Site icon Sanchika

భారతీయులకు హెచ్చరిక-9

[box type=’note’ fontsize=’16’] భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినం గా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష అనువాద రచన ఇది. 1939లో ప్రచురితమైన సావిత్రి దేవి రచించిన ‘ఎ వార్నింగ్ టు ది హిందూస్’ అన్న పుస్తకాన్ని అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ. సావిత్రి దేవి గ్రీకు మహిళ. ఆమె భారత్ వచ్చి, భారతీయుడిని వివాహం చేసుకుని ఇక్కడే హిందువుగా స్థిరపడింది. దేశంలో జరుగుతున్న పరిణామాలను అవగాహన చేసుకుని భవిష్యద్దర్శనం చేసినట్టు 1939లో ఆమె రచించిన గ్రంథం ఇది. ఈ పుస్తకానికి వీర్ సావర్కర్ ముందుమాట రాశారు. ఈ పుస్తకంలో ఆమె ఏదయితే జరిగే ప్రమాదం వుందని హెచ్చరించిందో అదే నిజమవటం ఈ పుస్తకం ప్రాధాన్యాన్నీ విలువను పెంచుతుంది. ప్రస్తుతం దేశంలో మళ్ళీ అనుమానాలు, ఆవేశాలు, ద్వేషాలు అధికమై సామరస్య వాతావరణాన్ని రాజకీయ లబ్ధి కోసం కలుషితంచేసి వికృత విషపుటాలోచనలను విస్తృతంగా వెదజల్లుతున్న తరుణంలో గతంలోని పొరపాట్లను స్మరించటం ద్వారా చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్తపడే వీలుంటుందని, చరిత్రలో మరుగున పడ్డ అనేక సత్యాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ అనువాదాన్ని అందిస్తున్నాము. [/box]

భారత జాతీయతావాదం, చైతన్యం

మొదటి ప్రకరణము – ఆరవ అధ్యాయము-1

హిందువుల స్వభావంలో మార్పు

జాతీయతా భావం పరిఢవిల్లడం

[dropcap]మ[/dropcap]నం ఇప్పుడు, వెంటనే సామాజిక సంస్కరణలు ఎంత అవసరమో కారణాలను పేర్కొన్నాం. అవన్నీ హిందూ ధర్మ పరిధిని దాటి బయటకి వెళ్లిన వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పినవే. ఇక్కడ ప్రధానమైన విషయం, వారిని ఎలా అర్థం చేసుకోవాలి, వారిని హైందవత్వ పరిధిలో ఎలా ఉంచుకోవాలి, వెళ్లిన వారిని ఎలా వెనక్కు తీసుకురావాలి అనేది మాత్రమే.

కాని దానికంటే ముఖ్యమైనది, హిందూ సమస్యకు మరో కోణం ఉంది. ఇది హిందువులుగా ఉండిపోయిన హిందువులకు సంబంధించింది. వారి పూర్తి దృక్పథం వారు మార్చుకునేంత వరకు సామాజిక సంస్కరణలు సాధ్యం కాదు. అదే కాదు హైందవత్వాన్ని సమర్థించి, పటిష్టపరచే ఏ ప్రయత్నం, కనీసం గుళ్లు, మఠాలు, గోశాలలు నిర్మించేదైనా అసాధ్యమే. ఎందుకంటే ఆ ప్రయత్నం పూర్తిగా, ‘వారి’ మీదే ఆధారపడి ఉంది.

గుళ్లు, మఠాలు, గోశాలల ప్రయోజనాన్ని మనం కాదనము. కాని, హిందువులనందరినీ ఒక బలమైన శక్తిగా, చెక్కు చెదరని దానిగా చేయడానికి అవి చాలవని మనకే తెలుస్తుంది. అంతే కాదు, అవన్నీ నిర్మించడం వెనుక ఒక పవిత్రమైన కారణం ఉంది. అది అందరు హిందువులను మళ్లీ వెనక్కు తీసురావడం. హైందవత్వాన్ని ఒక ప్రపంచ శక్తిగా తయారు చేయడం. ఈ కార్యాన్ని వాటి నిర్మాణం కంటే బాగా ఏదీ నిర్వర్తించగలదు? ఒక గోశాలలోని ఆవుల కంటే ఎక్కువ ఆవులు, రాబోయే తరాల్లో, ఒక మహమ్మదీయ కుటుంబాన్ని హిందూమతంలోకి తీసుకురావడం ద్వారా, రక్షించబడగలవు. హిందువులు పరిపాలించడానికి తగినంత శక్తివంతులయ్యేంత వరకు, హిందుదేశమంతటా గోవధ నిషేధం సాధ్యం కాదు.

రాజకీయ అధికారం (అంటే చట్టపరమైనది, దాని వెనుక వ్యవస్థాగతమైన సైనిక శక్తి ఉండటం) అనేదే ప్రపంచంలో పరమోన్నతం. మతాలు, తమ సిద్ధాంతాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక స్ఫూర్తి పునాదులుగా ఇతర మతాలతో పోటీపడతాయి అనడం, చరిత్రలోని సాక్ష్యాలకు విరుద్ధంగా మాట్లాడటమే. ఒక మతానికి అనుయాయులు ఎప్పుడు పెరుగుతారు? దాని చేతిలో రాజకీయాధికారం ఉన్నప్పుడు మాత్రమే. ఆ విషయంలో, సిద్ధాంతాలకు, నైతికతకు, ఆధ్యాత్మికతకు తావు లేదు. క్రైస్తవం ఒక చెక్కుచెదరని శక్తిగా ఎదగడం ఎప్పుడు మొదలయింది? అది చెక్కచెదరని ప్రజల మతంగా, ఆ కాలానికి, మారినప్పుడు! రోమన్ లోని సామాన్య ప్రజానీకం, రోమన్ రాజ్యం, ఇంకా రోమనులైన ఆటవికులు, వీరంతా అధికార శక్తిగా మారినపుడు. ఎందుకది సంపూర్ణంగా, ఉత్తర ఆఫ్రికా నుంచి పారద్రోలబడింది? ఖుర్ ఆన్ సైద్ధాంతికంగా, నైతికంగా ఆధ్యాత్మికంగా బైబిల్ కంటే గొప్ప దైనందుకు కాదు, అరబ్బులు, క్రిస్టియన్లు నెదిరించి వీరోచితంగా పోరాడి ఆధిక్యత సాధించడం వల్ల. ఒకప్పుడు స్పెయిన్‌లో ముప్పాతిక వంతు మహమ్మదీయులే. మరి ఇప్పుడు ఎందుకు కాదు? పవిత్ర గ్రంథం బైబిల్ ఖుర్ ఆన్ కంటే గొప్పదవడం వల్ల కానే కాదు. ముస్లిం పాలకుల కంటే, ఆధునిక స్పెయిన్ నిర్మాతలైన క్యాథలిక్ రాజుల సైనిక శక్తి గొప్పది కావటం వల్ల. చివరి రాజకీయాధికారం క్యాథలికులు చేతుల్లో కేంద్రీకృతం అవడం వల్ల. నీ వద్ద రాజకీయాధికారం ఉంటే, నీవు నీకు నచ్చిన విధంగా దేశాలను తయారు చేసుకోవచ్చు. నీకిష్టమైనట్లుగా ఆలోచించవచ్చు, నీకు నచ్చిన మంచి లేదా చెత్త భావాలను ప్రబోధించుకోవచ్చు. ఇప్పుడు, భవిష్యత్‌లో, గతంలో నీవు చేయగలిగావు కదా అలా. కేవలం మరింత శక్తివంతమైన పరిపాలన అవసరం అంతే! దాని వెనుక మరింత శక్తివంతమైన యుద్ధ సామగ్రి ఉండాలి. కాలానికి తగినట్లు యుద్ధరీతులు మారుతుంటాయి మరి!

హిందువులు దీనిని గుర్తించుకోవాలి, ఎలాగైనా సరే రాజకీయాధికారాన్ని కైవసం చేసుకోడానికి కృషి చేయాలి. సామాజిక సంస్కరణలు అవసరం. ఎందుకంటే అవి హిందువుల్లో ‘మానవతా భావాన్ని’ పెంపొదిస్తాయని కాదు, అవి వారికి ఐక్యతను, అధికారాన్ని తీసుకువస్తాయని. ఇంత వరకు, హిందువులు తక్కువ ‘మానవత్వం’తో బ్రతుకుతున్నారు. తమ దైనందిన జీవితాల్లో వారు ఖచ్చితంగా అమలు చేసిన హిందూ ఛాందసవాద ఫలితంగా, ఎన్నో చూడబడని నాటకాలు, ఎన్నో అణచివేయబడిన ఆశలు, ఎన్నో అలసిన అతి హీన జీవితాలు ఏర్పడినాయి. వాటిని గురించి మనం మాట్లాడము. ‘మానవత్వం’ పేరిట, మనం బాధితుల పక్షాన మాట్లాడము. తక్కువ ‘మానవత్వం’ తోనే హిందూ జాతి, ఒక దేశంగా మరింత బలంగా ఎదుగుతూ వుండింది అనుకుంటే (రోజూ రోజుకూ బలహీనపడకుండా), తక్కువ మానవత్వం తోనే హిందువులు తమను తాము వ్యవస్థీకృతం చేసుకుంటూ ఉండినారని అనుకుంటే, తమంత తాము భారతదేశాన్ని పునర్విజితురాలిని చేసుకున్నారని అనిపిస్తే, స్వేచ్ఛా భారతాన్ని ఒక పరిపాలించే శక్తిగా చేయగలిగారని అనిపిస్తే, అప్పుడు, మనం వారిని వారి అలవాట్లను కొంచమైనా మార్చుకొమ్మని అడగనే అడగం. వారి అతి తీవ్రమైన మూఢాచారాలను విడనాడాలని అడగనే అడగం. హిందువులందరూ సంఘటితం కాకపోతే, హైందవత్వం పరిఢవల్లి, భవష్యత్తులో ఇంకా బలపడదు అనిపిస్తే, అస్పృశ్యతను రూపుమాపాలని కూడా అసలు అడగం. పాతుకుపోయిన ఆచారాల కంటే బలీయమైన శక్తి ఏదీ ఉండదు. మానవతా దృక్పథాలు వాటిని నిర్మూలించే లేక పోయాయి. కాని, కొన్ని సార్లు, ఒక కఠినమైన ఒత్తిడి కాదనరాని అవసరం వాటిని కొంత వరకు తొలగించింది. హిందువులు మైనారిటీగా ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా, వారి తొలి ప్రాధాన్యం వారి మనుగడ కాబట్టి, ఈ అవసరం, హిందువులను ఒత్తిడి చేస్తూంది. వారు బ్రతకాలంటే, వారు బలపడాలి. వారి చేతిలో రాజకీయాధికారం ఉండాలి. మనం, సామాజిక సంస్కరణలను, అస్పృశ్యతా నిర్మూలనను, దైనందిన సామాజిక విషయంలో పట్టువిడుపు ధోరణిని, బలవంతులైన కొండ జాతి వారితో పొత్తును (అవసరం కాబట్టి), హైందవత్వంలోకి అందరూ వెనక్కి రావాలనే పిలుపును, ఎందుకు ప్రబోధిస్తామంటే, హిందువులు రాజకీయ శక్తిని కైవసం చేసుకోడానికి ఇవన్నీ ప్రభావవంతమైన మార్గాలు. వాటి ద్వారా మాత్రమే, భారతదేశం లోపలా బయటా, ఒకనాడు జాతీయ వైభవం సాధ్యం అవుతంది.

కాని, హిందూత్వ పరిధిలో ఉండిపోయిన, అంతా బాగుందని అనుకునే, గత దార్శనికులతో అద్భుతంగా ప్రభావితులైన హిందువులు, చివరి హిందూ సనాతనవాదులు. తగినంత రాజకీయ చైతన్యం కలిగిన వారు కాదు. అసలు, హిందువులుగా వారికి రాజకీయ దృక్పథమే లేదు.

 కొన్ని సార్లు, వారు మత పరమైన స్పృహను, ఎప్పుడూ ఆధ్యాత్మిక స్పృహను కలిగి ఉంటారు. వారితో ఒక చైతన్యవంతమైన జాతిని నిర్మించటానికి, అవి చాలవు. అన్ని హిందూ ప్రయత్నాల్లో, గోచరించే నిర్లక్ష్యం, జడత్వాలను, విదిలించి వేయాలంటే, అవి అసలు చాలవు. ఆ జడత్వమే వేల సంవత్సరాల బానిసత్వానికి, భారతదేశం మండుతూ ఉండటానికి కారణం.

అలాంటి, నిశ్చేతనను తొలగించాలంటే ఒక అద్భుతమైన ఊపు కావాలి. అది వెంటనే, పూర్తిగా తొలగించబడాలి, కనీసం కొన్ని అత్యంత ప్రమాదకరమైన బెదిరింపులకు లోనవుతున్న ప్రాంతాలలోనన్నా, హిందువులు ఎప్పటికీ ఊడ్చిపెట్టకుపోతారనే భయం ఉన్న ప్రాంతాలలోనన్నా, అది మెల్లగా, నిదానంగా జరగనే కూడదు. వెంటనే, పూర్తి స్థాయిలో జరగాలి. ఎందుకంటే, హిందూ వ్యతిరేక శక్తులు, మన చుట్టూ బలపడి ఉన్నాయి. హిందువులే బాధ్యత వహించాల్సిన వివిధ ‘ప్రజాస్వామిక’ ప్రచారాలు, రోజు రోజుకూ ఉవ్వెత్తున ఎగసిపడుతూ, హిందూ సంస్కృతికి, నాగరికతకూ, ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ కొద్ది మందినీ నలిపి వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. చరిత్ర ఇంత వరకు ఎవరి కోసమూ ఆగిన దాఖలాలు లేవు.

కేవలం రాజకీయ చైతన్యం, సరియైన విధానంలో, హిందువుల్లో ఏర్పడినపుడు మాత్రమే, వారు ఈ తుఫానును ఎదుర్కొని, గెలిచి, పాలించగలరు.

బెంగాలులో, మహమ్మదీయులు, భారతీయులుగా కాకపోయినా, కనీసం మహమ్మదీయులుగా, బలంగా ఉన్నారు. వారు హిందువులతో పాటు, తాత్కాలికమైన విదేశీ అధిపత్యాన్ని, శాశ్వతమైన ఒక నిరాశాజనకమైన వాతావరణాన్ని పంచుకుంటారు. కాని హిందువుల ‘అనాసక్తి’ని మాత్రం పంచుకోరు. అవసరమైనప్పుడల్లా, దాడి చేయడానికైనా, నిరసన తెలపడానికైనా, వారు మూకుమ్మడిగా సిద్ధమైతారు. ‘తమ హక్కుల’ మీద పెత్తనం చేసే దేనినీ వారు అనుమతించరు, వారి దానికంటే ఆ బలం మరింత శక్తివంతమైనదైతే తప్ప.

ఈ తేడా ఎందుకొస్తుందంటే, వారి మతం వల్ల. అది బలమైన, విశ్వాసాధారిత మతం. హిందువు మతం అలా కాదు. పరమార్థమైన సత్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నానని, అదే తన ఆత్మను కాపాడుతుందని భావించే వ్యక్తి, ఈ విశ్వాసం చేత బలపరచబడతాడు. దీన్ని అంగీకరించాలి. అంతే కాదు అతడు, అతనిలాగా, అదే విశ్వసాన్ని బలంగా స్వీకరించే ఎవరైనా, అదే దేవుడికు, అదే నిజమైన ప్రవక్తకు విధేయుడుగా ఉండే వారైనా, ఒకరికొకరు దగ్గరగా ఉండరు, ఏ ఇతర వేదాంతుల కంటే కూడా. ఈ వేదాంతులు, ఒకే ధర్మాన్ని విశ్వసిస్తారు, అంగీకరిస్తారు. హేతుబద్ధంగా, కొద్దో గొప్పో, తేడాతో, చాలా మందితోబాటు వారూ, ఏ ఇతర, మత దృక్పథం కలిగిన వారి కంటే, కూడా, చాలా వాటిలో అది ఒకటి అని తెలిసీ, ఒకే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వారి కంటే కూడా, ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. తప్పకుండా, ఒకానొక పుస్తకంలో వ్రాసిన, చర్చించబడని, విశ్వాసం, పవిత్రమైన దానిగా గౌరవించబడినప్పటికీ అది అశాస్త్రీయమే. కాని అది దాన్ని అనుసరించే వాడిని బలవంతునిగా చేస్తుంది. అది ఒక దేశాన్ని బలంగా చేస్తుంది, ప్రయోగశీలంగా అది ‘చర్య’ ను పెంపొందిస్తుంది, గొప్ప విషయాలకు దారితీస్తుంది. ప్రజల సహజమైన అలసత్వాన్ని విదిలించుకుని, బయటకు వచ్చేలా చేస్తుంది. వారు ఏదీ పట్టనివారుగా ఉండిపోవడాన్ని అనుమతించదు.

హిందువుల విశ్వాశాలు అనేకమైనవి, పరస్పర విరుద్ధమైనవి. వారి మతం ప్రయోగశీలం, వారి దృక్పథం శాస్త్రీయం, వారు మత మౌఢ్యం యొక్క ప్రయోజనాలను పొందాలని ఆశించలేరు. అలాగని, వారు ప్రతి విషయంలో తమ శాస్త్రీయ దృక్పథం పట్ల విశ్వాసపాత్రులై ఉంటారని కాదు. అలా ఉండరని ఋజువు చేయడం సులువే. కాని వారు మత పరమైన విషయాల్లో అలా వుండరు. కాని సామాజక విషయాల్లో ఉంటారు. దాని ఫలితం, మహమ్మదీయుల మత మౌఢ్యం, మతోన్మాదం వారిని బలవంతులను చేస్తే, హిందువుల మతావేశం, అసలు అలాంటిదేమైన ఉంటే, వారిని బలహీనులుగా చేస్తుంది. మొదటిది ఇస్లాం పరిధికి, మిగిలిన ప్రపంచానికి ఉన్న దూరాన్ని మరింత పెంచుతుంది. కాని అదే సమయంలో దానిలోని విభేదాలను పక్కకు నెడుతుంది. ఆ పరిధిలోని ఇద్దరు మహమ్మదీయుల మధ్య గల బంధాన్ని బలోపేతం చేస్తుంది. అది కాని దాన్నంతా, తమ పరిధి నుంచి వేరు చేస్తుంది. తన పరిధిని ఏకం చేస్తుంది. తన ఉనికి పట్ల దానిని జాగృతం చేస్తుంది, ఏకమొత్తంగా. కాని హిందువుల పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. వారిలో మతోన్మాదం అసలు లేకపోవడం అనేది వారిని ‘వసుధైక కుటుంబకమ్’ అనే తత్త్వానికి దగ్గర చేస్తుంది. వారి ఛాందసం, సాంఘిక విషయాలలో వారి ఉన్మాదం, ఆవేశం, హిందూ మత పరిధిలోనే ఉన్న వారినే, ఒకరికొకరు దూరంగా ఉంచుతుంది. వారు ఒక సంపూర్ణంగా, ఒక దేశంగా, వారి ఉనికిని గురించి చైతన్యం పొందనివ్వదు.

హిందువులు ఏదో ఒక రోజు మహమ్మదీయులలాగా మతోన్మాదులుగా తయారవుతారు అనేది సాధ్యం కాదు (అభిలషణీయం కూడా కాదు) కాని, వారి స్వభావంలో ఒక సంపూర్ణమైన మార్పు రావాలనేది మాత్రం కాదనలేని కఠిన సత్యం. దాని వల్ల వారు, మహమ్మదీయులు తమ మతోన్మాదం వల్ల ఏ ప్రయోజనాలు పొందుతారో, అవన్నీ, ఒక జాతిగా, దేశంగా పొందుతారు. ఆ మార్పు వారిని మిగిలిన ప్రపంచం నుండి వేరు చేస్తుంది. వారికి, ఒక విభిన్న వర్గంగా ఆత్మచైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తుంది. ఇంకో వైపు, ఒక హిందువు తాను మరో హిందువు కంటే వేరు అనే భావాన్ని తొలగిస్తుంది. వారు ఒకరికొకరు దూరంగా, ఒకరి ప్రయోజనాల పట్ల ఒకరు అనాసక్తంగా ఉండటాన్ని పరిహరిస్తుంది. ఒకరి బాధలను, ఫిర్యాదులను, ఒకే పరిధిలో ఉండి కూడా, పట్టించుకోకపోవడాన్ని తొలగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారందరినీ ఏకతాటి మీదికి తెస్తుంది.

ఆ స్వభావంలోని మార్పే అతి ముఖ్యమైనది. ఎందుకంటే బయట ఉన్న అన్ని వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాలన్నా, హైందవత్వ పరిధిలో ఏ నిర్మాణాత్మక చర్య జరగాలన్నా, దాని మీదే ఆధారపడి ఉంది.

హైందవత్వాన్ని స్వేచ్ఛ వైపు, శక్తి వైపు, గొప్పతనం వైపు నడిపించగల మార్గం, ఒక్క మాటలో ఇది.

  1. ప్రతి హిందువు హిందూ జాతీయవాదాన్ని అన్నిటికంటే బలంగా అలవర్చుకోవాలి.
  2. హైందవత్వం అంతటా, దౌర్జన్యానికి ఎదురొడ్డి వ్యవస్థాగతంగా నిలువగలిగిన స్పూర్తిని, చేవను అలవర్చుకునేలా చేయాలి,

జాతీయతా భావ శూన్యత భారతదేశానికి ఒక గొప్ప శాపం. ముస్లింలు దేశ జానాభాలో ఐదో వంతు ఉంటారు. వారు తమను తాము ముస్లింలమనే అనుకుంటారు గాని, భారతీయులమని అనుకోరు. మహా అయితే, వారిలో కొందరు, కొంత వరకు తాము బారతీయులమని అనుకుంటారేమో! కాని మొదట మాత్రం, వారు ముస్లింలే! వారిలో ఎవరూ మొదట భారతీయులు కాదు. వారు తర్వాత నిరూపించారు, ఇస్లాం వారిని, భారతీయులమనే స్వీయ నిర్ధారణ నుంచి నిరోధించ లేదని, ఎవరూ, భారతీయులు మరియు ముస్లింలు ఒకేలా కారు. ఒక ఫ్రెంచి వాడు, లేదా ఒక ఇటలీ వాడు ఒకే సారి ఆ జాతీయుడు మరియు క్రిస్టియన్ ఐనట్లు, అంటే, మొదట ఫ్రెంచు వాడు, మొదట ఇటాలియన్, క్రైస్తవం అతని దేశభక్తికి అవరోధం కానంత వరకు అతడు క్రిస్టియన్.

హిందువుల్లో, చాలామందికి బాగా పాతుకుపోయిన కుల పట్టింపు, కుల స్పృహ ఉంటాయి. హైందవత్వ స్పృహ అస్పష్టంగా ఉంటుంది. భారతీయతా స్పృహ అసలుండదు. ఒక చదువు రాని హిందువుకి (రైల్వేస్టేషన్‌లో పోర్టురు, ఒక రైతు లేదా పల్లెలో ఒక బెస్తవాడు) భారతదేశపటం ఎలా వుంటుందో తెలియదు. అతనికి ఏ దేశపు వైభవాన్ని అతడు పంచుకుంటున్నాడో, ఏ సంప్రదాయంలో కొనసాగుతున్నాడో, దేని గతం భవిష్యత్తులు అతనికి చెందినవో, అతడు ఏ ముఖ్య కారణం చేత హిందువుగా ఉన్నాడో, ఇవన్నీ తెలియవు. అతనికి, హిందువుగా ఉండాలంటే కొన్ని సాంఘిక ఆచారాలను పాటించాలని మాత్రం తెలుసు (కొందరితో కలిసి భోంచేయకుడదనీ..) కొన్ని సందర్భాలలో కొన్ని పండుగల్లో పాలు పంచుకోవాలనీ తెలుసు (ఒక పౌర్ణమి రోజు రాత్రి, గుమిగూడి, భగవంతుడి పేరును గానం చేస్తూ, డప్పులు వాయించడం) సుదూర ప్రాంతాల్లో, తమ దేవుళ్లనే కొలిచే వారున్నారని అతనికి తెలుసు. తమ పవిత్ర స్థలాలు, నదులనే వారు కూడా పవిత్రంగా భావిస్తారని తెలుసు. తమ లాగే పండుగలు జరుపుకుంటారని తెలుసు. వారంతా హిందువులు. వారు, అతడు. ఒకే నాగరికతలో భాగం.అది అతడు భావిస్తాడు కానీ, కొంచంగా అతనికీ వారికీ మధ్య ఎన్నో కట్టుబాట్లు, సరిహద్దులు ఉన్నాయి. హైందవత్వం పట్ల అతనికున్న అభిప్రాయం మధ్యయుగాల్లో అజ్ఞాని ఐన ఐరోపా జాతీయినికి క్రైస్తవత్వం పట్ల ఉన్నంత స్పష్టంగా ఉండదు. ఒక జాతీయతా భావ చైతన్యంతో పోల్చి చూడబడేంత గొప్పదేం కాదది.

నిజంగా హైందవ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే హిందువుల్లో, అతి కొద్ది మంది మాత్రమే భారత జాతీయవాదులు. సామాజికంగా, వారు వివిధ కులాలలో సభ్యులే. అంతే కాకుండా, వారు స్వేచ్చగా ఆలోచించే వేదాంతులుగా నైనా ఉంటారు. విశ్వజనీన దృక్పథాన్ని చిరునవ్వుతో ప్రదర్శిస్తూ ఉంటారు. వారికి దేని మీదా ప్రత్యేకమైన, ప్రేమ ఉండదు. లేదా భగవంతున్ని ప్రేమించే పూర్తి ఆధ్యాత్మికవాదులై ఉంటారు. కనీసం వారు తమ సొంత ఆత్మజ్ఞానాన్ని పొందే విధంగా తమ అభివృద్ధి పథాన్ని ఏర్పరుచుకొనే వారై ఉంటారు.

ఇక, గత మూడు దశాబ్దాలుగా భారత జాతీయవాదాన్ని, మళ్లీ గుర్తించిన హిందువుల విషయానికొస్తే, వారు భారత జాతీయ కాంగ్రెస్‌ను నిర్మించిన వారు, భారతదేశం కోసం నానా కష్టాలు పడి, దేశాన్ని అన్నిటికంటే మిన్నగా భావించిన వారు సైతం ఒక విషయాన్ని మరచిపోయినట్లు అనిపిస్తుంది. అదేమిటంటే హైందవత్వానికి వేరుగా, భారతదేశమే ఉండదు అనేది. వారు, హిందువులైనా సరే, మరీ తరచుగా, జాతీయవాదులు. అది వారు కేవలం హిందువులవడం వల్ల మాత్రమే కాదు, చాలా మంది, ఐరోపా క్రైస్తవులు క్రైస్తవువైనా సరే, జాతీయవాదులైనట్లు.

కాని, క్రైస్తవం, ఇస్లాం, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా, మౌలికంగా, అంతర్జాతీయమైనవి. ఒక క్రిస్టియన్ అయినా సరే అతడు నిజమైన జాతీయవాది కాలేడు. కాని ఒక హిందువు అవగలడు. అతడు హిందువు కాబట్టి, ఒక హిందువు భారత జాతీయవాదిగా ఉండాలి. ఎందుకంటే, హిందువు కళలు, సంస్కృతి, జీవితం, హిందూ వైభవంలోని ప్రతిదీ భారత్‌దే, భారత్‌ది మాత్రమే. మరీ ఎందుకంటే, హైందవత్వం పరిధిలో తప్ప, భారత జాతీయవాదపు స్వచ్ఛమైన వ్యక్తీకరణ, భారతమాతను భక్తితో ఆరాధించడం అనేవి ఎక్కడా వుండవు, ఎక్కడా పెరగవు, ఎక్కడా ప్రసిద్ధి చెందవు.

మస్లింలు, మొదట ముస్లింలు. తర్వాతే, కొన్ని సార్లు భారతీయులు కావొచ్చు. ఎప్పుడంటే ఇస్లాం ప్రయోజనాలకు భారత్ ప్రయోజనాల వల్ల విఘాతం రానంత వరకు.

ఇక, ఆ కొద్ది మంది చైతన్యం గల హిందువులు ఆధునిక ఐరోపా తరహా భారత జాతీయవాదులన్నా అయి ఉంటారు. లేదా, ముందు వేదాంతులు, తర్వాత భారతీయులు అయి ఉంటారు. వారు మతాన్ని రాజ్యాన్ని యూరోపియన్లలాగా వేరు చేసి చూస్తారు. వారు మొదట ఆధ్యాత్మికవాదులు, తర్వాతే భారతీయులు. మొదట ఒకానొక దేవుడికి భక్తులు, ఒకానొక గురువుగారికి శిష్యులు, ఒకనొక మత ఉద్యమానికి సానుభూతిపరులు. తర్వాతే వారు భారతీయులు.

(ఇంకా ఉంది)

Exit mobile version