భావ ప్రకటన-2

0
2

[మాయా ఏంజిలో రచించిన ‘Communication 2’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(ప్రాచీన సాహితీ భాండాగారాన్ని నేటి తరం చదవకపోవడం బాధాకరం అన్న సత్యం గోచరిస్తుందీ కవితలో!)

~

విద్యార్థి

పురాతన గ్రంథాల కాగితపు ధూళి
అతడి ముఖాన్ని ఎప్పుడూ తాకలేదు
ఏమీ తెలియని యువకుడి వెనకాల
ఫౌంటెన్ కలాలు
చీకట్లో నిశ్శబ్దంగా
ఒకచోట భద్రపరచి ఉన్నాయి
~
గురువు

ఆమె తన అక్షర కృషిని పంచుకుంది
నగిషీలు చెక్కబడిన
ప్రాచీన కుడ్యాల మీద
పొడిబారిన ఆమె స్వప్నాలు
పెద్ద గదుల కిందుగా
పునర్నిర్మాణపు వేదనతో
ప్రతిధ్వనిస్తున్నాయి!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here