[box type=’note’ fontsize=’16’] సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకవి లిఖిత్ కుమార్ గోదా రాసిన మణిపూసలు (లఘు కవితా ప్రక్రియ) అందిస్తున్నాము. [/box]
[dropcap]భా[/dropcap]రతీయ సింహమతడు
బంగాలో పుట్టెనతడు
భగత్ సింగ్ వీరుడే
కుష్వంత్ సింగ్‌కు కుమారుడు!
~
భారతమాత పుత్రుడు
భయమే లేని వీరుడు
లక్ష్యం స్వాతంత్ర్యమే
ఎదురే లేని ధీరుడు!
~
బాంబుల వాన కురిసే
అసెంబ్లీయే జడిసే
విప్లవ వీరున్ని చూసి
దేశమంతా మురిసే!
~
అనంతం దేశభక్తి
అపారం అతడి యుక్తి
తెల్ల దొరలు చూసెను
విప్లవ వీరుని శక్తి!
~
స్వరాజ్యంకై పోరాడె
ఉరితాడునే ముద్దాడె
భగత్ సింగ్ త్యాగం చూసి
ప్రజలు పోరుకు కదలాడె!
~