ రాగము విశేషముగా రంజింప బడుచున్నది. ఇందుగల సప్తస్వరములు జీవ స్వరములును, న్యాస స్వరములు అగును. ఇందు ‘పధనిస’ అను సంచారమున చతుశృతి ధైవతడును, ‘పధ ని ధ పా’ అను సంచారమున గల రెండు ధైవతములు శుద్ధ ధైవతములో పలుకును. ఈ రాగమున గల’ ముఖ్యమైన రచనలు ఈ దిగువన కలవు.

క్ర. సంఖ్య రచన నామము తాళము రచయిత
1. గీతము శ్రీరామచంద్ర ధృవ
2. స్వరజతి కామాక్షి చాపు శ్యామశాస్త్రి
3. తాన వర్ణము విరిబోణి ఆట పచ్చిమిరియం ఆదిఅప్పయ్య
4. కృతి కొలువై ఆది త్యాగరాజు
5. కృతి చేతులారా ఆది త్యాగరాజు
6. కృతి శ్రీ రఘువర ఆది త్యాగరాజు
7. కృతి ఉపచారము ఆది త్యాగరాజు
8. కృతి రక్షబెట్టరే ఆది త్యాగరాజు
9. కృతి ఉపచారములను రూపక త్యాగరాజు
10. కృతి తనయుని బ్రోవ ఆది త్యాగరాజు
11. కృతి చింతయ మాం రూపక దీక్షితార్
12. కృతి బాలగోపాల ఆది దీక్షితార్
13. కృతి నీ పాదములే ఆది పట్నం సుబ్రమణ్య అయ్యర్
14. కృతి ఇక నన్ను బ్రోవకున్నా ఆది పల్లవి శేషయ్యర్
15. కృతి శ్రీ పార్థసారథీ ఖండత్రిపుట మైసూరు సదాశివరావు
16. కృతి నరహరిని నమ్మక చాపు భద్రాచల రామదాసు
17. కృతి సరి యెవ్వరే ఖండ ఝంపె శ్యామశాస్త్రి
18. కృతి ఆరుక్కు పొన్నాంబల చాపు గోపాలకృష్ణ భారతి
19. కృతి 2వ్ అష్టపది (శతకము) త్రిపుట జయదేవ
20. కృతి తరంగము (జయ జయ) రూపక తీర్థ నారాయణ స్వామి
21 కృతి పదము (ముందరి) చాపు క్షేత్రయ్య

సంచారము:

దా పా మ గ రి – రీ గ మ ప ద పా పా – పా ద ప – పా పా పా ద నీ ద – నీ సా  సా – సా రి గ రీ గ రి స – సా రి సా – రి రి సా ని ద ప – ప మ పా స ని పా ప – పా మా పా ద నీ ద ప   ప మ గా రి- రీ గ రి స – సా పా ద మ పా ద నీ – సా రి సా ని సా

సరి యెవ్వరమ్మా సాహిత్యం:

పల్లవి:

సరి యెవరమ్మా అంబ (నీ)

దయజూడవమ్మా శ్రీ కామాక్షి (నీ)॥

అనుపల్లవి:

పరమపావనీ భవానీ దేవీ

పరాశక్తి నీవని నమ్మినాను॥

స్వరము(లు):

సారసదళనయనా హరిహరసురనుత లలితా నిను సతతము శరణము

కోరితిని కమల పాదయుగము నమ్మితి సుందరి శంకరి ఈ జగములో॥

చరణము(లు):

మాధవసోదరీ గౌరీ అంబమహాభైరవీ శాంభవీ

నాద రూపిణీ జననీ దేవీ నారాయణీ నళినాక్షి॥

రాజరాజేశ్వరీ చిద్రూపీ రాజీవాక్షీ లోకసాక్షీ

తేజోమయీ జననీ దేవీ ఓజోవతీ ఓంకారీ॥

పామర పావనీ పార్వతీ దేవీ పాకారివినుతే శ్రీ లలితే

శ్యామకృష్ణ పరిపాలినీ దేవీ శ్యామగిరి సుపుత్రి॥

అర్థము:

సరి యెవ్వరమ్మా = నీకు సాటి వచ్చు వారెవరు

శ్రీ కామాక్షి – శ్రీ కామాక్షి దేవి

దయ జూడ = నన్ను దయ చూడుము

పరమ పావని = అత్యంత పవిత్రమైన

భవానీ దేవి = ఓ భవానీ దేవి

పరాశక్తి నీవని = నీవే ఆదిశక్తివని

నమ్మినాను = నమ్ముకొంటిని

సారస+దళ+నయనా= పద్మపత్రముల వంటి కన్నులు గల

హరి+హర+సుర+నుత = విష్ణువు, శివుడు మొదలైన దేవతల చేత స్తుతించబడు

లలితా = లలితాదేవి

నిను = నిన్ను

సతతము = ఎల్లప్పుడు

శరణము = ఆశ్రయము

కోరితిని = కోరుకుంటిని

కమల+పాద+యుగము = నీ పద్మముల వంటి పాదముల జంటను

సుందరి! + శంకరి = సుందరాంగి యైన దుర్గాదేవి

నమ్మితిని = నమ్ముకొంటిని

మాధవ సోదరి = విష్ణుమూర్తి సోదరివైన

గౌరి = పార్వతీదేవి

మహాభైరవి = మహాశక్తి, శాంభవి, ఓ శాంభవి

శ్యామకృష్ణ పరిపాలిని = శ్యామకృష్ణుని కాపాడు దాన

దేవి = ఓ దేవి

శ్యామగిరి సుపుత్రి = హిమవంతుని సుపుత్రివైన పార్వతీదేవి

తాత్పర్యం:

శ్రీ కామాక్షి దేవీ, ఓ తల్లి, ఓ భవాని దేవి. నీవే ఆదిశక్తివి, నీకు సాటివచ్చు వారెవరూ లేరని నిన్నే నమ్ముకుంటిని. పద్మపత్రముల వంటి కన్నులు గల, విష్ణువు శివుడు మొదలైన దేవతలచే స్తుతింపబడు ఓ లలితాదేవీ, నీ ఆశ్రయమునే కోరుకుంటిని. శ్యామకృష్ణుని కాపాడుదాన, విష్ణుమూర్తి సోదరివైన, సుందరాంగి యైన దుర్గాదేవీ, పార్వతీదేవి, నిన్నే నమ్ముకుంటిని.

2. తోడి:

ఇది 72 మేళకర్త రాగములలో 8వ మేళకర్తయగు హనుమతోడి యొక్క జన్యం.

ఆరోహణం: స రి గ మ ప ద ని స – స ని ద మ ప గ రి స (ప్రాచీన సంప్రదాయం)

ఆరోహణం: స రి గ మ ప ద ని స – స ని ద ప మ గ రి స (నవీన సంప్రదాయం)

అనగా షడ్జమము.

పక్షేమము, శు॥రి॥, సా॥గా॥, శుద్ధ మధ్యమము, పంచమము, శు॥ధై॥, కై॥ని॥.

చాలా జన్య రాగ సంతతి కల జనక రాగము.

ఉపాంగ రాగము, సర్వ స్వర గమత, వరీక రాగము. రక్తి రాగము. షడ్జ గ్రహము. ఎల్లప్పుడును గానము సేయదగును. ఇది శాస్త్ర రీత్యా పంచమ స్వర వర్జమైన షాడవ రాగముగానే యున్నదనుటకు నేటికిని కొన్ని ప్రాచీన సంగీత రచనలు కనబడుచున్నను, శ్రీత్యాగరాజాది సుప్రసిద్ద వాగ్గేయకారులు తమ రచనలందు పంచమము చేర్చియుండటచే తదాది నేటి వరకు పంచమమును చేర్చి సంపూర్ణ రాగముగానే పాడడం జరుగుచున్నది. అయితే పంచమ వర్జ్యమైన – ని గ రి ని – ధ ని రి ని ద మ – గ మ ని ద మ గా రి సా, ఫంటి దాటు స్వర ప్రయోగము వల్లను, గగ మమ దద నిని … మమ దద నిని సస- వంటి జంట స్వర సమ్మేళనముల వల్లన యీ రాగము విశేషముగా రంజింప బడుచున్నదని చెప్పవచ్చును. ఈ రాగమునకు గ, మ, ద, రాగాచ్ఛాయ స్వరములు గను, ‘గరిగా’ అను ప్రయోగములో చ॥రి॥ పలుకునని కొందరు చెప్పియున్నను అది శాస్త్ర సమ్మతము కాదనియే చెప్పవచ్చును. ఇది పురాతనమైన 19వ మేళములలో పేర్కొనబడలేదు. ఉత్తర హిందుస్థానము నుండి గ్రహింపబడి కర్నాటక సంగీతమున ప్రవేశ పెట్టబడినదగుట చేత శ్రీ వేంకటమఖి దీనిని ‘ఔత్తర రాగమ’ని చెప్పియుంటిరి.

సంచారము:

పాపా దపమ మపా పమగా గామ పాద నీద – దా దా దా ని స ని ని ద – ప ద నీ ద – ద పా – పా ద ని పా ద మ పా – ద ప మ గా – గా మ ప ద ని స రి సా – సా రి ని – సా నీ గా రి – రీ రీ  రీ మ గ  గ రి – రీ సా – సా రి గ సరి – ని సా రి స ని ద ప మ గా – గ మ గ మ ద – మ ద మ ద ని – ద ని ద ని రి – ని రి గ రి ని ద మ గ రి స – సా సా రి ని సా పా ద ని సా రి ని ద ప మ గా – గా మ ద మ – మా ద ని ద దా ని రీ ని ద ప మ గా రి – రీ మ గ రి సా – దా ని సా రి ని – ద ప మ –  పా దా గా సా రీ నీ సా

క్ర. సంఖ్య రచన నామము తాళము రచయిత
1. వర్ణము ఏరా నాపై ఆది పట్నం సుబ్రమణ్య అయ్యర్
2. వర్ణము కనకాంగీ ఆట పల్లవి గోపాలయ్య
3. కృతి కొలువ మరెగద ఆది త్యాగరాజు
4. కృతి కద్దనువారికి ఆది త్యాగరాజు
5. కృతి కమలాంబిక రూపక దీక్షితార్
6. కృతి జేసినదెల్ల ఆది త్యాగరాజు
7. కృతి ఎందుదాగినాడో చాపు త్యాగరాజు
8. కృతి తప్పి బ్రతికి పోవ రూపక త్యాగరాజు
9. కృతి ఎందుకు దయరాదు త్రిపుట త్యాగరాజు
10. కృతి మున్ను రావణు బాధ ఝంపె త్యాగరాజు
11. కృతి నిన్నే నమ్మినాను త్రిపుట శ్యామశాస్త్రి
12. కృతి అంబ నాదు ఆది పల్లవి గోపాలయ్య
13. కృతి ఏమని పొగుడుదు ఆది గర్భపురివాస
14. కృతి గజానన రూపక
15. కృతి దాశరథి ఆది త్యాగరాజు

కనకాంగి నీ చెలిమి కోరి – కృతి సాహిత్యం:

పల్లవి:

కనకాంగి నీ చెలిమి కోరి కాచి యున్నది రా

అనుపల్లవి:

తనదుదైన శ్రీ తుళజేంద్రుని తనయుడైన

శరభోజి మహారాజేంద్రా

చరణము:

మగువ రమ్మ నెరా

తాత్పర్యము:

రాజాస్థానాలలో నర్తకీమణులు రాజులను ఆహ్వానిస్తూ పాడే వర్ణాలు. బంగారు మేని ఛాయ గల నర్తకి ధనదుడైన శరభోజి మహారాజును ఆహ్వానిస్తున్నది.

~

దాశరథీ నీ ఋణముఁదీర్ప – కృతి సాహిత్యం:

పల్లవి:

దాశరథీ నీ ఋణముఁదీర్ప నా

తరమా పరమపావననామ

అనుపల్లవి:

ఆశదీర దూరదేశములను ప్ర

కాశింపఁ జేసిన రసికశిరోమణి

చరణము(లు):

భక్తిలేని కవిజాలవరేణ్యులు

భావమెఱుఁగలేరని కలలోఁ జని

భుక్తిముక్తికల్గునని కీర్తనముల

బోధించిన త్యాగరాజుకరార్చిత

తాత్పర్యము (విశేషాంశము):

కాశీక్షేత్రమున గణేశభావ, అనునొక హిందుస్థానీ సంగీత విద్వాంసుడు అనేక దేశ భాషలలో కీర్తనలు రచించి గానం చేయుచూ భగవంతుని రంజింపగల గాన విధానము కొరకై మిగుల పరితపించుకుండగా ఒకనాటి రాత్రి స్వప్నమున శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి శ్రీ త్యాగరాజుని భక్తి, భావ విశిష్టతను తెలిపి నీవు అతనిని దర్శింపుముని చెప్పి అదృశ్యుడయ్యెనట, వెంటనే గణేశ భావ తిరువ్వయ్యూరుకు వెళ్ళి, త్యాగరాజుని దర్శించి వారి అమృత గానమును విని సంతసించి తన స్వప్న వత్తాంతము తెలుపగా శ్రీ త్యాగరాజు తనకై శ్రీరామచంద్రుడు తీసికొన్న ప్రయాసకు పరమానందభరితుడై యీ కృతిని పాడినట్లు చెప్పుదురు.

అర్థము:

పరమ + పావన = అత్యంత పావనమైన

సామ = సామము గల

దాశరథీ = దశరథుని కుమారుడైన శ్రీరామ

నీ ఋణము దీర్ప = నీ ఋణము తీర్చుకోనుట

నా తరమా = నాకు సాధ్యమా

ఆశ దీర = నా కోరిక తీరునట్లుగా

దూరదేశములను = బహు దూర దేశములందు

ప్రకాశింపజేసిన = వెలుగులోకి తెచ్చిన

రసిక శిఖామణి = రసానందము గ్రహించెడి వారిలో అగ్రగణ్యుడైన ఓ రామ

భక్తి లేని = భక్తి భావములేని

కలి+జాల+వరేణ్యులు = కవుల సముదాయంలో శ్రేష్ఠులు

భావము + లెరుగ లేరని = భావము గ్రహించలేదని

కలిలోన + చని =  కలికాలములో అనుకొని

భక్తి ముక్తి = ఇహపర సౌఖ్యములు రెండునూ

కల్గునని = కలుగునట్లుగా

ఇహ పర సౌఖతులు రెండును. తెలుగాను గా.

కీర్తనముల బోధించిన = కీర్తనములు నేర్చుకొను విధానము తెలిపిన

త్యాగరాజ + కర+అర్చిత = త్యాగరాజ స్వామి హస్తములచే పూజింపబడెడి (ఓ శ్రీరామ)

~

దాచుకోవలెనా దాశరథి – కృతి సాహిత్యం:

పల్లవి:

దాచుకోవలెనా దాశరథి నీ దయ

అనుపల్లవి:

జూచువారలలోన చులకనే ననుఁజూచి

చరణము(లు):

నేమమునఁ బరిచర్య నేర్పును బొగడువేళ

సౌమిత్రి త్యాగరాజునిమాట బల్కితే

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here