[dropcap]అ[/dropcap]మరం-అఖండం
అందరిని కలుపు మన భారతదేశం
త్యాగం-సేవ
సమర్పణల సందేశం మన భారతదేశం
పౌరుష -పరాక్రమ
చరిత్రకు సంకేతం మన భారతదేశం
సమాజం -సర్వస్వము
సజీవ సాక్ష్యం మన భారతదేశం
సంఘర్షణల -సమన్వయం
సమతాస్ఫూర్తి మన భారతదేశం
సాధుసంతుల -త్యాగధనుల
ధర్మరక్షణ కేంద్రం మన భారతదేశం
ధర్మార్ధ కామ మోక్షముల
సాధనా స్థలం మన భారతదేశం
గురుశిష్య పరంపరకు
ఆదిగురువు మన భారతదేశం
భారత్ జగద్గురువు
విశ్వకళ్యాణ సాధనం మన భారతదేశం
అందుకే ఓ భారతమా!!!
మేలుకో!! ఈ ప్రపంచాన్ని ఏలుకో!!!!!!!