Site icon Sanchika

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 49: కాకుమాను

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 49” వ్యాసంలో కాకుమాను లోని శ్రీ ఆగస్త్యేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]కొ[/dropcap]మ్మూరు తర్వాత దోవలో కాకుమాను వస్తుంది… అక్కడ ఆలయం చూసుకుని కొండపాటూరు వెళ్ళండని చెప్పారు శ్రీ కృష్ణారావుగారు కొమ్మూరులో.

కాకుమానులో దేవాలయం మేము వెళ్ళే దోవకి పక్కనే కనిపించింది. అతి సుందరమైన ఆలయం. ఇది కూడా శ్రీ ఆగస్త్యేశ్వరస్వామి ఆలయమే అని ఆలయానికి వున్న బోర్డు తెలిపింది.

అన్నీ మంచి ఆలయాలే… లలలా లలలా లలలా అని పాడుకుంటూ పక్కనే వున్న పూజారి గారింటికెళ్ళాం.. మరి గుడి తలుపులు వేసి వున్నాయి… లోపలకి వెళ్ళే మార్గం లేదు.

సమయం సాయంకాలం 4 గంటలు దాటింది. ఇంక తలుపులు తియ్యవచ్చు అని ధైర్యంగా అక్కడివారు చెప్పగా పూజారి గారింటికెళ్ళాము. ఆయన ససేమిరా తలుపులు తియ్యనన్నారు. మేము వచ్చిన కారణం… “ఆలయాల గురించి వ్రాస్తున్నామండీ, మీ ఆలయం గురించి కూడా రాద్దామనే ఉద్దేశంతో వచ్చాము… అన్ని ఊళ్ళూ ఒకే రోజు తిరగటం వల్ల ఆలయం తెరిచి వుంచే సమయంలో రాలేక పోయాము, కొంచెం సహకరించండి” అని చెప్పినా ఆయన చాలా ఖరాఖండీగా “ఆలయం సమయాలలో తప్పితే విడి సమయంలో నేను తియ్యను… మీరు రాస్తే రాయండి…” అన్నారు.

అంత అందమైన ఆలయం చూడలేక పోయామని బాధ కలిగింది. కానీ దగ్గరలో వుండి ఆలయం తియ్యను అని ఇంత ఖచ్చితంగా చెప్పిన ఆయన ఈయనే. ఏం చేస్తాం… మనుషులంతా ఒక్కతీరున వుండరు అనుకుంటూ, పెదనందిపాడు, కొమ్మూరులలో, మా ప్రయత్నాన్ని ఆదరించి, సమయం కాకపోయినా ఆలయం తలుపులు తెరిచి ఎంత సహకరించారో అని వాళ్ళని తలుచుకుంటూ కొండపాటూరు బాటపట్టాము నిరుత్సాహంతో.

ఈ ఊళ్ళో ఇంకా వేరే ఆలయాలు వున్నాయిగానీ అక్కడివారు అవన్నీ కూడా 6 గంటలకి తీస్తారని, ఇంకా లోపలకి వెళ్ళాలని చెప్పారుగానీ, దోవ మాకు అర్థం అయ్యేటట్లు చెప్పలేకపోయారు. మాకు కూడా అప్పటికే వచ్చిన నిరుత్సాహం వల్ల వేరే ప్రయత్నాలు చెయ్యకుండా బయల్దేరాము.

       

ఆలయం బయటనుండే ఫోటోలు తీశాను. ఎంత బాగుందో చూడండి.

Exit mobile version