[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
అధ్యాయం-9: త్యాగయ్య కీర్తనలు – పరిశీలన – రెండవ భాగం
త్యాగయ్యగారి కొన్ని కీర్తనల రచనా సందర్భములు
కీర్తన | రాగం | సందర్భం |
నమో నమో రాఘవాయ | దేశిక తోడి | చిన్నప్పటి కృతి |
రాజిల్లు వీణ కల్గు గురురాయ | భైరవి | గురువర్యుని నారద మహర్షి గురించి |
శ్రీ నారద నాద సరసీరుహ భృంగ | కానడ | గురువర్యుని నారద మహర్షి గురించి |
వరనారద నారాయణ | విజయశ్రీ | గురువర్యుని నారద మహర్షి గురించి |
స్వర రాగ సుధారస | శంకరాభరణం | గురువర్యుని నారద మహర్షి గురించి |
ఏల నీ దయ రాదు | అఠాణ | రామలక్ష్మణ సహితంగా విశ్వామిత్రుడు యాగ్రం చేస్తున్నప్పటి రూపం ప్రత్యక్షమైనప్పుడు |
అలక లల్లలాడఁగ గని | మధ్యమావతి | దివ్యమంగళ విగ్రహం చూసినప్పుడు |
శ్రీరామ జయరామ శృంగారరామ యని | యదుకులకాంభోజి | దివ్యమంగళ విగ్రహం చూసినప్పుడు |
నాదుపైఁ బలికేరు నరులు | మధ్యమావతి | ఆస్తి పంపకాల విషయంలో మనోవేదనకు గురైనప్పుడు |
రామ రామ గోవింద రక్షించు ముకుంద | సౌరాష్ట్ర | ఆస్తి పంపకాల విషయంలో మనోవేదనకు గురైనప్పుడు |
కరుణ జూడవమ్మా | తాడి | ధర్మ సంవర్ధని దేవిని తలవక రాముడు, రాముడు అని కీర్తిస్తున్నాడని అపవాదు సందర్భంగా |
నిధిచాల సుఖమో రాముని స
న్నిధిసేవ సుఖమో |
కల్యాణి | తంజావూరు ప్రభువులు ఆభరణాలు ఇచ్చినప్పుడు తిరస్కరించు సందర్భంలో |
పదవి నీ సద్భక్తి కల్గుటే | సాళగభైరవి | త్యాగయ్య శిష్యులు కన్నయ్య ద్వారా త్యాగయ్య కీర్తనలు విని, వడివేలు ద్వారా మహారాజు ఆహ్వానం పంపినప్పుడు |
భవనుత నా హృదయమున రమింపుము బడలికదీఱ | మోహన | వృద్ధ దంపతుల వేశహ్ంలో శ్రీరాముడు సీతా సమేతంగా వారికి ఇంటికి విచ్చేసినప్పుడు |
ఎందరో మహానుభావులు | శ్రీ రాగం | గంగా తీరమందున్న రామదాసుడగు ఒక భక్తునికి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి త్యాగరాజ దర్శనార్థము తిరువయ్యూరు వెళ్ళమని ఆనతి ఇచ్చిన సందర్భంలో |
దాశరథీ నీ ఋణముఁదీర్ప నా | తోడి | రామభక్తులు పలుమారులు వారి ఇంటికి వచ్చిన సందర్భములో |
ఏ పాపము జేసితిరా రామ | అఠాణ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
నా మొఱలను విని యేమర వలెనా? | ఆరభి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
అన్యాయము సేయకురా, రామ | కాపి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
నాయెడ వంచన సేయకురా; ఓ రామ! | నభోమణి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
మారియాద కాదురా కరుణాకర | శంకరాభరణం | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
మరియాద గాదయ్యా మనుపవదేమయ్య | భైరవ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
రానిది రాదు సురాసురులకైన | మణిరంగు | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
ఎందు దాగినాఁడో ఈడకు రా | తోడి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
ఎంతరాని తన కెంత పోని నీ | హరికాంభోజి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
చేర రా వదేమిరా? రామయ్య! | రీతిగౌళ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
చలమేలరా సాకేతరామ | మార్గహిందోళం | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
మఱి మఱి నిన్నే మొఱలిడ నీ | కాంభోజి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
కొనియాడెడి నాయెడ దయ వెలకు | కోకిలధ్వని | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
మాఱుబల్కకున్నా వేమిరా – మా మనోరమణ | శ్రీరంజని | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
ఏమి దోవ పల్కుమా! యికను నేనేందు పోదు? | సారంగ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
అభిమానము లే దేమి | ఆంధాళి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
రామ నన్ను బ్రోవ రావేమెకో? లోకాభి | హరికాంభోజి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
కుల బిరుదును బ్రోచుకొమ్ము రమ్ము | దేవమనోహరి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
ఏమి నేరము నన్ను బ్రోవ | శంకరాభరణం | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
నన్ను బ్రోవ నీకింత తామసమా | అభోగి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
ఎందుకు నిర్దయ ఎవరున్నారురా | హరికాంభోజి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
పాహి రామచంద్ర రాఘవ హరే మాం | హరికాంభోజి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
వేరెవ్వరేగతి, వేమారులకు, సీతాపతి | సురటి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
సార్వభౌమా, సాకేతరామ | రాగపంజరం | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
ఎంతవేడుకొందు రాఘవ | సరస్వతీ మనోహరి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
తనవారి తనము లేదా? | బేగడ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
మాటాడవేమి నాతో? | నీలాంబరి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
సీతాపతీ నామనసున | ఖమాస్ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
సాక్షిలేదనుచు సాధింపకే | బంగాళ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
కాలహరణ మేలరా | శుద్ధసావేరి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
మదిలోన యోచన | కోలాహలం | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
ఆదయ శ్రీరఘువర! | ఆహిరి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
దరి దాపు లేక | సావేరి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
రమించు వారెవరురా | సుపోషిణి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
రామాభిరామ | దర్బారు | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
నాడాడిన మాట నేడు తప్పవలదు | జనరంజని | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
వద్దనే వారు | షణ్ముఖప్రియ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
లేమిఁ దెల్పఁ బెద్ద లెవరు లేరో? | నవనీత | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
బాగాయెనయ్యా నీ మాయలెంతో | చంద్రజ్యోతి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
తనమీదనే జెప్పుకొనవలె గా | భూషావళి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
శ్రీకాంత నీయెడ బలాతిబల | భవప్రియ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
నీ చిత్తము నిశ్చలము | ధన్యాసి | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
నాటి మాట మరచితివో? ఓ రామ! | దేవక్రియ | అన్నగారు పూజా విగ్రహాలు నదిలో పారవేసినప్పుడు ఆవేదన, ఆర్తి, మనస్తాపం వ్యక్తం చేస్తూ.. |
నే నెందు వెతుకుదురా హరి
(ఈ కీర్తన పాడగా విగ్రహములు కనబడినవి) |
కర్నాటక బేహాగ్ | కలలో స్వామి కనబడి కావేరీ నదిలో ఒక ఘట్టంలో దొరుకుతాయి అని చెప్పి అంతర్థానం అయ్యారు. త్యాగయ్య గారు అక్కడకి వెళ్ళి ఎలా వెతకాలో తెలియక.. |
కనుగొంటిని శ్రీరాముని నేఁడు | బిలహరి | విగ్రహాలు దొరికిన ఆనందములో |
రారా మా యింటిదాఁక | అసావేరి | విగ్రహాలు దొరికిన ఆనందములో |
రఘువీర | ఖరహరప్రియ | విగ్రహాలు దొరికిన ఆనందములో |
ముద్దుమోము యేలాగు చెలంగెనో? | సూర్యకాంతం | విగ్రహాలు దొరికిన ఆనందములో |
అలకలల్లలాడగ | మధ్యమావతి | విగ్రహాలు దొరికిన ఆనందములో |
శ్రీరామ జయరామ శృంగారరామ | యదుకులకాంభోజి | విగ్రహాలు దొరికిన ఆనందములో |
కలిగియుంటే గదా కల్గును | కీరవాణి | విగ్రహాలు దొరికిన ఆనందములో |
ఏ పనికో జన్మించితినని | అసావేరి | విగ్రహాలు దొరికిన ఆనందములో |
ఎట్లా దొరకితివో? ఓ రామ | వసంత | విగ్రహాలు కొలువు కూటమిలో చేర్చి అలంకరించి |
ఎంత భాగ్యమో మాపాలఁ గల్గితివి | సారంగ | విగ్రహాలు కొలువు కూటమిలో చేర్చి అలంకరించి |
కొలువై యున్నాఁడే కోదండపాణి | నటభైరవి | విగ్రహాలు కొలువు కూటమిలో చేర్చి అలంకరించి |
కొలువమరె గద | తోడి | విగ్రహాలు కొలువు కూటమిలో చేర్చి అలంకరించి |
దొరకునా ఇటువంటి సేవ | బిలహరి | విగ్రహాలు కొలువు కూటమిలో చేర్చి అలంకరించి |
ముగింపు:
త్యాగయ్య ఇతరులకు విమర్శలకు తావివ్వక రాముని యందు మాత్రమే గాక, ఇతర దేవతా స్తుతుల మీద చేసిన రచనలు అనేకం. రాగాలు, ప్రత్యేకత, విశిష్టత, ఆచరణయోగ్యమైనవి. భావ, రాగ, తాళ, లయల మేళవింపుగా అరుదు రాగాలలో రచనలు. అతి సులభ, సరళీకృత శైలిలో, అన్ని నవరసాల మేలి కలయికలతో మతానికి అతీతంగా అనేక రచనలు చేసిన మహా వాగ్గేయకారుడు – త్యాగయ్యగారు.
ఆయన చేసిన సంగీత సేవ – తలచినా, వినినా, పాడినా, వ్రాసినా మనిషి జన్మ సార్థకమై మోక్షమార్గానికి తావిస్తుంది అని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
అన్ని సంపాదించవచ్చు. అన్ని ఫోవచ్చు కాని పోనిది రామ నామస్మరణయే. మరువనిది, మరువలేనిది – శ్రీ రామ నామ -తారక మంత్రం.
(ఇంకా ఉంది)