[dropcap]దై[/dropcap]వ భక్తి, దేశ భక్తి
పండుగ రోజు నినాదాలు కాకూడదు.
ప్రతి రోజూ మనసులో కదలాడాలి.
దైవం ఆలోచనని ఇస్తే
దేశం కోసం అది ఆచరించాలి
దైవానికి ఆరాధన అంటే
దేశమాతకు మోకరిల్లాలి
దైవానికి నైవేద్యం అంటే
దేశ జనుల ఆకలి తీర్చాలి
దైవానికి శుచి శుభ్రత అంటే
దేశమంతా పరిశుభ్రత పరిఢవిల్లాలి
దైవానికి పూజలు చేయడమంటే
ప్రజలందరికీ విద్య అందాలి
దైవానికి ప్రదక్షిణ అంటే
దేశంలో చక్కని రహదారి కూర్చాలి
దైవాన్ని ఒకరి బాగు కోసం కంటే
దేశమంతా బాగుండాలని ప్రార్థించాలి
దైవం జీవన గమ్యమైతే
దేశం దానికి దిక్సూచి
దైవం జీవన గమ్యమైతే
దేశం దానికి దిక్సూచి
అందుకే,
దైవ భక్తి, దేశ భక్తి
పండుగ రోజు నినాదాలు కాకూడదు.
ప్రతి రోజూ మనసులో కదలాడాలి.