Site icon Sanchika

భారతీయులకు హెచ్చరిక-4

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – రెండో అధ్యాయము

భారతీయ ధర్మంలోని మానవతా విలువ

మతభావనలకు వర్తింపజేసే శాస్త్రీయ దృక్పథం

[dropcap]మ[/dropcap]నం ఎందుకు భారతీయ ధర్మాన్ని సమర్థిస్తాం? అది భారతావని స్వీయ భావ వ్యక్తీకరణ కాబట్టి. మనం భారతదేశాన్ని ఎందుకు ప్రేమిస్తాం? అది భారతదేశం కాబట్టి.

కాని, భారతీయ ధర్మాన్ని ఒక గొప్ప  జాతికి ఆత్మగా, ఒక జాతిని నిర్మించే శక్తిగానే కాకుండా, దానిలోని మానవతా విలువను కూడా శోధించాల్సి ఉంది. భారత దేశం,   మానవతా విలువలు, వాటికి  కట్టుబడటం వల్ల భారతదేశం మేధా  ప్రపంచానికి గొప్పగా కనబడుతుంది.

ప్రస్తుతం, ‘భారతదేశం’ ‘ఆధ్యాత్మికతకు నిలయం’ అని అనడం పరిపాటిగా మారింది. ‘ఆధ్యాత్మికత’ అనే పదం మీద విపరీతమైన ఒత్తిడిని పెట్టడం కూడా. అలా చేయడం ద్వారా, వాస్తవిక దృక్పధం గల ఐరోపా, అమెరికాలకు  భారతదేశం వ్యతిరేకమని చెప్పడం అనిపిస్తుంది. ఆధ్యాత్మికం కంటే వాస్తవికం హీనమైనది, అనుకుంటే, వ్యతిరేకత భారతీయులకు గొప్ప ఓదార్పుగా ఉంటుంది. కనీసం ఈ ఒక్క విషయంలోనైనా,  దేశం  వలసపాలకులకంటే ఆధిక్యతగలదని  రుజువు చేసుకోగలిగితే, భారతీయులకు  తమదేశం,  అంత వెనుకబడిన దేమీ కాదని అనిపిస్తుంది.

అదే మనం చేస్తున్న పెద్ద తప్పు!

భారతీయులంతా యోగులని, వారి ప్రస్తుత పాలకులంతా రాక్షసులని మనం ఒప్పుకున్నా, భారతదేశ పరిస్థితులు మారవు. అది పరిస్థితిని మరింత దిగ్భ్రాంతిలోకి నెట్టేస్తుంది. ఓదార్పుకు బదులుగా కాని, నిజానికి, భారతీయులందరూ, ఇతరులకంటే ‘ఆధ్యాత్మిక వాదులు’ కారు. భారతదేశంలో నిజమైన ఆధ్యాత్మిక జ్ఞాన శిఖరాలనధిరోహించిన దిగ్దంతులు ఉన్నారు. అందులో సందేహం లేదు. కాని సగటు భారతీయులు , తమ ఆధ్యాత్మికతను గురించి గొప్పగా చెప్పుకుంటే మాత్రం అందులో నిజాయితీ లేనట్లే. ఆ విధంగా వారు తమ దేశానికి, మతానికి న్యాయం చేయనట్లే.

భారతీయ  భావజాలం, సంస్కృతి   ఇతర మతాలకంటే ఎంత మాత్రం ఆధిక్యతగలది కాదు. భారతీయ ధర్మం లోని మత పరమైన జ్ఞానాన్ని పొందిన సిద్ధులు, దార్శనికులు, మహనీయులు ఎందరో ఉండడం వల్ల కూడా ఆధిక్యత సంభవం కాదు. ఎందుకంటే, అలాంటి వారు, ఇతర మతాలకు అనుసరించే వారిలో కూడా ఉన్నారు. వారు ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ మందా? అంటే చెప్పడం కష్టం. అదంత ముఖ్యం కూడా కాదు.

భారతీయ ధర్మం ఇతర మతాలకంటే గొప్పది ఎందుకంటే, దాని ఆధ్యాత్మికత వల్ల కాదు, అంతకంటే విలువైన దాన్ని అది తనను అనుసరించేవారికి ఇచ్చింది. ‘మతం పట్ల, జీవితం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథం’ అది. దాని పర్యవసానమే భారతీయ ఆధ్యాత్మికత!

భారతదేశం పాశ్చాత్యదేశాలకు వ్యతిరేకం  అని అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. భారతీయుల ఆధిక్యత మరో చోట ఉంది. ఐరోపా భావజాలానికి వ్యతిరేక భావజాలంలో అది లేదు. ఐరోపా భావజాలం కంటే దాని భావజాలంలోని ఎక్కువ నిరంతరత్వంలో, పొసగడంలో ఉంది. జీవితం పట్ల అది చూపే విశ్వాసపాత్రతలో ఉంది. జీవితానికీ మతానికి మధ్య గల చక్కని సమైక్యతలో ఉంది. యూరోపియన్ దృక్పథంతో పోల్చి చూస్తే, భారతీయుల శాస్త్రీయ దృక్పథపు విశ్వజనీనతలో ఉంది.

యూరోపియన్లు తమ అనేక విశ్వాసాధారితాలు కాని మతాలను, ఆచారాలను వదిలేసిన నాటి నుండి, వారి జీవితంలో పొంతన లేనితనం, మానసిక అలజడి పెచ్చరిల్లాయి. దానికి రెండు ముఖ్యమైన ఆధారాలున్నాయి.

1.క్రైస్తవమతం, జాతీయతా భావానికి, ఖచ్ఛితంగా వ్యతిరేకం.

2.అన్ని విషయాల్లో అది స్వేచ్ఛాపూరిత శాస్త్రీయ దృక్పథానికి వ్యతిరేకం.

జాతీయవాదం అనే ప్రాతిపదికన, ఐరాపా, ఒక రాజీ ధోరణి ద్వారా, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. గోస్పెల్ (దైవవాణి) అధికారమును ఆధారం చేసుకొని  ఈ రాజీని ఒక కొలిక్కి తేవాలని ప్రయత్నించింది. ఆ గోస్పెల్ ఇది.

“సీజర్ యొక్క విషయాలను సీజర్ చూసుకోనివ్వండి. భగవంతుని విషయాలను భగవంతుడు చూసుకుంటాడు.”

మతవ్యవస్థ, రాజ్యం, మతం, రాజకీయాలు, విడిగా ఉండాలని దీనర్థం.

మత వ్యవస్థను, రాజ్యాన్ని వేరు చేయవచ్చు కాని మతాన్ని జీవితం నుంచి విడదీయలేం. చాలా మందికి, రాజకీయాలు జీవితంలో ఒక పార్శ్వమే . కాని జాతీయతా భావం ఉంది చూడండి. అది పూర్తిగా జీవితానికి సంబంధించిన, ఒక బలమైన అంశం. యూరోపియన్లు అనవచ్చు. మతపరంగా వారు క్రైస్తవులు అని (ముక్తి కోసం ఆతృత పడే వారు అని కూడ) అనవచ్చు. అదే సమయంలో వారిని జాతీయ వాదులు కాకుండా ఏదీ ఆపలేదు. ప్రపంచంలోని అశాశ్వత దేశాల పేరులుగా.. అలా చెప్పడం సులభం, అలా  జీవించడం కష్టం. ఎందుకంటే క్రైస్తవ రాజ్యాలు, ఈ విశ్వానికంతటికీ చెందినవి కావు.   తన దేశానికి తను చేసే సేవ, చెడుకు అవినీతికి, కుహనా భక్తికి చేసే సేవగా కనపడవచ్చు. దేవునికి చేసే సేవకు విరుద్ధంగా కనిపించవచ్చు. లిఖితంగా ఉంది. దేవుడిని, Mammon (లోభమెహాలను) ను రెండిటినీ ఎవరూ సేవించలేరు. నిజమైన క్రైస్తవుడు సరియైన దానిని ఎన్నుకోవాలి.

నిజానికి యూరోప్  Mammon నే ఎన్నుకుంది. చాలా కాలం క్రిందటే. కాని భగవంతుని పట్ల విధేయతను నామ మాత్రంగా ప్రవచించడం చేస్తూ వస్తుంది. ఒక అంకిత భావంగల క్రైస్తవునికి, అవిధేయత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ముఖ్యంగా జాతీయతావాదం బలంగా ఉన్నప్పుడు.

భారతదేశం, తన ధర్మ స్వభావం వల్ల, ఈ పొంతన లేనితనానికి దూరంగా ఎలా వుందో మనం చూపాం.

సైన్స్ పరంగా, దానితో క్రైస్తవ మతానికున్న ఘర్షణను తొలగించడం, మొదట్లో సులభంగానే కనిపిస్తుంది. మనం, ఇక్కడ, ఒక ఆలోచనా పరిధిలో ఉన్నాం. చర్య పరిధిలో కాదు. అంతే కదా! ఆలోచన  చాలా సున్నితమైంది.  గహనమైంది కూడా.

అవి చీకటి రోజులు. మన భావాలను మనం స్వేచ్ఛగా వ్యక్తం చేస్తే, మన జీవితాన్ని ప్రమాదంలో పడవేసుకున్నట్లే, అని భావించిన రోజులు. పైన చెప్పిన దాన్ని కంటే మెరుగ్గా కాని, హీనంగా కాని, ఐరోపా ఒక రాజీ ధోరణికి రాలేదు. మతం, రాజకీయాలలాగే, సైన్సు మతం, హేతుబద్ధత, విశ్వాసం కూడా విడిగానే ఉండాలి. అవి ఒకటితో ఒకటి కలహించుకోవలసిన అవసరం లేదు. అవి అలా, నిశ్శబ్దంగా, దేనిస్థానంలో అది, దేని గదిలో దానిని ఉండనివ్వండి.

అన్ని మతపరమైన విషయాల్లో, ముక్తికి సంబంధించినవన్నీ, ఒకే అధికార పరిధి కిందికి వస్తాయి. క్రైస్తవ మత వ్యవస్థ, మత గ్రంథాల పరిధిలో కాకున్నా, అవి పవిత్ర గ్రంథమైన బైబిల్ అధికార పరిధిలో ఉంటాయి. బైబిలు చదువు, చిన్న పిల్లవాడిలా దాన్నినమ్మోయ్! ఆ పవిత్ర గ్రంథాన్ని తెరిచిన వెంటనే, నీ హేతువాద శక్తిని, విచక్షణను పక్కన పెట్టు. వివరణ, విశ్లేషణ అనేది ఒక ప్రమాదకరమైన ఆట. అది ఎన్నో తప్పులకు దారి తీస్తుంది. కాబట్టి వ్యాఖ్యానించకు. చర్చించకు. స్వీకరించు, నమ్ము, అంతే! నీవు రక్షణ పొందుతావు.

ఇది మతపరమైన విషయాలలో సంగతి. కాని, ప్రాపంచిక జ్ఞానం యొక్క ప్రతి పరిధిలో, సైన్సు యొక్క ప్రతి శాఖలో, దీన్ని, అధికారికంగా గ్రహించి, గుడ్డిగా నమ్మకు. నమ్మోద్దు కాని, నీ తీర్పును, అనుమానాన్ని పక్కన పెట్టకు. సందేహం, రాగరహితమైన కుతూహలం, శాస్త్రీయ జ్ఞానానికి మూలాలు స్వీకరించకు, కాని శోధించు, ప్రయోగం చెయ్, విమర్శించు, నీవే సొంతంగా కనుక్కో. నీళ్లు దేనితో తయారయ్యాయి? ఇది తెలుసుకోవడానికి ఒక పరమాద్భుతమైన ‘దయ’ నీకు ప్రేరణ ఇవ్వదు. విశ్లేషించు, తెలుస్తుంది. శాస్త్రీయ జ్ఞానం అనేది ఇచ్చేది కాదు తీసుకునేది కాదు. తనను జయించాలని అది కోరుతుంది.

ఫలితం? ఆధునిక ఐరోపా జాతీయుడు స్వేచ్ఛగా ఆలోచించే వాడు కాలేదు. మతపరమైన విషయాల గురించి ఇబ్బంది పడే వాడూ కాదు. లేదా అతడు తన ఆలోచనలో, జీవితంలో, ప్రాపంచిక విషయాలను విశ్వాసానికి సంబంధించిన విషయాలకు మధ్య ఒక దూరాన్ని ఏర్పరుచుకోలేదు. అంటే, అతడు ఎంత తెలివైన వాడైనా, ఇతర విషయాల్లోలాగే తన విచక్షణను, అనుభవాన్ని ఉపయోగించడు. అవి కీలకమైనవి. కాని అతడు ఒక పవిత్ర పుస్తకపు అధికారంతోనే తృప్తి చెందుతాడు.

క్రైస్తవులంటారు క్రైస్తవ జీవితంలో బైబిల్ సత్యము అని ఋజువు చేసిన అనుభవాలున్నాయని. దాన్ని మనం కాదనం. కాన ఆ అనుభవాన్ని ఒక శాస్త్రీయ అనుభవం లాగా, ఇతరులకు బోధించడం, వ్యాపింపచేయడం కష్టం. బైబిల్ సత్యానికి ఋజువు లేదు. అంతే కాదు క్రైస్తవేతర జీవితాల్లోని, అంతే పటిష్టమైన మతపరమైన అనుభవాలకు కూడా ఆస్కారం ముంది. మత బోధన పట్ల ఒక క్రైస్తవుడు ప్రత్యేకంగా చూపే దృక్పథం ఒకటుంటుంది.  క్రైస్తవ దేవుని పట్ల అతనికున్న ఒక అసూయ అంటే తనకే పరిమితుడవ్వాలన్న భావన, మానవజాతికంతా విస్తరించడానికి ప్రతిపాదిస్తే, ఎక్కడైతే క్రైస్తవ విశ్వాసం, శాస్త్రీయ ఆలోచనా విధానం కలసి ఉంటాయో అప్పుడు తప్పనిసరిగా ఒక పొంతన లేనితనం ఏర్పడుతంది. క్లుప్తంగా చెబితే, శాస్త్రీయ దృక్పథాన్ని విశ్వాసమే అధిగమిస్తుంది. నిజం ఏమిటంటే, చాలా మంది గొప్ప శాస్త్రవేత్తలు, విశ్వాసపాత్రులైన క్రైస్తవులు కూడా అయివున్నారు. మనం గుర్తు చేసుకుంటే అంత మాత్రాన ఆ పొంతన లేనితనం తగ్గదు.

బలవంతంగా విడదీయడాలు జరిగితే, మానసికమైన అలజడి ఇప్పుడో అప్పుడో కలుగుక మానదు. అది ఒక ‘కుహానాస్థితి’ పట్ల చైతన్యానికి దారి తీస్తుంది. జీవితం   సంక్లిష్టమైంది. దాన్ని భాగాలుగా విభజించడం అసాధ్యం. విశ్వాసాధారిత మతాన్ని అనుసరించే వారి హేతుబద్ధతలోని బలహీనత, ఈ నిజాన్ని తిరస్కరించడంలో ఉంటుంది (అది ఏ మతమైనా కావచ్చు. మనం మచ్చుకు క్రిస్టియానిటీని తీసుకున్నాం). వారిలో నిజమైన నిరాడంబరమైన విశ్వాసలోపాన్ని, వారు ఇష్టంగానో అయిష్టంగానో మౌలికమైన విమర్శలకు తావివ్వకపోవడం, ఈ విషయాన్ని ఎత్తి చూపడాన్ని సాధ్యం చేస్తుంది.

భారతీయ ధర్మాన్ని, దాని ఆధిక్యతను, విశిష్టతను గురించి మనం మాట్లాడినప్పుడు దాన్ని ఒక శాస్త్రీయ మతంగా పేర్కొంటాం. అప్పుడు మనం ‘ప్రాపంచిక’ ‘పారమార్ధిక’ విషయాలను వేరు చేయడం వల్ల, భారతీయులలో, ఎటువంటి పొంతన లేనితనం కనబడదనే విషయాన్ని మనం నొక్కి చెబుతాం. ఇక్కడ మనకు ‘హేతుబద్ధతకు’, ‘విశ్వాసానికి’ ఇరుకైన వేరు వేరు గదులుండవు. ‘ప్రకృతి’ ,’ప్రకృతికి అతీతమైనది’ – ఈ రెండూ భిన్నంగా చూడబడవు. కాని ఒకే ఒక విస్తృత జీవితం ఉంటుంది. వివిధ దశల్లో! ఒకే ఒక ప్రకృతి ఉంటుంది, విస్తారంగా, వివిధ కోణాల్లో! ఒకటే, ఒక్కటి జ్ఞానసముపార్జనావిధానం! అనుభవం!

భారతీయులు కూడా అంటారు, కేవలం అధికారికంగా దేన్నీ నమ్మకు, ప్రయోగించి చూసి, తెలుసుకో. సాధన చాలు, నీ అంతట నీవే ఆవిష్కరించుకో. కేవలం ‘దయతో’ జ్ఞానం నీకివ్వబడదు. అది జయించచబడాలని అనుకుంటుంది. కానీ తేడా ఎక్కడంటే, ఇది పదార్థానికి సంబంధించిన శాస్త్రీయ జ్ఞానం మాత్రమే కాదు, ఇది అన్ని రకాల జ్ఞానానికీ వర్తిస్తుంది. మహోన్నతమైన, అతిసున్నితమైన, మొత్తం ఉనికికి, ప్రకృతి నేపథ్యమైన ఆధ్యాత్మిక, ఆదిభౌతిక జ్ఞానానికి కూడా! అదే పరిపూర్ణస్థితి! ఇంకోరకంగా చెబితే, ప్రతి జ్ఞానమూ శాస్త్రీయంగా ఉండాల్సిందే. లేకపోతే అది జ్ఞానమే కాదు.

ఐరోపా భావజాలానికి, ‘ఆలోచన’కు దాని వాస్తవిక దృక్పథానికి వ్యతిరేకమైనా, భారతీయ భావజాలం, ఆలోచన కూడా అదే స్వభావాన్ని కలిగి ఉండడం మనం చూడవచ్చు. నిజానికి ఆలోచన అనేది ఐరోపా వారిదని, భారతీయులదనీ ఉండదు. ‘వాస్తవికం’ అనీ ‘ఆధ్యాత్మికం’ అనీ ఉండదు. అది ఆలోచన! అంతే! అంత కంటే మరేమీ కాదు. భారతీయుల ఆధిక్యత, వారి ఆలోచనల వైవిధ్యంలో ఉండదు. అలోచనను జీవితంలోని అన్ని పార్శ్వాలకు, ఒకే విధంగా, విశ్వజనీనంగా వర్తింపజేయడంలో ఉంటుంది. ఆధ్యాత్మిక వికాసానికి కూడా యూరోపియన్ ఆలోచన వారి అంధ మత విశ్వాసం ప్రారంభమైన చోట అంతమవుతంది. వారు ఒక పద్ధతి ప్రకారం ఆచరించే అంతుబట్టనితనం దగ్గర కూడ.

ఒక భారతీయుడు  కూడా, భగవంతుడిని అంతుబట్టని శక్తిగానే భావిస్తాడు. కాని అది ఒక నిర్ణీత విధానంలో ఉండదు.

అతనికి తన బాహ్యేంద్రియాలకు, మేధస్సుకు గోచరించనిది ఏమిటో తెలియదు. అతనికి ‘పరిపూర్ణత్వం’ అనుభవంలోకి రాదు. కాని ‘భగవంతుడున్నాడు’ అనేదాన్ని అతడు కాదనడు. ఒక ‘సాధకుడు’ ‘తన’ అనుభవాన్ని నిర్ధారించినపుడు “అది ఊహ, తప్ప మరేమి కాదు” అని అనడు. అతడు నిజమైన శాస్త్రీయ మేధను కలిగి ఉంటాడు. దేని గురించి గుడ్డిగా విశ్వసించడు. అన్నింటి పట్ల ప్రఫుల్లంగా ఉంటాడు.

కొందరు నమ్ముతున్నట్లుగా, భారతీయ ధర్మం యొక్క శాస్త్రీయ స్వభావాన్ని భారతీయులు తమ బలంగానే భావిస్తారు. బలహీనతగా కాదు. ఒక కాలంలో ఒక పవిత్ర గ్రంథం, ఒక విశ్వాసం బలంగా ఉండవచ్చు. కాని, కాల క్రమాన, ఒక మతానికి అన్నిటికంటే బలాన్నిచ్చే అంశాలు ఇవి. ఒక ప్రత్యేకమైన ప్రవక్తగాని స్థాపకుడు గాని లేకుండా ఉండడం, ఒక ప్రత్యేక పవిత్ర మతగ్రంథం లేకపోవడం, ప్రత్యేకమైన శాశ్వత విశ్వాసమంటూ ఉండకపోవడం, జ్ఞానాన్ని పొందే క్రమంలో, ఒక నిరంతర ఆలోచనా స్రవంతిని, ఒక నిరంతర, పునరుద్ధరణకు వీలైన అనుభవం ప్రాతిపదికగా కలిగి ఉండడం. అదే భారతీయ ధర్మానికి ఆలంబన.

స్వేచ్ఛగా ఆలోచించడం అనేది విశ్వాసాధారిత మతాలను దెబ్బ తీయగలదు, తీస్తుంది, మరింతగా విభిన్న రాజకీయ, సామాజిక విశ్వాసాలు, వాటి అంతర్జాతీయ ప్రభావం వల్ల, ఏ మతానికన్నా కూడా గొప్పవి. అవి ప్రస్తుతం, విశ్వాసులను తమ పాత ప్రవక్తలకు, మత గ్రంథాలకు దూరం చేస్తున్నాయి. వారిని, కొత్త వారికి విధేయత చూపమని పిలుపునిస్తున్నాయి. కాని అలా ఏ శక్తీ భారతీయ ధర్మాన్ని విఫలం కావించలేదు. ఎందుకంటే, వేదాంతపరంగా చెప్పాలంటే, భారతీయ ధర్మం అనేది, ఒక నిరంతర క్రమపరిణామంలో విలసిల్లిన అనంతమైన, విభిన్నమైన మానవ ఆలోచనే. మానవ జాతి అంతరించేంత వరకు, దాని ప్రవక్తల, దార్శనికుల జాబితాకు, దాని గ్రంథాల జాబితాకు అంతం ఉండదు. కాని నూతన అనుభవాలకు గల అవకాశాలు, సత్యానికి సంబంధించిన కొత్త భావవ్యక్తీకరణలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.

ఏ తెలివైన వాడేనా, బయటకు సులభంగా తెలుకోగల ‘నీరు’ లాంటి దాని గురించి, చెప్పినదంతా, ఒకసారే చెప్పబడిందని నమ్మాడు. అయినా, భగవంతుని గురించి చెప్పాల్సినదంతా చెప్పబడిందని, కొత్తగా దానికి అదనంగా చేర్చడానికేమీ లేదని చాలా మంది నమ్ముతారు. ఐరోపాలో, అమెరికాలో ఈ పొంతన లేని, పొసగని విషయాన్ని అంగీకరించే శాస్త్రవేత్తలున్నారు. వాళ్లు శాస్త్రజ్ఞులే కావొచ్చు. వారి శాస్త్రీయ దృక్పథం ఒక సంకుచితమైన విజ్ఞాన పరిధికి లోనయి ఉంటుంది. ఒక నిజమైన భారతీయుడు, చదువురాని వాడయినా సరే, జీవితంలోని ప్రతి విషయంలో, ఒక శాస్త్రీయ దృక్పథంతో ఉంటాడు. అతడెక్కడ ఉన్నా, ఒక ప్రసన్నమైన సాపేక్షతను తనదిగా చేసుకుంటాడు. పురాతన గ్రీసు దేశంలోని జ్ఞానుల ఆభరణం అది. అతనికి స్వీయచైతన్యాన్ని, స్వీయ నిర్ధారణను ఇవ్వగలిగితే, వారి లాగా ప్రకాశిస్తాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version