[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని సర్వ వ్యాపకతత్వం’ అనే రచనని అందిస్తున్నాము.]
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా।
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతం॥
(భగవద్గీత 8వ అధ్యాయం, 22వ శ్లోకం)
[dropcap]“ఓ[/dropcap] అర్జునా, అందరికన్నా అధికుడైన భగవంతుడు అనన్య భక్తి చేతనే పొందబదతాడన్నది నిశ్చయం. అతను తన ధామములో నిలచివున్ననూ ఈ జగమంతటా సర్వ వ్యాప్తియై వున్నాడు. అంతే కాక అతని యందే ఈ సర్వ జగత్తు నిండి వున్నది” అన్నది పై శ్లీకం భావం.
సర్వవ్యాపి లేదా అయిన భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోవడం శాస్త్రం నాకు విధించిన అన్న్ని మార్గాలలోకెల్లా బహు కష్టం. ఎందుకంటే, భగవంతుని దివ్యత్వాన్ని గ్రహించాలంటే మన ఇంద్రియాలు పరమాత్మ తత్వంలో స్థిరంగా నిలిచి ఉండాలి. ఆయన అనుగ్రహం ద్వారా, ఆయన దివ్య శక్తి యోగమాయ మనలో దివ్య ఇంద్రియాలను, మనస్సును మరియు బుద్ధిని ప్రేరేపిస్తుంది, తద్వారా మనం అతని సర్వవ్యాప్తి తత్వాన్ని ఈ విధంగా, ఈ శ్లోకంలో, భక్తి ద్వారా మాత్రమే మనం ఆయనను తెలుసుకోగలమని శ్రీ కృష్ణుడు ప్రకటించాడు.
భక్తి మార్గం చాలా కష్తం అయినప్పటికీ అసాధ్యం కాదని మార్కండేయుడు, ధృవుడు, ప్రహ్లాదుడు, తుకారాం, ఏకనాధుడు వంటి భగవతోత్తముల జీవిత చరిత్రలు మనకు తెలియజేస్తున్నాయి. సర్వవ్యాపి లేదా సర్వవ్యాపి అయిన భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోవడం కష్టం.
నిర్గుణ, నిరంజన, నిరామయ, నిర్వికల్ప, నిత్య, సత్య, శుద్ధ స్వరూపుడు భగవంతుడు. అట్టి స్వామి, అంతటా, అందరిలోనూ సర్వ వ్యాపకత్వంగా, గుణ రహితుడై ఉన్నాడు అని ఉపనిషత్తు చెప్తుంది. ఒక్క గుణమున్న ఆకాశమే అంతటా వ్యాపించి ఉన్నపుడు (వీటిని సృష్టించిన) నిర్గుణుడు అయిన ఆ దేవ దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనుటలో సందేహమే లేదు అని ఇంత విపులంగా ‘ఉపనిషత్తు’ చెపుతుంది. దీనినే ‘నిర్గుణుడు అయిన భగవానుడు సర్వ వ్యాపకుడు’ అని ఒక్క వాక్యంలో చెపితే దీనిని ‘స్ధాలీ పులాక న్యాయం’ అంటారు.
అన్నీ తెలిసినవాడు దేవుడు. అన్నీ తెలుసును అనుకునేవాడు జీవుడు. అహం బ్రహ్మాస్మి దేవుడు. అహం బ్రహ్మాస్మి అనుకునేవాడు జీవుడు. భవబంధాలు లేని వాడు దేవుడు. బంధాలలోను బంధనాలలోను యిరుక్కునే వాడు జీవుడు. అంతా అన్నింటా తానై ఉండేవాడు దేవుడు. అన్నీ తానే అనుకునేవాడు జీవుడు. జ్ఞాన బ్రహ్మం దేవుడు. మన కొలతలకు కొలమా నాలకు భగవంతుడు అతీతంగా ఉంటాడు. పరిశోధనలకు ప్రయోగాలకు అందనంత ఎత్తులో ఉంటాడు. దొరకనంత దూరంగా ఉంటాడు. అతడ్ని పట్టుకోగలిగేది, పట్టి ఉంచేది, బంధించేది, బంధన చేసేది భక్తి ఒక్కటే. భక్తిని పెంచుకుందాం. భగవంతుణ్ణి బంధించుకుందాం.
జీవన బంధనాల నుండి విముక్తులవుదాం. అతని దివ్య రూపంలో ఆయనను ఆరాధించడం మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది, ఇది ఆయన దివ్య కృపను ఆకర్షించడానికి అవసరం. ఎందుకంటే, భగవంతుని దివ్యత్వాన్ని గ్రహించాలంటే మన ఇంద్రియాలు పరమాత్మగా ఉండాలి. ఆయన అనుగ్రహం ద్వారా, ఆయన దివ్య శక్తి యోగమాయ మనలో దివ్య ఇంద్రియాలను, మనస్సును మరియు బుద్ధిని ప్రేరేపిస్తుంది, తద్వారా మనం అతని సర్వవ్యాప్తి అంశం మరియు అతని వ్యక్తిగత రూపం రెండింటినీ తెలుసుకోగలుగుతాము. ఈ విధంగా, ఈ శ్లోకంలో, భక్తి ద్వారా మాత్రమే మనం ఆయనను తెలుసుకోగలమని శ్రీకృష్ణుడు ప్రకటించాడు.
భక్త్యా అన్న అర్థం సూచించినట్లు దివ్యమైన భగవంతుని తత్వం తెలుసుకునేందుకు భక్తి యోగం ద్వారానే సాధ్యం అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. భగవద్ధామాని చేరేందుకు మరి ఇతర ఏ విధమైన మార్గం అనుసరించడం ఈ కలియుగంలో చాలా కష్టం. గోపాలతాపన్యుపనిషత్తు ప్రకారం ఏకోవళీ సర్వగః కృష్ణ అంటే భగవంతుని దివ్యధామంలో శ్రీకృష్ణుడు అనబడే దేవదేవుడు ఒక్కడే వుంటాడు. ఆయనకు అనేక నామాలు రూపాలు వున్నా భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుక్షణం ప్రదర్శిస్తూ వుంటాడు. ఆ దేవదేవుడు అనుక్షణం పరిపూర్ణ కరుణా కటాక్షాలను ఈ సకల చరాచర సృష్టిపై ప్రసరిస్తూ వుంటాడు. ఆయన అనుగ్రహం వల్లనే ఆయన సర్వ వ్యాపక శక్తులు, జగత్తులో సమస్త పాలనను ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నాయి.