భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-6

0
3

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-6: రామదాసు ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి’ కీర్తన విశ్లేషణ

[dropcap]అ[/dropcap]టు పండితులను ఇటు పామరులను ఆనందాబుధిలో ఓలలాడించే కీర్తనలు రామదాసు చాలా రచించినప్పటికి అత్యంత ప్రశస్తి వహించినది ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి’ అనే ఆనందభైరవి రాగ కీర్తన.

మనోహరమైన సాహిత్యంతో పాటు కష్టమైన విశిష్టమైన ధాతు కల్పన తోడై ఈ కీర్తన  ప్రాశస్య్తానికి కారణమైంది. ఈ రాగంలో రచన చేసిన మొట్టమొదటి వాగ్గేయకారుడు రామదాసే. అయిదు చరణాలు కల్గిన భావ ప్రకటన రచన ఇది. కథనాన్ని బట్టి రామదాసు చరిత్రలో రాజ భటులు బందిఖానాలో తన మీద కత్తులు విసిరినప్పుడు రామానుగ్రహం వలన బాధ చెందక శ్రీరామునితో అనేక విధాలుగా మొరపెట్టుకొని ‘పెట్టుపోతలు లేకపోతే మానె నోటి మాట కూడ కరువా’ అని ఆయనను నిలదీసి ప్రశ్నిస్తున్నాడు రామదాసు. శరణాగత త్రాణ బిరుదాంకితుడు శ్రీరాముడు. ‘ఇసుక రేణువులను సేతుబంధానికి సమర్పించిన ఉడుతని, అహల్యని అనుగ్రహించావే, నా జీవిత సర్వస్వాన్నీ రామసేవకే అంకితం చేసిన నన్ను ఉపేక్షిస్తున్నావా’ అని వాపోయాడు.

ఈ కీర్తనలో దైన్యం మూర్తీభవించి ఉంది గాని ప్రధాన భక్తి దాస్యభక్తి. దైన్యం సంచారీ భావంగా దాస్యభక్తి పరిపుష్టమైంది.

దీర్ఘ స్వర బాహుళ్యంతో కూడిన సాహిత్య రచన విలంబిత భావలయకు అనుకూలంగా వుంది.

తరువాత చరణాలలో చంధం శిల్పం కనిస్తుంది. గుర్వక్షర, రెండవ ఖండంలో లఘ్వక్షర బాహుళ్యం; మొదటి ఖండంలో విలంబిత గతి; రెండవ ఖండంలో ద్రుతి గతి. దీనివల్ల మొదటి ఖండంలో ఆర్తి, దైన్యం అభివ్యక్తం కాగా, రెండవ ఖండంలో ఆత్రుత ధ్వనిస్తుంది. ఈ రాగం రక్తికి కారణం. వాటితో వచ్చే తీవ్ర కోమల స్వరాలు, అన్య స్వరాలు చేత కోమల స్వర ప్రాధాన్యత హెచ్చు. ఈ స్వరాలు మాధుర్య గుణ యుక్తాలై భక్తి, శృంగారాలకు అనుగుణంగా వున్నాయి. విప్రలంభ శృంగార వర్ణనకు ఈ రాగం పెట్టింది పేరు.

ఈ కీర్తన భగవద్రూప రతిస్థాయి భావంగా కల్గి భగవంతునితో విరహాన్ని భరించలేని భక్తుని విరహ వ్యథను తగ్గిస్తున్నది కనుక ఈ రాగం ఈ కీర్తనకు సరిపోయింది.

తరుణ భావ పోషణకు ఈ రాగ స్వరాలు ఉపకరిస్తాయి. భావ తీవ్రతను, ఉద్వేగాన్ని వ్యక్తం చేయగలుతోంది ఈ రాగం.

ప్రాచీన కాలంలో ఈ రాగంలో అన్య స్వరాలు లేకుండా పాడేవారని ఆనాటి రచనలని బట్టి తెలుస్తుంది. ఘన రాగ గీతాలలో ఒకటైన ‘కమల సులోచన విమల తటాకిని’ అనేది ఈ రాగంలో (ఆనంద భైరవి) ఉంది. ప్రాచీన గీతంలో సాధారణ గాంధారం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదం వున్నాయిు కాని అంతర గాంధారం, శుద్ధ దైవతం, కాకలి నిషాదాలు లేవు. రామదాసు వ్రాసిన కీర్తన కూడ ఆ విధంగానే ఉండి ఉంటుందని ఉహించవచ్చు.

శ్రవణ, సంకీర్తన చింతలనే భక్తి మార్గాలుగా రామదాసు ఎంచుకుని, ఆయన కీర్తనలు రచించి తరించాడు.

అధ్యాయం-7: శక్తి యంత్రాలు

జగన్మాత స్వరూపాన్ని వర్ణిస్తున్న మిషతో ‘శ్రీవిద్య’ అనబడే శక్తి తంత్రరహస్యాలు, భోగ మోక్షములు రెండు ప్రసాదించే జగన్మాతగా యంత్ర శ్లోకాలు, ఫలము, నైవేద్యము సంక్షిప్తంగా పట్టిక రూపంలో వివరణ. వీటితో శంకర భగవద్పాద కృత ‘సౌందర్య లహరి’ శ్లోకాలు అన్వయించుకోవచ్చు.

శ్లోకం ఫలం నైవేద్యము
1 శ్రీ చక్రము శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః సకల జన వశీకరణం, రాజవశ్యత తేనె, పాలు
2 శివ చక్రము భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం సర్వాభీష్ట సిద్ధి, సకలైశ్వర్య సామ్రాజ్య ప్రాప్తి తేనె, త్రిమధురం, పెరుగు, పాలు, పానకము, చిత్రాన్నం
3 విషహర గరుడము

(క్షిప ఓం స్వాహా)

కిరంతీ-మంగేభ్యః కిరణ-నికురుంబమృతరసం విష నివృత్తి
4 సర్వ జ్ఞానము, సర్వజ్ఞత్వము

(వం వం వం)

కవీంద్రాణాం చేతః కమలవన-బాలాతప-రుచిం వేదాది సకల శాస్త్ర జ్ఞానము తేనె
5 దారిద్ర్య నివారణం

(శ్రీం శ్రీం)

షితౌ షట్పంచాశద్-ద్విసమధిక-పంచాశ-దుదకే క్షామం, దుర్భిక్షములు ఉండవు పాల పాయసము
6 సంతాన ప్రాప్తి

(శ్రీం)

చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిపి స్త్రీలకు వంధ్యాదోష నివారణ తెల్లని పరమాన్నం
7 విద్యా ప్రాప్తి

(క్లీం క్లీం క్లీం)

కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః సకల విద్యా లాభము పాల పరమాన్నం
8 ధన, భూ ప్రాప్తి

(ఓం హ్రీం, హ్రీం హ్రీం)

పదన్యాస-క్రీడా పరిచయ-మివారబ్ధు-మనసః భూ, దన లాభము పాల పరమాన్నం
9 భూత, ప్రేత, క్షుద్ర ప్రయోగ నివారణ

(క్షం క్షీం హ్రీం)

దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీం బాధా నివృత్తి పాల పరమాన్నం, తేనె
10 పాముల వలన భయ నివారణ

(హ్రీం సర్ప సర్పణం)

హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక-చతురౌ సర్పాలను వశం చేసుకునే శక్తి లభిస్తుంది
11 మూర్ఛలు, వికారములు పోవుటకు

(యం యం యం)

మృషా కృత్వా గోత్రస్ఖలన-మథ వైలక్ష్యనమితం వికారం బాధలు నివృత్తి తేను, అరటిపండు, టెంకాయ
12 భూత ప్రేత నివారణ

(రం రం రం రం రం)

నమో వాకం బ్రూమో నయన-రమణీయాయ పదయోః భూత బాధా నివృత్తి పాల పాయసము, పానకం, అరటిపండు
13 పరకాయ ప్రవేశ విద్య

(ఆం హ్రీం క్రీం సంజీవని హాం ఫట్)

శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా పరకాయ ప్రవేశ శక్తి లభించును పాల పరమాన్నం, పులిహోర, తేనె
14 శత్రు స్తంభనం

(ఓం సుం ఓం)

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే గజ తురగ సైన్య స్తంభనం బెల్లం పాయసం, తేనె
15 జల స్తంభన

(ఓం హ్రీం యం లం యం సం హం)

కరీంద్రాణాం శుండాన్-కనకకదలీ-కాండపటలీం జలముపై దాటుటకు సామర్థ్యం టెంకాయ, అరటిపండు, తేనె
16 ఇంద్రజాల సమ్మోహనం, విద్యా ప్రాప్తి

(క్లీం)

నిసర్గ-క్షీణస్య స్తనతట-భరేణ క్లమజుషో ఇంద్రజాల విద్యా నైపుణ్యం తేనె, పాల పరమాన్నం
17 కవిత్వ ప్రాప్తి

(ఐం క్లీం సౌః సౌః క్లీం క్లీం సం)

తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే/తుహినగిరి కన్యే హృదయతః సాధకుడు కవి అవటం అరటిపండు, తేనె
18 సర్వ యక్షిణి గంధర్వ వశ్యం

(శ్రీం క్లీం)

నఖానా-ముద్యోతై-ర్నవనలినరాగం విహసతాం యక్షిణీ వశీకరణం తేనె
19 కార్యసిద్ధి

(క్షం మం)

గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే సర్వ కార్య సాఫల్యం తేనె
20 సంగీత శాస్త్ర సిద్ధికి

(శ్రీం శ్రీం శ్రీం)

విపంచ్యా గాయంతీ వివిధ-మపదానం పశుపతే- స్త్రీలకి సకల రోగాల నివారణ బెల్లం పరమాన్నం, తేనె
21 నవగ్రహ దోష నివారణం (బు శంచ గురకు రా శకే) అహస్యూతే సవ్య తవ నయన-మర్కాత్మకతయా నవగ్రహ దోష నివారణం పులిహోర, అరటిపండు, తేనె
22 భవిష్యత్తు తెలుపు కాలజ్ఞానం (సం సం సం) అరాలై స్వాభావ్యా-దలికలభ-సశ్రీభి రలకైః భవిష్యత్తు గురించి వాక్శుద్ధి త్రిమధురం, తేనె
23 ఉదర వ్యాధి నివారణ

(రం రం రీం రీం)

గతై-ర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం మహోదర వ్యాధి నివృత్తి పంచదార
24 బాలారిష్ట దోషములు

(కం)

సమున్మీలత్ సంవిత్కమల-మకరందైక-రసికం బాలారిష్ట దోష నివారణం మినుప గారెలు, నారికేళం, అరటిపండ్లు
25 పిశాచ నివారణకు

(ర)

విశుద్ధౌ తే శుద్ధస్ఫతిక విశదం వ్యోమ-జనకం బ్రహ్మరాక్షసి బాధ నివారణ బెల్లం పరమాన్నం, నారికేళం, అరటిపండ్లు
26 రోగ నివారణ

(దుంత, దుంష, దుంశ)

తవాజ్ఞచక్రస్థం తపన-శశి కోటి-ద్యుతిధరం దీర్ఘ, కథిన రోగ నివారణ తేనె, మినప గారెలు
27 ధన లాభమునకు

(శ్రీం)

స్మరం యోనిం లక్ష్మీం త్రితయ-మిద-మాదౌ తవ మనో అధిక ధన లాభం పెసరపప్పు అన్నం, తేనె
28 రసాయన సిద్ధి (రస సిద్ధి)

(ఓం యం ఓం)

శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః సకల విద్యా సిద్ధి, రసాయన సిద్ధి పెరుగు అన్నం, మినప గారెలు
29 అష్టమహా సిద్ధులు

(ఓం)

స్వదేహోద్భూతాభి-ర్ఘృణిభి-రణిమాద్యాభి-రభితో అణిమాది అష్టసిద్ధులు, పరకాయ ప్రవేశ సక్తి, అగ్ని స్తంభన శక్తి లభిస్తుంది తేనె, త్రిమధురం,

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here