భగల్‌పూర్ మంజుష కళ

0
2

[dropcap]మం[/dropcap]జుష కళ బీహార్ రాష్ట్రం యొక్క పురాతన మరియు చారిత్రాత్మకమైన కళారూపం. బీహార్ లోని భగల్‌పూర్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే కళ. భగల్‌పూర్‌ను పూర్వం ‘అంగ్’ అని పిలిచేవారు. అందుకే మంజుష కళను ‘అంగిక కళ’ అని కూడా పిలుస్తారు. ఆలయ ఆకారంలో ఉండే పెట్టెలు ఈ మంజుష కలలో ప్రధానమైనవి. వెదురు, జనపనార, కాగితాలతోనే ఈ కలకృతులను తాయారు చేస్తారు. విదేశీయులు ఈ మంజుష కళను ‘స్నేక్ పెయింటింగ్’ అని పిలుస్తారు. ఈ కళలో చిత్రాలకు బార్పర్లు ప్రాధాన్యం వహిస్తాయి. ఇందులో ఎక్కువగా మూడు రంగులనే ఉపయోగిస్తారు. చంద్రుడు, శివుడు, హనుమాన్, చందు సౌదాగర్ వంటి వారు ముఖ్యమైన పాత్రలుగా కనిపిస్తారు. మంజుష కళలో దేవాలయం ఆకారపు పెట్టెలుంటాయని చెప్పుకున్నాం కదా. మంజుష అంటే అర్థం తెలుసా? ‘పెట్టె’ అని అర్థం. అవి పెట్టెల వలె ఉంటాయనే ఉద్దేశం తోనే దీనికి ‘మంజుష కళ’ అని పేరు పెట్టారు. సూర్యుడు, ఏనుగు, తాబేలు, చేపలు, మైనా పక్షి, బాణం, విల్లు వంటివి ఈ కళలో ప్రధానంగా కనిపిస్తాయి.

మంజూష ఆనే సంస్కృత పదానికి అర్థం ‘పెట్టి’ అని చెప్పుకున్నాం. పెట్టెలు ఒక కథను చెప్పడం వినూత్నమైన కళ. ఈ పెట్టెలను వెదురు, జనపనార, గడ్డి, కాగితాలతో తయారుచేసి వాటి పై భాగాలను పెయింటింగులతో అలంకరిస్తారు. ఈ పెయింటింగులతో కొన్ని కథలను వివరించటం జరుగుతుంది. వారు పూజించే దేవత కోపం వల్ల పాము కాటు వేస్తుందని నమ్ముతారు. బిహులా అనే ఆమె తన భర్తను బీషావారి నుండి రక్షించుకున్న పైనాన్ని వివరిస్తారు. పూర్వకాలంలో మంజూషా కళను కుంభకర్ మరియు మలాకర్ వర్గాలకు చెందిన కుటంబాల వారు మాత్రమే చెక్కేవారు. మాలాకార్‌లు మంజూషాలను తయారుచేసి వాటిపై మంజూషా కళను వెయ్యటం మొదలు పెట్టారు. మొదటగా కుంభకర్‌లు మాత్రం ఈ మంజుషా కళను కుండలపై వేసుకుని పూజించేవారు.

ఈ కళలో ముఖ్యంగా ప్రాముఖ్యత గలిగిన రంగుల్నే ఉపయోగిస్తారు. పసుపురంగును విశ్వాసం, ఆనందం, సరదా ఉత్సాహం ఆశావాదం కోసం ఉపయోగిస్తారు. అలాగే పింక్ రంగును బంధం విజయం, సంరక్షణ వంటి వాటికి ఉపయోగిస్తారు. అదే విధంగా ఆకుపచ్చను ప్రకృతి, ఆరోగ్యం ఆర్థిక లావాదేవీలను సూచించేందుకు వాడతారు. ఈ కళలో ప్రతి వాటికీ బార్డరు ఉంటాయి చక్కని డిజైన్లలో గీయబడతాయి.

ఇదోక విలక్షణమైన కళ. ఇందులో కూడా పర్లి వలె ‘x’ అనే అక్షరంతో మనుషులు చిత్రించబడతారు. అయితే ఇందులోని పాత్రలు పెద్ద కళ్ళుతో ఉంటాయి. ఇంకా చెవులు లేకుండా చేస్తారు. ఈ పాత్రల్ని బిషహరిలు అంటారని చెప్పుకున్నాం కదా. అందరు బిషహరిలు ఒకే విధంగా ఉంటారు. కేవలం వారి చేతిలో పట్టుకున్నా వస్తువులే వారిని వేరుగా గుర్తు పట్టడానికి ఉపయోగిస్తాయి. జయ బిషహరి ఒక చేతిలో పాము, విల్లు, బాణాలు మరో చేతిలో అమృత కలకాన్ని పట్టుకున్నది. పద్మావతి బిషహరి ఒక చేతిలో పాము, మరో చేతిలో కమలం కనిపిస్తుంది. మైనా బిషహరి ఒక చేతిలో మైన మరొక చేతిలో పాము ఉంటుంది. మానస బిషహరి చేతిలో రెండు పాముల్నీ పట్టుకున్నది. ఇలా పాములు మాత్రం తప్పని సరిగా ఉంటాయి. ఇంకా బిల్వ పత్రాలతో శివుడి పూజంచే చిత్రాలు కూడా ఉంటాయి.

మొదటగా కళా రూపాన్ని తయారు చేసేటప్పుడు గదిలో బియ్యాన్ని కుప్పగా పోస్తారు. కళాకారుడు ఈ కుప్పపై తమలపాకును ఉంచి దేవతలను ప్రార్థిస్తాడు. ఆకు కొద్దిగా వాడటం లేదా పడిపోవటం వలన దేవుడు అనుమతి ఇచ్చాడని భావించి చిత్రాన్ని తయారు చేయటం మొదలుపెడతారు. చుట్టూ ఉన్న గీతను మాత్రం ఆకుపచ్చ రంగులోనే గీస్తారు. కానీ ఆధునిక కాలంలో కొంత మంది నలుపు రంగును కూడా వాడుతున్నారు.

 

ఈ మంజుష కళకు మతపరమైన ప్రాముఖ్యత ఉన్నది. బిషహరి పండుగలో ఆ కథలను చెప్పడానికి మంజుష కళతో పెట్టెలు తయారవుతాయి. పండుగ పూర్తయ్యాక సరస్సులో ముంచేస్తారు. పూజకు ముందు విపరీతంగా అలంకరిస్తారు. ప్రతి ఏడాది ఆగస్టు 17, 18వ తేదిల్లో బిషహరి పండుగను జరుపుతారు. ఈ పూజ జరిపే సమయంలో కలశం, మంజూషలను తయారు చేస్తారు. కలశాన్ని కుంభకారుడు, మంజుషను మాలకారుడు తయారు చేసి పండుగకు సిద్ధం చేస్తారు. బిషహరి అన్ని పాముల నుండి తమను, తమ భర్తలను కాపాడుతుందని నమ్ముతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here